క‌రోనా వైర‌స్ నుంచి ఇప్ప‌ట్లో అమెరికా బ‌య‌ట‌ప‌డేలా క‌నిపించ‌డంలేదు. దీంతో నిత్యం వంద‌లాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టంతో వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి. వ‌ర్క ఫ్రం హోం అని కొన్నింటికి ప‌ర్మిష‌న్ ఇచ్చినా నామ‌మాత్రంగానే ఐటీ సంస్థ‌లు ప‌నిచేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా న‌ష్టాల‌ను త‌గ్గించుకోవ‌డంలో భాగంగా చిన్న సంస్థ‌లు మొద‌లు కార్పొరేట్ సంస్థ‌ల వ‌ర‌కు ఉద్యోగులను రాజీనామా చేయాల‌ని కోరుతున్నాయి. ఇప్ప‌టికే వేలాది సంస్థ‌లు ఆ బాట‌లోను ఉన్నాయి. ఆక‌స్మాత్తుగా ఎదురైన ఈ ప‌రిణామానికి  అమెరికన్ల‌ను తీవ్ర క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నాయ‌ట‌. 


ఒక స‌ర్వే ప్ర‌కారం.. ఆర్థిక ఒడిదుడుకుల మొద‌లైన నాటి నుంచి  ల‌క్ష‌లాది మంది ఉద్యోగాలను కోల్పోయిన‌ట్లుగా నివేదిక తెలిపింది. అయితే గ‌డిచిన 20 రోజుల్లోనే దాదాపు 2కోట్ల మంది ఉద్యోగాలు గ‌ల్లంతైన‌ట్లు తెలుస్తోంది. అమెరికాలో కార్మికులు నిరుద్యోగులుగా మార‌మ‌ని నిరుద్యోగ భృతి చెల్లించాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు పేర్కొంది. అమెరికాలో ఇప్పుడు అత్య‌వ‌స‌ర‌మైన సంస్థ‌లు మిన‌హా మిగ‌తా రంగాల‌కు గ‌డ్డుకాల‌మే న‌డుస్తుంద‌ని చెప్పాలి. ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉండ‌టం కూడా మిగ‌తా రంగాలు దెబ్బ‌తిన‌డానికి కార‌ణ‌మ‌య్య‌య‌నే వాద‌న వినిపిస్తోంది.


 గ‌డిచిన కొద్ది రోజుల్లోనే యుఎస్ ఆర్ధికవ్యవస్థ "చాలా ఎక్కువ నిరుద్యోగం" రేటు వైపు "భయంకరమైన వేగంతో" కదులుతోంద‌ని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు, సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనే వ‌ర‌కు, ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకున్న‌ప్పుడే ఈ స‌మ‌స్య‌కు మ‌ళ్లీ ప‌రిష్కారం ల‌భించ‌గ‌ల‌ద‌ని పేర్కొన్నారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో నిరుద్యోగం పెరగడానికి COVID-19 కారణమని పేర్కొన్నారు. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి తీసుకురావ‌డంతో  హోటళ్ళు, ఫుడ్ డెలివ‌రీ, రిటైల్, నిర్మాణం మరియు మైనింగ్ వంటి రంగాల్లో ఉద్యోగాల‌కు కోత ప‌డుతోంద‌ని అమెరికా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: