క‌రోనా దెబ్బ‌కు భార‌త్‌లోని నిరుపేద‌లు మ‌రింత దారిద్ర్యంలోకి వెళ్లిపోతార‌ని ప‌లు ఆర్థిక స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. 137కోట్ల జనాభా ఉన్న భార‌త్‌లో దాదాపు 40కోట్ల మంది దారిద్ర్యంలోకి జారుకుంటార‌ని  అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా వేసింది. స్థిర‌మైన ఆదాయ మార్గాలు లేక‌పోవ‌డంతో చాలామంది పేద‌లు ఇప్పుడు ఆక‌లికే అల‌మ‌టించే ప‌రిస్థితి నెల‌కొంది. గ్రామీణా ప్రాంతాల్లో కాస్త ప‌రిస్థితి మెరుగ్గా ఉన్నా..ప‌ట్ట‌ణాల్లో అయితే ప‌నిదొర‌క‌డం క‌ష్టంగా ఉంది. లాక్‌డౌన్ సుదీర్ఘ‌కాలంగా అమ‌ల‌వుతుండటంతో ఉపాధి కోల్పోయారు. ఇప్ప‌టికే నెల‌రోజులుగా ఖాళీగా ఉండ‌టంతో అప్పులు పెరిగిపోతున్నాయి.

 

ఇలాంటి కార‌ణాల‌తో పేద‌లు మ‌రింత పేద‌లుగా మారిపోయే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ఆర్థిక నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పేద‌ల‌ను ఆదుకునేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం న‌గ‌దు పంపిణీ ప‌థ‌కాల‌కు శ్రీకారం చుట్ట‌డం ద్వారా కొంత పేద‌రికాన్ని అదుపు చేయ‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు. ‘పేదల కోసం తాత్కాలిక ఆదాయ బదిలీ స్కీమ్‌’ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్ కొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చారు. చాలామంది ఆయ‌న అభిప్రాయంతో ఏకీభ‌విస్తున్నారు కూడా. వాస్త‌వానికి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.1500ల మొత్తాన్ని తెల్ల‌రేష‌న్‌కార్డు దారుల ఖాతాల్లోకి మ‌ళ్లిస్తున్న విష‌యం తెలిసిందే.

 

ర‌ఘురామ్‌రాజ‌న్ సూచించిన ప‌థ‌కం ఇదే. అయితే మొత్తాన్ని పెంచాల్సి ఉంద‌ని, క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికి వీలుగా రూ.2000వ‌ర‌కు ఇవ్వాల‌న్న‌ది ఆయ‌న సూచ‌న‌. ఇదిలా ఉండ‌గా  ‘అంతర్జాతీయ ప్రాథమిక ఆదాయ మద్దతు స్కీమ్‌’ను అమ‌లు చేయాల‌ని స్వరాజ్య పత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ ఆర్‌. జగన్నాథన్‌ సూచించారు. దేశంలోని అట్టడుగు పేదలకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఆరు నెలలపాటు చెల్లించాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రవీణ్‌ చక్రవర్తి డిమాండ్ చేస్తున్నారు. ఇలా న‌గదు పంపిణీకి సంబంధించిన అనేక ప్ర‌తిపాద‌న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ కూడా పేద‌ల‌ను మ‌రింత నిరుపేద‌లుగా మార్చ‌కుండా ఉంచుతాయ‌నేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. అయితే కోట్లాది కుటుంబాల‌కు క‌నీసం ఆరునెల‌ల పాటు న‌గ‌దు సాయం చేయాలంటూ ల‌క్ష‌ల కోట్ల మొత్తం అవ‌స‌రం అవుతుంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో అంత మొత్తం సేక‌రించ‌డం అంటే కేంద్ర ప్ర‌భుత్వానికి అంత‌కు మించిన స‌వాల్‌ మ‌రోక‌టి ఉండ‌బోద‌నే చెప్పాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: