``టూ ప‌ర్స‌న్స్ సీ ఇన్‌టు సేమ్ బార్స్‌.. వ‌న్ ప‌ర్స‌న్ సీ స్కై అండ్ మూన్, సెకండ్ ప‌ర్స‌న్ సీ మ‌డ్ అండ్ పెబెల్స్‌!!``- అంటారు వివేకానంద స్వామి! ఇప్పుడు ఈ వ‌చ‌నంలో చెప్పిన రెండో వ్య‌క్తి మ‌న ఆర్కేనే! అదే వారం వారం త‌న అభిప్రాయాన్ని ప్ర‌జ‌ల నెత్తిన రుద్ది పైశాచికానందం పొందే ప‌త్రికాధిప‌తి వేమూరి రా ధాకృష్ణ‌. రాయ‌గా ర‌య‌గా.. పెన్ను ప‌దును తేరుతుంది!  అదేవిధంగా రాయ‌గా రాయ‌గా.. పాత్రికేయుడు కూడా ప‌దును తేరాలి. కానీ, నానాటికీ తీసిక‌ట్టు నాగంబొట్టు.. అన్న‌చందంగా మారిపోతున్నాడు ఆర్కే!  మ న‌సులో ఒక పెట్టుకుని పైకి మాత్రం నీతి ప‌లుకులు పేలుతున్నాడు. ఇదే ఇప్పుడు అటు సోష‌ల్ మీడి యాలోను, ఇటు జ‌న‌సామాన్యంలోనూ చ‌ర్చ‌కు వ‌స్తోంది.

 

గ‌త వారం (12 వ తారీకు ఆదివారం) రాసిన త‌న కొత్త‌ప‌లుకులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఆర్కే కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. దీనిలో కీల‌క‌మైంది.. ``నీక‌న్నా.. పెద్ద దేవుడి ఆశీర్వాదం నాకు ఉంది``.. అని తేల్చేశారు. నిజానికి ఈ వ్యాఖ్య‌ల వెనుక అంత‌రార్థం.. అప్ప‌ట్లో చాలా మందికి అర్ధం కాలేదు. ఇక‌, ఈ వారం(19వ తారీకు) రాసిన ప‌లుకుల్లో త‌న దేవుడి తీరానికే త‌న ప‌లుకులు అన్న విధంగా కుండ బ‌ద్ద‌లు కొట్టేయ‌డం ఆర్కేకే చెల్లింది. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారిని వ్యాపారులు, వాణిజ్య‌వేత్త‌లు ప్ర‌భుత్వాలు కూడా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని, అనుకున్న‌ది సాధిస్తున్న‌ట్టే.. ఆర్కే కూడా తాను ఎవ‌రి చెంత‌కు చేరాలో వారికి చెంత‌కు చేరేందుకు క‌రోనా నే క‌లం చేసుకుని రాత‌ల కోత‌లు కోస్తున్నారు.

 

గ‌తంలో బీజేపీ సార‌ధి(ఇప్పుడు కాదు), కేంద్ర మంత్రి అమిత్ షా ఆహ్వానించాడ‌ని పేర్కొంటూ.. ఢిల్లీకి వెళ్లి హ‌డావుడి చేసిన ఆర్కే.. క‌రోనా ఎఫెక్ట్ స‌మ‌యంలో ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నే త‌న‌కు ఫోన్ చేశాడ‌ని పెద్ద ఎత్తున ఫ‌స్ట్ పేజీలో ప్ర‌చారం చేసుకున్నాడు. బ‌హుశ దీనిని బ‌ట్టి.. ఆ `పెద్ద దేవుడు` ఎవ‌రో అర్ధ‌మ వుతోంది. కానీ, మోడీ అయినా షా.. అయినా.. దేశంలోని అన్ని ప్ర‌ధాన ప‌త్రిక‌లు, మీడియా అధిప‌తుల‌ను మ‌చ్చిక చేసుకుంటున్న‌వారే!  అయితే, వ‌చ్చిన అవ‌కాశాన్ని ఎందుకు వ‌దులుకోవాల‌ని అనుకుంటున్న ఆర్కే.. ఎలాగూ తెలంగాణ‌, ఏపీలో త‌న‌కు అనుకూల ప్ర‌భుత్వాలు లేవుకాబ‌ట్టి.. కేంద్రంతో అయినా మ‌చ్చిక‌గా మెల‌గాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఉన్నారు.

 

ఈ క్ర‌మంలోనే తాజాగా ఆదివారం రాసిన కొత్త‌ప‌లుకు ప్ర‌యాణాన్ని బీజేపీ తీరానికి చేర్చే ప్ర‌య‌త్నం చేశా రు. ఈ వారం ఆర్కే ‘కరోనా కళ్లు తెరిపించేనా?’ శీర్షిక‌తో రాసిన కొత్త ప‌లుకు లో ముస్లిం మ‌తాన్ని కేంద్రంగా చేసుకుని ఆయ‌న రాసిన రాత‌లు, ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్టు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంలు కేసీఆర్‌, జ‌గ‌న్‌ల‌ను టార్గెట్ చేయ‌డ‌మే కాకుండా మ‌రోవైపు ముస్లింలంటే అంటరాని వారిగా చూస్తున్న బీజేపీకి మ‌రింత ద‌గ్గ‌ర కావ‌డానికి గొప్ప అవ‌కాశంగా ఆర్కే భావిస్తున్న‌ట్టుంది. 

 

స‌హ‌జంగా నిజానిజాలు ఏమైన‌ప్ప‌టికీ మతం కోణాన్ని బ‌హిరంగంగా రాయ‌డంలో మీడియా స్వీయ నియంత్ర‌ణ పాటించ‌డాన్ని ఇంత కాలం చూస్తూ ఉన్నాం. కానీ ఆ ల‌క్ష్మ‌ణ రేఖ‌ను ఆర్కే దాటేశాడు.  దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మర్కజ్‌ సమావేశానికి వెళ్లినవారు స్వరాష్ట్రాలకు తిరిగి వచ్చారు. దీంతో ఈ మహమ్మారి ఒక్కసారిగా జూలు విదిల్చింది. మర్కజ్‌ సమావేశానికి ఇండోనేషియా, ఇరాన్‌ తదితర దేశాల నుంచి వచ్చినవారు హాజరవ్వడంతో మనవాళ్లకు కరోనా వ్యాపించింది. వీళ్లు స్వరాష్ట్రానికి చేరుకు ని ఈ వైరస్‌ని వ్యాప్తి చేశారు...అని ఆర్కే నిర్ధారించ‌డం వెనుక బీజేపీ, ఆర్కే ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు స్ప‌ష్టంగా క‌ళ్ల‌కు క‌ట్టాయి. 

 

అంతేకాదు, కరోనా నివారణకు ప్రధాని తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు సానుకూల ధృక్పథంతోనే ఉన్నారు. అయితే హైదరాబాద్‌లోని పాతబస్తీలో మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అంటూ రాయ‌డం కూడా బీజేపీకి తాను ద‌గ్గ‌ర‌వుతున్న కాదు..కాదు.. అయిన సందేశాన్ని ప‌ల‌క‌డం లేదా?! అందుకే ఎవ‌రి కోసం.. ఎవ‌రిని దోషులుగా చూపిస్తున్నార‌నే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి త‌ను అనుకున్న తీరానికి ప‌లుకుల ప‌డ‌వ‌ను సునాయాశంగా న‌డిపించేస్తున్నారు ఆర్కే!!

మరింత సమాచారం తెలుసుకోండి: