దేశంలో క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా అమ‌ల‌వుతున్న లాక్‌డౌన్‌తో అన్ని రంగాల‌పైనా ప్ర‌బావం ప‌డింద‌న‌డంలో సందేహం లేదు. అయితే, కొన్ని రంగాలు మాత్రం నిత్యం ప‌నిచేయాల్సిందే. వాటిలో పోలీసు, వైద్యం, ఫైర్, రెవెన్యూ స‌హా.. ప్ర‌భుత్వాధీనంలో లేని మీడియా. దీనిలో ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ రెండూ ఉన్నాయి. ఈ రెండూ కూడా ప‌నిచేస్తేనే.. ప్ర‌భుత్వం చేసే ప‌నులు ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతాయి. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల క‌ష్టాలు, న‌ష్టాలు.. లాక్‌డౌన్ ప‌రిస్థితులు ప్ర‌భుత్వాలకు చేర‌తాయి. దీంతో మీడియా పాత్ర ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ కీల‌కంగా మారింది. ఇది ప్ర‌తి ఒక్క‌రూ అంగీక‌రించే విష‌య‌మే. అయితే, ప‌త్రిక‌లు, మీడియాను న‌డిపిస్తున్న అధిప‌తులు మాత్రం లాక్‌డౌన్ నెపంతో పాత్రికేయుల‌పై క‌త్తిదూస్తున్నారు.

 

నిన్న మొన్న‌టి వ‌ర‌కు అనేక రూపాల్లో మీడియాలో ప‌నిచేస్తున్న‌పాత్రికేయుల‌ను అనేక రూపాల్లో వ‌దిలించుకున్న ప‌త్రికాధిపతులు తాజాగా మ‌రికొన్ని నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు తెలియ‌వ‌చ్చింది. నిజానికి గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో బాగానే వెనుకేసు కున్నా.. ఇప్పుడు ప్ర‌భుత్వం మార‌డంతో ఈ సంస్థ‌ల‌కు ఆదాయం త‌గ్గిన మాట వాస్త‌వే. అయితే, గ‌త ఐదేళ్లు పోగేసుకున్న వేల కోట్ల‌ను ఏమ‌న్నా ఉద్యోగుల‌కు కొద్దిగా అయినా పంచారా ? అనేది నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌రిగిన చ‌ర్చ‌. అయినా కూడా అధిప‌తులు ఈ విమ‌ర్శ‌ల‌ను లెక్క‌చేయ‌డం లేదు. 

 

మేం స‌మాజానికి మాత్ర‌మే నీతులు చెబ‌తాం! అనే ధోర‌ణినే అవ‌లంబించారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రిన్ని నిర్ణ‌యాల‌ను వ‌డివ‌డిగా అమ‌లు చేసేందుకు వేగంగా ప‌రుగులు పెడుతున్నారు. ఇప్ప‌టికే తీసుకున్న నిర్ణ‌యాలను ప‌రిశీలిస్తే.. 30 శాతం నుంచి 40 శాతం వ‌ర‌కు ఉద్యోగుల్లో కోత పెట్టారు. ఈ నిర్ణ‌యం అటు ఎల‌క్ట్రానిక్‌, ఇటు ప్రింట్ మీడియాలో సాగింది. ఇక‌, జిల్లాల టాబ్లాయిడ్ పేజీల‌ను, నియ‌జ‌క‌వ‌ర్గం పేజీల‌ను తీసేశారు. అదే స‌మ‌యంలో పేజీల సంఖ్య‌ను భారీ ఎత్తున కుదించారు. వీటితోపాటు.. ఉద్యోగుల‌ను తీసేసిన వారిని తీసేయ‌గా.. ప‌నిచేస్తున్న వారి జీతాల్లో 25 శాతం కోత పెట్టారు. ఇవి నిన్న‌టి వ‌ర‌కు అమ‌ల్లో ఉన్న‌వి. ఇక‌, ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణ‌యాలు చూస్తే.. రిపోర్ట‌ల‌కు ఇచ్చే పెట్రోల్ అల‌వెన్స్‌ను ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యించారు. 

 

అదే స‌మ‌యంలో ఉద్యోగి పీఎఫ్‌లో సంస్థ వాటాను ఉప‌సంహ‌రించి రెండు వాటాలు అంటే ఉద్యోగి వాటా+సంస్థ వాటాలు రెండింటినీ కూడా ఉద్యోగి వేతనం నుంచే మిన‌హాయించ‌నున్నారు. అదేవిధంగా వ‌చ్చే నెల నుంచి మ‌రో 5శాతం వేతనంలో కోత అంటే మొత్తంగా 30శాతం కోత పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇక‌, ఇప్ప‌టికే ఉన్న ఉద్యోగుల్లో మ‌రో 5శాతం కోత పెట్టి ఇంటికి పంపాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి వీళ్లు జ‌ర్న‌లిస్టుల జీవితాల‌తో ఎలా చెల‌గాడం ఆడుతున్నారో తెలుస్తోంది. దీంతో ఇక‌పై మీడియాలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో.. కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: