అరే బయ్యా ఎప్పుడూ వార్తలు, సంచలనాల కోసమే పాకులాడడమేనా..? నిరంతరం... నిర్విరామంగా వార్తల వేటలో ఉంటూ....  పగలు, రాత్రి తేడా తెలియకుండా పనే ప్రపంచంగా బతుకుతూ... ఈ పోటీ వాతావరణంలో అందరికంటే తామే ముందు అని గొప్పగా చెప్పుకునేందుకు... పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేందుకు నీకు అంత ఆత్రం ఎందుకు ? ఎంతో గొప్పగా బతికేస్తున్నామన్న భ్రమలో బతికేస్తూ ... ప్రాణాలను, ఆరోగ్యాలను లెక్కచేయకుండా బాధ్యతలు నిర్వర్తించడం అవసరమా ? అసలు జర్నలిస్ట్ ల బాగోగులు పట్టేది ఎవరికి ..? నువ్వు ఎలా చస్తే మాకెందుకు ...? మాకు కావాల్సింది వార్త అన్నట్టుగా వ్యవహరించే మీడియా యాజమాన్యాల కోసం ... వారు ఇచ్చే అరా కొర జీతాల కోసం నీకు అంత కష్టమెందుకు ...? పోనీ సమాజంలో అయినా నీ మీద అంత గొప్ప సదభిప్రాయం ఉందా ...? నోటితో నవ్వుతూ నొసలితో వెక్కిరించే సమాజం ఇది.

 

IHG

 

ఇంతగా ఎందుకు చెబుతున్నా అంటే..? ఇది కలికాలం మాత్రమే కాదు ... కరోనా కాలం కూడా. జాగ్రత్తగా ఉండకపోతే ఆడు ... ఈడు అనే తేడా ఏమీ ఉండదు. ఎవడైనా ఒక్కడే. బ్రిటన్ యువరాణి కే తప్పలేదు నువ్వెంత బ్రదరూ ..? అసలు ఏంటి ఈ సోదంతా అనుకోవద్దు... ! ఇప్పటికే అందరినీ చుట్టిపారేస్తున్న మీడియా ఇప్పుడు జర్నలిస్ట్ ల జీవితాన్ని కూడా చుట్టడం మొదలుపెట్టింది. ముంబై లో ఓ 53 మంది జర్నలిస్ట్ లకు సోకేసింది.ఇక చెన్నై లో అయితే ఒకే టీవీ ఛానెల్ లో 27 మందికి సోకేసింది. ఓహో అంతేనా అనుకోకండి ఇప్పుడు ఆ మహమ్మారి తెలుగు జర్నలిస్టులను వదిలిపెట్టలేదు.మహబూబ్ నగర్ ntv స్టాఫ్ రిపోర్టర్ అహ్మద్ పాషా, కెమెరామన్ శ్రీనివాస్, T న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ నరేష్ లను ఐసోలేషన్ ( మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ)కి తరలించేసారు. వీరే కాకుండా ప్రైమ్ 9 న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ శంకర్ (కొత్తపేట ) ap 24x7 స్టాఫ్ రిపోర్టర్ హరిశంకర్ ( గద్వాల) ఉన్నారు. వీరందరిని వారి వారి ప్రాంతాల్లో ఉన్న ఐసోలేషన్ కి తరలించారు. 

 

IHG's Sakshi(Saakshi) channel by Chandrababu naidu


ఎక్కడో సరే అసలు తెలంగాణ జర్నలిస్ట్ లకు ఈ కరోనా ఎలా సోకింది అనేది అందరి ప్రశ్న ...! ఏ జర్నలిస్ట్ లు అయితే కరోనా స్పెషల్ రాయితీలు ఉండవు కదా ...! కాకపోతే వీరందరికి మూకుమ్మడిగ సోకడానికి కారణం ఏంటి అనేది తీగ లాగితే ...? ఇటీవల కరోనాతో మృతిచెందిన తన అనుచరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న గద్వాల ఎమ్యెల్యే కృష్ణమోహన్ రెడ్డిని ఈ జర్నలిస్టులంతా ఆరు రోజుల క్రితం కలిశారు. ఆయనతో కలిసి భోజనం కూడా చేశారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు.గద్వాల NTV రిపోర్టర్ తమ్ముడికి కరోనా సోకింది. ఇప్పుడు ఐసోలేషన్ కి వెళ్లిన రిపోర్టర్స్ అంతా అక్కడకి కూడా వెళ్లడంతో వారందరిని ఐసోలేషన్ కి తరలించారు. ఈ లిస్ట్ మరింతగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. 

 

IHG

అసలు ఈ కరోనా కాలంలో అందరికంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సింది జర్నలిస్ట్ లే . నాసిరకమైన మాస్క్ లు వేసుకుని, అన్ని ప్రాంతాలను చుట్టేస్తూ ... వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరినీ కలుస్తూ అందరి అభిప్రాయాలూ తీసుకుంటూ ఎండా వానా అనే తేడా లేకుండా తెగ తిరిగేస్తూ ఉంటారు కదా ...! మరి కరోనా సంగతి పట్టించుకోకపోతే ఎలా ? అసలు ఈ సమయంలో జర్నలిస్ట్ ల సహాసాలు అవసరమా ..? అసలు జర్నలిస్ట్ అనే వాడు బాగున్నంతవరకే ఎవరి పలకరింపులైన. జర్నలిస్ట్ లకు ఏమైనా అయితే ఆదుకునేవాడు ఒక్కడూ ఉండడు. జర్నలిస్ట్ ల కోసం ఏ పథకమూ లేదు. ఏ నాయకుడూ ఆదుకునేందుకు ముందు రాడు. 


అసలు అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న మీకు ఏమైనా అయితే మీ కుటుంబాల పరిస్థితి ఏంటి ..? వారిని ఆదుకునే వారు ఎవరు ..? మీ యాజమాన్యాలకు అస్సలు ఆ బాధ్యత ఏమీ పట్టదు. ఎందుకో తెలుసా ..? నువ్వు తెచ్చే వార్త తప్ప నీ సంక్షేమం ఎవరికీ పట్టదు కదా ..! అందుకే నిన్ను నువ్వు రక్షించుకో ... లేదంటే ... కరోనాకూ... ఈ జాలి లేని సమాజానికి నువ్వు, నీ కుటుంబం బలవ్వాల్సిందే. భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్ !

మరింత సమాచారం తెలుసుకోండి: