ఏదో ఒక రకంగా తానే గొప్ప నాయకుడిని, రాజకీయాలను కాచి వడబోసిన వ్యక్తిని అనేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇన్నర్ ఫీలింగ్ గా కనిపిస్తుంది. రాజకీయాల్లో తాను తప్ప మిగతా వారంతా ఎందుకు పనికిరానివారు అన్నది బాబు ఫీలింగ్. ఎప్పుడూ లేని విధంగా టిడిపి ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ కూడా పూర్తిగా తగ్గిపోయింది. నేతలను అదుపు చేయడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు అనే విమర్శలు ఎన్నో బాబు ఎదుర్కొన్నారు. ఆ ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టమైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదుర్కొంది. కేవలం 23 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి టీడీపీకి ఏర్పడింది. ప్రజలంతా టిడిపి పరిపాలనపై విసుగు చెందడంతో పాటు, వైసీపీ అధినేత జగన్ పై ఉన్న నమ్మకంతో ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా.. తాను అధికారంలోకి వస్తే అమలుచేయబోయే సంక్షేమ పాతకలేంటో ముందుగానే చెప్పిన జగన్ వాటన్నిటిని అతి తక్కువ సమయంలోనే అమలుచేసి చూపించారు. 

 

IHG


 ప్రజలు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జనరంజక పాలన అందించడం జగన్ సక్సెస్ అయ్యారు.ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేసి చూపించారు. జగన్ పరిపాలనపై ప్రజల్లో పూర్తిస్థాయిలో సంతృప్తి ఏర్పడింది. అసలు ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో పది నెలల కాలంలో అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం ఒక్కరూ లేరన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతూ వస్తోంది. ప్రతి విషయంలోనూ జగన్ పై చేయి సాధిస్తుండడం, టిడిపి అధినేతకు మింగుడు పడడం లేదు. అందుకే 70 సంవత్సరాల వయసు వచ్చినా, చంద్రబాబు ఇప్పటికీ  పార్టీ ఉనికిని కాపాడేందుకు  కష్ట పడాల్సి వస్తోంది. ఆ పార్టీలో చంద్రబాబు తర్వాత అంతటి సమర్ధలు ఎవరూ లేరు అన్నది బాబుకు కూడా తెలిసిన నిజం. 

 

IHG

ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లాక్ డౌన్ నిబంధన విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వారిని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. ప్రజలకు ఎప్పటికప్పుడు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందించడమే కాకుండా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రాసల ఇళ్లకే స్వయంగా నగదును వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ఆకర్షించడంతో.. తమ రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

IHG'మూడు ...


ఇదిలా ఉంటే అన్ని విషయాల్లోనూ వైసీపీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు, ప్రజల్లోనూ ఆదరణ పెరిగిపోతుండడం చంద్రబాబుకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. కరోనా టెస్టింగ్ కిట్లను కొరియా నుంచి తెప్పించారు. పది నిమిషాల్లోనే పాజిటివ్, నెగిటివ్ అనే విషయం తేల్చేస్తుండడంతో చంద్ర బాబుకు నిద్ర పట్టడం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏదో రకంగా కరోనా విషయంలో వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు తెలంగాణ నుంచి చంద్రబాబు అనేక కుయుక్తులు పన్నుతున్నారు. ప్రతి సందర్భాన్ని , ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుబడుతూ హడావిడి చేస్తున్నారు. అసలు తాను ఉంటే ఏపీకి కరోనా వచ్చేది కాదు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఒకవైపు వైసిపి ప్రభుత్వానికి క్రెడిట్ వచ్చేస్తుందన్న బాధ కూడా ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది.

IHG


ఏపీ ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశం ఎక్కడ చంద్రబాబులో  కనిపించడం లేదు. కేవలం వైసీపీ ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా చేయాలనే కసి ఆయనలో ఎక్కువగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఈ 70 సంవత్సరాల వయసులో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి పోరాడుతున్నాడు అంటే వైసీపీ ప్రభుత్వం ప్రజల హృదయాలను గెలుచుకుని విజయవంతంగా ముందుకు వెళుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: