ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహారిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన కరోనా సాకుతో అప్పటికే ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో సీఎం జగన్ కు చిర్రెత్తుకొచ్చింది. అసలే ముక్కుసూటి మనిషి అయిన జగన్.. నిమ్మగడ్డ చంద్రబాబు కులం మనిషి అని.. ఆయన చంద్రబాబు కోసమే ఇలా చేశారని మండిపడ్డారు.

 

 

అప్పట్లో జగన్ ప్రెస్ మీట్ విన్నవాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. అదేంటి.. ఎన్నికల కమిషనర్ కు కూడా కులం రంగు పులుముతున్నారు అని అనుకున్నారు కూడా.. కానీ జగన్ చేసిన విశ్లేషణ నూటికి నూరు శాతం నిజమే అని ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. జగన్ ప్రెస్ మీట్ తర్వాత జరిగిన అన్ని పరిణామాలు.. నిమ్మగడ్డకూ టీడీపీకీ ఉన్న లింకునే బయటపెట్టాయి.

 

 

అవేంటో చూద్దాం.. జగన్ ప్రెస్ మీట్ తర్వాత తనకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని ఏకంగా కేంద్రానికి నిమ్మగడ్డ పేరిట లేఖ వెళ్లింది. లేఖ చూస్తే అది ఓ ఎన్నికల కమిషనర్ రాసినట్టు లేదు.. ఓ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు రాసినట్టే ఉంది. పదజాలం, భాష అంతా అలాగే ఉంది. ఆ లేఖను తెలుగు దేశం అనుకూల పత్రికలు పేజీలకు పేజీలు ప్రచురించాయి కూడా. విచిత్రం ఏంటంటే.. ఇంత జరిగినా ఆ లేఖ తానే రాసినట్టు నిమ్మగడ్డ ఇప్పటి వరకూ చెప్పలేదు.

 

 

చివరకు మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా దాన్ని ధ్రువీకరించలేదు. కనీసం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీకి మాత్రం.. ఆ లేఖతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆ లేఖను టీడీపీ వాళ్లు ఫోర్జరీ చేశారని ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో నిమ్మగడ్డ ఒక్కసారిగా మేలుకున్నారు. ఇన్నాళ్లు కుంభకర్ణుడి తరహాలో నిద్ర నటించి కనీసం ప్రెస్ నోట్ కూడా ఇవ్వని నిమ్మగడ్డ ఇప్పుడు ఆ లేఖ తాను రాసిందేనని ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనలో నిజం చెప్పాలన్న తాపత్రయం కంటే.. టిడిపి నేతలను కాపాడుకునే తాపత్రయమే కనిపిస్తోంది. టీడీపీకీ నిమ్మగడ్డకూ ఉన్న అవినావభావ సంబంధానికి ఇంతకంటే రుజువేంటని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: