భార‌త్‌పై  చైనా-పాక్ కుతంత్రాలు కొన‌సాగుతునే ఉన్నాయి. పాక్‌ను అడ్డం పెట్టుకుని భార‌త్‌పై ప‌రోక్ష యుద్ధం చేయాలని ఎప్ప‌టి నుంచో చైనా యోచిస్తోంది. అందుకు అదును వెతుక్కుంటోంది. తాజాగా పాక్ -చైనాల మ‌ధ్య జ‌రిగిన ఓ ర‌హ‌స్య సైనిక ఒప్పందం వెలుగులోకి వ‌చ్చింది. దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌య‌మేటంటే భార‌త్‌ను దెబ్బ‌కొట్టాల‌నే ప్ర‌య‌త్నంలో పాకిస్థాన్ పూర్తిగా చైనా హ‌స్త‌గ‌త‌మ‌వుతున్న విష‌యం తెలుసుకోలేక‌పోతోంది. అయితే ఇందుకు పాకిస్థాన్‌లోని సైన్యాధికారులు త‌మ శాయ‌శ‌క్తులా చైనాకు స‌హ‌క‌రిస్తుండ‌టం విశేషం. త‌మ విలాసా జీవితాల‌కు చైనా ప‌డేసే క‌మీష‌న్ల‌కు దేశ భూభాగాన్ని కూడా తాక‌ట్టు పెడుతుండ‌టం గ‌మ‌నార్హం. 

 

కొంత‌కాలం క్రితం భార‌త్ త‌న ఆయుధ సంప‌త్తిని పెంపొందించుకోవ‌డంలో భాగంగా అత్యాధునిక యుద్ధ విమానాలు, హెలికాప్ట‌ర్ల‌ను ఫ్రాన్స్ నుంచి తెప్పించుకున్న విష‌యం తెలిసిందే. అయితే భార‌త్‌తో త‌మ‌కు అపాయం పొంచి ఉంద‌ని చైనా నుంచి యుద్ధ హెలికాప్ట‌ర్ల‌ను ఆర్డ‌ర్ ఇచ్చి మ‌రీ తెప్పించుకుంటోంది. అయితే మందు బిళ్ల‌ల‌కే డ‌బ్బులు గ‌తిలేని పాకిస్థాన్ యుద్ధ హెలికాప్ట‌ర్ల‌ను కొనుగోలు చేసేంత స్థితి ఎక్క‌డుంద‌న్న డౌటు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వ‌డం స‌హ‌జ‌మే. అయితే పాకిస్తాన్‌లోని కొంత భూభాగాన్ని చైనాకు తాక‌ట్టు పెట్ట‌డం విశేషం. పాకిస్థాన్ డ‌బ్బులు చెల్లించ‌ని ప‌క్షంలో ఆ భూభాగాన్ని చైనా ఆక్ర‌మించుకుంటుంది. 

 

పాకిస్థాన్ చేసిన అప్పుల‌కే వ‌డ్డీ చెల్లించ‌ని ప‌రిస్థితిలో ఉంది. పాకిస్థాన్ అప్పు తీర్చ‌ద‌న్న విష‌యం చైనాకు కూడా తెలుసు. భూ ఆక్ర‌మించేందుకే స్కెచ్ వేసి మ‌రీ పాకిస్థాన్‌ను సాయం ముసుగులో డ్రాగ‌న్ కంట్రీ ద్రోహం మొద‌లుపెట్టింది.  ఇదంతా కొంత తెలిసి...కొంత తెలియ‌క పాకిస్థాన్ ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు కిమ్మ‌ని  ఉంటున్నారు. పాకిస్థాన్‌లో సైన్యాన్ని ఎదురించే ద‌మ్ము, ధైర్యం అక్క‌డి పాల‌కులకు లేద‌న్న‌ది నిర్వివాదాంశం. పాకిస్థాన్‌లో ప్ర‌భుత్వాలను న‌డిపించేది కూడా  సైన్య‌మే. ఈ విష‌యం జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. ప్ర‌భుత్వాల అధినేత‌లు ఎక్స‌ట్రాలు చేస్తే నియంతృత్వంగా జైల్లో పెట్టేస్తుంటారు. పాల‌కుల‌ గ‌త చ‌రిత్ర‌ను  చూస్తే మ‌న‌కు ఇదే అర్థ‌మ‌వుతోంది. 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: