రాజ‌స్థాన్ కోటి ప‌ట్ట‌ణంలో చిక్కుకుపోయిన 7000మంది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ విద్యార్థుల‌ను యోగీ ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం స్వ‌స్థ‌లాల‌కు చేర్చుతోంది. ఇందుకోసం ఏకంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి దాదాపు 250 బ‌స్సుల‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేకంగా పంపించ‌డం గ‌మ‌నార్హం. సామాజిక దూరం పాటించేలా జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటూ విద్యార్థుల‌ను స్వ‌స్థ‌లాల‌కు చేర్చే ప‌నిని నిర్విగ్నంగా యోగి ఆదిత్య ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుండ‌టంపై రాష్ట్ర ప్ర‌జానీకం నుంచి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ప్ర‌తీ బ‌స్సులో కేవ‌లం 30మందిని మాత్ర‌మే తీసుకెళ్తున్న అధికారులు వారి మ‌ధ్య అంత‌రం ఉండ‌లే తగిన జాగ్ర్త‌త‌లు తీసుకుంటున్నారు. 

 

 

ఇప్ప‌టికే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చేరిన కొంత‌మంది విద్యార్థుల‌ను అక్క‌డి నుంచి మ‌ళ్లీ ప్ర‌త్యేక వాహ‌నాల్లో ఇళ్ల వ‌ద్ద దించుతున్నారు. అయితే దీనికంటే ముందు వారికి థ‌ర్మ‌ల్ స్క్రీన్ టెస్ట్ నిర్వ‌హిస్తున్నారు. అంతేకాక క‌రోనా ల‌క్ష‌ణాల‌ను ప‌రిశీలిస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ స్టూడెంట్‌లోనూ క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌డం శుభ సూచ‌క‌మ‌ని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండ‌గా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో దాదాపు 40 రోజులుగా లాక్‌డౌన్ అమల‌వుతూనే ఉంది. అయితే రాజ‌స్థాన్‌లోని కోట ప‌ట్ట‌ణం ఇంజ‌నీరింగ్‌, మెడిసిన్‌తో పాటు ఇత‌ర కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంట‌ర్ల‌కు ప్ర‌సిద్ధిగాంచింది. 

 

ఉత్త‌ర భార‌తంలోని చాలా రాష్ట్రాల నుంచి ఇక్క‌డికి విద్యార్థులు వ‌స్తుంటారు. ఈక్ర‌మంలోనే పేయింగ్‌గెస్ట్‌లుగా, హాస్ట‌ళ్ల‌లో ఉంటూ వ‌స్తుంటారు. అయితే అనుకోని విధంగా క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ‌తో వీరంతా లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. స్వ‌స్థ‌లాల‌కు వెళ్లే మార్గం లేక‌...అక్క‌డ ఉండ‌టం క‌ష్టంగా మార‌డంతో సోష‌ల్ మీడియా వేదికగా త‌మ క‌ష్టాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు. దీనికి స్పందించిన యూపీ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ బ‌స్సుల‌ను ఏర్పాటు చేసి మ‌రీ స్వ‌రాష్ట్రానికి విద్యార్థుల‌ను త‌ర‌లించారు. యోగీ పాల‌న అంటే ఇదీ అంటూ ఆయ‌న అభిమానులు కీర్తిస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: