జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయటం చంద్రబాబునాయుడుకు ఓ అలవాటుగా మారిపోయింది. కరోనా వైరస్ నియంత్రణకు ఒకవైపు జగన్ యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. మరోవైపు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటునే అదే యంత్రాంగం ఆత్మస్ధైర్యాన్ని దెబ్బ తీసేవిధంగా ఆరోపణలు చేస్తున్నాడు. చంద్రబాబు మాట్లాడుతు కర్నూలు, నెల్లూరులో ఇద్దరు డాక్టర్ల మరణాలకు జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ విచిత్రమైన ఆరోపణలు మొదలుపెట్టాడు.

 

కరోనా వైరస్ రోగులకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు, వైద్య సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వకపోవటంతోనే డాక్టర్లు చనిపోయినట్లు చంద్రబాబు తీర్మానించేశాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వైరస్ రోగులకు వైద్యం అందించిన డాక్టర్లు ఇద్దరికి వైరస్ సోకి చనిపోయినట్లు తప్పుడు ఆరోపణలు చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తప్పుడు ఆరోపణలు చేయటం చంద్రబాబుకు బాగా అలవాటైపోయిందని.

 

అసలు విషయం ఏమిటంటే చంద్రబాబు చెప్పినట్లు కర్నూలు, నెల్లూరులో డాక్టర్లు కరోనా వైరస్ రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు. అంటే వీళ్ళు క్వారంటైన్ లేదా ఐసొలేషన్ వార్డుల్లో ఎక్కడా ఎవరికీ వైద్యం చేయలేదు. వాళ్ళ ప్రైవేటు ప్రాక్టీసులో భాగంగా తమ దగ్గరకు వచ్చే పేషంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే తమ దగ్గరకు ట్రీట్మెంట్ కోసం వచ్చిన వారిలో ఎవరికో వైరస్ ఉండుంటుంది. వాళ్ళ నుండి డాక్టర్లకు వైరస్ ఎటాక్ అయ్యిందన్నది వాస్తవం.

 

నెల్లూరు డాక్టర్ అయితే వైరస్ తోనే చెన్నైలో ప్రోగ్రామ్ కు కూడా వెళ్ళాడు. అనారోగ్యం పెరిగిపోవటంతో అక్కడే చెక్ చేయించుకున్నపుడు డాక్టర్ కు కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది.  ఇక కర్నూలు డాక్టర్ విషయంలో కూడా ఇదే జరిగింది. వైరస్ సోకిన పేషంట్లను ట్రీట్ చేయటంతో  ఈ డాక్టర్ కు కూడా వైరస్ ఎటాక్ అయ్యింది. మర్కజ్ మసీదులో ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఈ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

 

అంటే హోలు మొత్తం మీద చూస్తే ఇద్దరు డాక్టర్ల మరణానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నది వాస్తవం. పై ఇద్దరు డాక్టర్లకు   గవర్నమెంట్ డ్యూటి చేస్తున్నపుడు వైరస్ సోకలేదు. అయినా చంద్రబాబు అబద్ధాలు చేప్పేస్తు జనాలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. అంతేకాకుండా మిగిలిన వైద్య సిబ్బందిని కూడా రెచ్చ గొడుతున్నట్లే ఉంది. జగన్ మీద కోపంతో ప్రభుత్వంపై పదే పదే తప్పుడు  ఆరోపణలు చేయటం చంద్రబాబుకే చెల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: