తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ జీవితం గురించి ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయిపోయారు. వారిలో ఒకరిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని తన సొంత నివాసంలో ఉంటున్నారు. బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఒకపక్క ఏపీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఎవరికి కరోనా అంటుకుంటుందో తెలియని పరిస్థితి ఉంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడమే కాకుండా, పరిస్థితి అదుపు తప్పే విధంగా తయారయ్యింది. ప్రభుత్వం చేస్తున్న సహాయం సరిపోదని, టిడిపి నాయకులు సైతం విమర్శలు చేస్తున్నారు. ఈ దశలో చంద్రబాబు ఏపీ లో ఉండి ఉంటే ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించి ఉండేవారు. కానీ ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయింది.

 

IHG

 చంద్రబాబు బాధ కూడా అదే. తాను ఇక్కడ ఉండి ఉంటే కరోనా క్రెడిట్ మొత్తం కొట్టేయ్యవచ్చని బాబు బాధపడిపోతున్నాడు. హైదరాబాద్ నుంచి సమీక్షలు చేస్తున్నా ఆశించనంత మైలేజ్ రావడం లేదని బాధ కూడా బాబులో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక బాబు గురించి మరింత లోతుగా తెలుసుకుంటే... ఆయన రోజుకు 18 గంటల పాటు కష్టపడతాడు అనే పేరు ఉంది. ఆయన నిద్రపోడు.. ఎవరినీ నిద్రపోనివ్వడు అనే పేరు ఉంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత గానే కాకుండా, ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు. వయస్సు రీత్యా చూసుకుంటే...  ఏడు పదుల వయ్యస్సులో చంద్రబాబు తన వయస్సు కి మించి కస్టపడుతున్నాడు. ఈ వయస్సులో ఆయనకు చాలా విశ్రాంతి అవసరం. అయినా ఇప్పటి వరకు పార్టీ కోసమే అహర్నిశలు కష్టపడుతూ వచ్చాడు.

 

IHG

కానీ ఇప్పుడు కరోనా వైరస్ బాబు దూకుడికి బ్రేక్ వేసిందని చెప్పాలి. ఈ విధంగా అయినా బాబు కి విశ్రాంత లభించింది. ఇప్పుడు చంద్రబాబు కూడా సాధారణ పౌరుడులా ఇంటికే పరిమితం అయ్యారు. టీవీతో కాలక్షేపం చేస్తున్నారు. అప్పుడప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులతో, మీడియాతో మాట్లాడుతున్నారు. ఇక ఎక్కువ భాగం విశ్రాంతి తీసుకోవడం, టీవీ చూడడంతోనే గడిపేస్తున్నారు. కరోనా హడావుడి ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. దీంతో ఎక్కువకాలం అక్కడే గడిపేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత ముఖ్యమంత్రుల పరిస్థితిని  ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య, kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటివారు ఇప్పటికే హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకున్నారు. 

IHG

ఇక చంద్రబాబు కూడా వందల కోట్ల ఖర్చుతో హైదరాబాదులోనే సొంత నివాసం ఏర్పరుచుకున్నారు. వారి జాబితాలో ఇప్పుడు చంద్రబాబు కూడా చేరిపోయే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా చంద్రబాబు చాలా కాలంగా విశ్రాంతి తీసుకోవాలని, తన బాధ్యతలు తన రాజకీయ వారసుడు నారా లోకేష్ కు అప్పగించాలని చూస్తున్నారు. అయితే ఆ సమయం ఇప్పటి వరకు రాలేదు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా కరోనా కారణంగా ఆకస్మాత్తుగా చంద్రబాబు విశ్రాంతి తీసుకునే అవకాశం లభించింది. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు ఈ విధంగా ఎన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఎప్పుడు లభించలేదు. 

 

IHG'చంద్రబాబు ఏజ్ బార్ ...

టిడిపి ప్రతిపక్షంలో ఇప్పుడు ఉంది. అయినా ఎక్కువ శాతం అమరావతిలో చంద్రబాబు కాలం గడుపుతూ వైసీపీ ప్రభుత్వాన్ని శతవిధాలా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే హైదరాబాద్ వెళుతున్నారు. కానీ ఇంత అకస్మాత్తుగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని బాబు ఊహించలేకపోయారు. ఇప్పుడు బాగా విశ్రాంతి లభించడంతో ఇక రాజకీయాలకు క్రమక్రమంగా తగ్గించుకుని ఎక్కువ శాతం విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో తన రాజకీయ వారసుడు నారా లోకేష్ ను కూడా ఏపీ రాజకీయాల్లో కీలకం చేసి తాను మెల్లిమెల్లిగా తప్పుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: