దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో  ఢిల్లీలోని తబ్లిగీ మర్కజ్ మసీదు ప్రముఖ పాత్ర పోషిస్తోందనే చెప్పాలి. మార్చి 1-15 తేదీల మధ్య మర్కజ్ మసీదులో ప్రార్ధనలకు విదేశాల నుండి సుమారు 1500 మంది అటెండ్ అయ్యారు. వాళ్ళ నుండే మనదేశంలోని వాళ్ళకు సోకింది. ప్రార్ధనల్లో పాల్గొన్న 16 రాష్ట్రాల వాళ్ళు తిరిగి తమ రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ రాష్ట్రాల్లో మరికొందరికి అంటించారు. దాంతో వైరస్ తీవ్రత మనదేశంలో ఒక్కసారిగా పెరిగిపోయింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రార్ధనలకు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారిలో చాలామంది క్వారంటైన్, ఐసొలేష్ కేంద్రాలకు వెళ్ళిన కొందరు మాత్రం ప్రభుత్వానికి దొరక్కుండా తప్పించుకుని తిరుగుతునే ఉన్నారు. వీళ్ళ ద్వారానే వాళ్ళ కుటుంబసభ్యులకు కూడా అంటుకున్నది వైరస్. ఇలా వైరస్ అంటుకున్న వారిలో  40 మంది పిల్లలు, 124 మహిళలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇంకా ఎన్ని కుటుంబాల్లో ఎంతమందికి వైరస్ ఉన్నదో ప్రభుత్వానికి అర్ధం కావటం లేదు. అందుకనే వాళ్ళ కుటుంబసభ్యులను, కాంటాక్టులోకి వెళ్ళిన వాళ్ళకు  కూడా పరీక్షలు చేయిస్తోంది.

 

మొత్తానికి మర్కజ్ మసీదు ప్రార్ధనలు ఒక విధంగా చాలామందిని ఇబ్బంది పెట్టినట్లే అనుకోవాలి.  ప్రార్ధనలు జరపటం తప్పు కాదు. కానీ అప్పటికే సమస్యున్నపుడు తమ రాష్ట్రాలకు వెళ్ళి స్వచ్చంధంగా ప్రభుత్వం ముందు హాజరవ్వటం,  వైరస్ పరీక్షలకు సహకరించకపోవటమే తప్పు.  వైరస్ ఉన్న వాళ్ళ వళ్ళ వాళ్ళకి మాత్రమే కాదు సమస్య. వాళ్ళ కుటుంబసభ్యులకు తర్వాత వాళ్ళు ఎవరినైతే కలుస్తారో వాళ్ళందరికీ సమస్యే అన్న విషయాన్ని వీళ్ళు గ్రహిస్తే మంచిది.

 

కానీ ప్రభుత్వానికి సహకరించని కారణంగానే చివరకు వాళ్ళ కుటుంబాల్లోని పిల్లలకు కూడా వైరస్ ఎటాక్ అయ్యింది. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళల్లో కొందరి కుటుంబాల్లోని 40 మంది పిల్లలకు వైరస్ సోకటమంటే మామూలు విషయం కాదు. ఇలా సోకిన వాళ్ళంతా 3-17 సంవత్సరాల మధ్య  వయస్సున్న వాళ్ళే కావటం గమనార్హం. ఇటువంటి వాళ్ళ కేసులు ఎక్కువగా కర్నూలు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రికార్డయ్యాయి. కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఎవరైనా ప్రభుత్వానికి దొరక్కుండా తప్పించుకు తిరుగుతుంటే వెంటనే ప్రభుత్వం ముందుకు వచ్చేస్తే అందరికీ మంచిదని గ్రహించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: