క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో డ‌బ్ల్యూహెచ్‌వోకు అండ‌గా నిల‌బ‌డాల్సిన అగ్ర‌రాజ్యం..నిధుల కోత విధించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డ‌బ్ల్యూహెచ్‌వో చేసిన కొన్ని త‌ప్పిదాల‌ను ఎత్తిచూపుతూ అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ త‌న బాధ్య‌త‌ల‌ను విస్మ‌రించ‌డం దేనికి సంకేతం. వాస్త‌వానికి ట్రంప్ నిర్ణ‌యంపై చాలా మంది అమెరిక‌న్లే మండిప‌డుతున్నారు. ఇది వివేకావంతుడి ల‌క్ష‌ణం....ల‌క్ష్యం కాద‌ని తిట్టిపోస్తున్నారు. డ‌బ్ల్యూహెచ్‌వో కొన్ని త‌ప్పిదాలు చేసి ఉండ‌వ‌చ్చు కాని...అది చేసిన మంచిని...అంత‌ర్జాతీయ వైద్య వేదిక అన్న విష‌యం ట్రంప్‌కు క‌న‌బ‌డ‌క‌పోవ‌డం విడ్డూరంగా ఉంద‌ని అంటున్నారు. 

 

అమెరికా ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థకు 50 కోట్ల డాలర్లను అందజేస్తూ వ‌స్తోంది. ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తితో తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింతగా నిధులు అవసరమైన క్ర‌మంలో ట్రంప్ నిర్ణ‌యం నిజంగా సంస్థ‌పై తీవ్ర‌మైన ప్ర‌భావాన్నే చూపుతుంద‌ని చెప్పాలి. గ‌తంలో ఏ అధ్య‌క్షుడు వ్య‌వ‌హ‌రించ‌ని దుందుడుకు స్వ‌భావంతో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విచ‌క్ష‌ణార‌హితంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఆయ‌న‌కే చెల్లుతోందన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అమెరికా అంటే ఆధిప‌త్యంలోనూ..ఆప‌ద స‌మ‌యంలోనూ అగ్ర‌రాజ్యం ఆదుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ప్ర‌పంచదేశాల ప్ర‌జ‌ల్లో ఉంది. 

 

అమెరికా ప్ర‌భావంతోనే కొన్ని దేశాల్లో ప్ర‌భుత్వాలు కూల‌డం..నిల‌బ‌డ‌టం జ‌రుగుతోంది అంటే అతిశేయోక్తి కాదు. అమెరికాకు ఉన్న‌టువంటి సంప‌ద‌..ఆయుధ సంప‌త్తి..ప‌ర‌ప‌తి..ఇలా అనేక కార‌ణాలై ఉండ‌వచ్చు. చిన్ని చిత‌కా దేశాలు అమెరికా సాయం కోసం ఎప్పుడూ ఎదురుచూస్తునే ఉంటాయి. వాటికి వేరే గ‌త్యంత‌రం లేకే అలా చేయిచాపుతాయ‌న్న‌ది నిర్వివాదాంశం. వాస్త‌వానికి  ఐరాస పరిధిలోని పలు సంస్థల్ని ఆయా దేశాలు తమ గుప్పిట్లోకి లాక్కోవడం కొత్త వ్యవహారమేమీ కాదు. అమెరికా, చైనాల మధ్య శత్రుత్వం, ఘర్షణ వాతావరణం పెరుగుతున్న క్రమంలో ఇది అధిక‌మ‌వుతూ వ‌చ్చింది.  అయితే ట్రంప్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మాత్రం  స్వదేశంలో క‌రోనాను అరిక‌ట్ట‌డంలో విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకు డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల నిలిపివేసి కొత్త వివాదానికి తెర‌తీసిన‌ట్లుగా విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. ట్రంప్ నీ వేషాలు చాలింకా అంటూ అమెరికా జ‌నం తిట్టిపోస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: