ఇపుడిదే  ప్రశ్న యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది.  ఒకవైపు కరోనా వైరస్ సమస్య యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కమ్ నియంత కిమ్ జంగ్ ఉన్ కు తీవ్ర అనారోగ్యమన్న వార్త సంచలనంగా మారింది. ఒకవైపు కరోనా వార్తలు కవర్ చేస్తున్న మీడియా ఎప్పుడైతే కిమ్ జంగ్ ఉన్ కు తీవ్ర అస్వస్తగా ఉందన్న వార్త రాగానే అందరి దృష్టి ఒక్కసారిగా ఉత్తర కొరియా వ్యవహారాలపై మళ్ళింది.

 

కరోనా వార్తల నేపధ్యంలో కూడా  యావత్ ప్రపంచం కిమ్ అనారోగ్యం పై మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయంటే  ప్రపంచంలో కిమ్ కున్న క్రేజు ఏమిటో చెప్పకనే చెబుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కిమ్ కు ఏమి జరిగినా న్యూస్ బయటకు రాదు. అధికారికంగా ప్రభుత్వం ఏమి చెప్పాలనుకున్నదో దాన్ని మాత్రమే చెబుతుందంతే. మనకున్నట్లు న్యూస్ పేపర్లు, ఇంటర్నెట్, టివి ఛానళ్ళు, న్యూస్ ఏజెన్సీలు లేవు.

 

అసలింతకీ కిమ్ కు ఏమైంది ? ఇపుడిదే యావత్ ప్రపంచదేశాలను ముఖ్యంగా ధక్షిణకొరియా, అమెరికాను తొలిచేస్తున్న ప్రశ్న.  అమెరికాలోని సిఎన్ఎన్  వార్తా సంస్ధ అయితే ఏకంగా కిమ్ బ్రైన్ డెడ్ అని కోమాలోకి వెళిపోయాడంటూ ధక్షిణకొరియాలో విశ్వసనీయవర్గాలను ఉదహరిస్తు వార్త ప్రచురించటంతోనే సంచలనం మొదలైంది. అసలు సిఎన్ఎన్ వార్తకు మూలం ఏమిటంటే ధక్షిణకొరియాలోని ఓ వెబ్ న్యూస్ లో వచ్చిన  ప్రత్యేక కథనం.

 

ప్రపంచదేశాలన్నీ కిమ్ ఆనారోగ్య పరిస్ధితులపై ఎందుకింత ఆసక్తి చూపుతున్నాయి ? ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చాలా వరకు అమెరికాకు అనుకూలం వ్యతిరేకంగా చీలిపోయిన విషయం తెలిసిందే. అమెరికాను కిమ్ పూర్తిస్ధాయిలో వ్యతిరేకిస్తున్నాడు.  కాబట్టి అగ్రరాజ్యాన్ని వ్యతిరేకించే దేశాలకు బలమైన ఉత్తరకొరియా  నియంత కిమ్ చాలా ఇష్టుడు. అవసరమైతే అమెరికాను దెబ్బ తీయటానికి తనకు మద్దతుగా నిలిచే ఏ దేశానికైనా అణ్వాయుధాలు అందించే తెగువ వున్న వాడు.

 

అలాగే అమెరికాకు మద్దతుగా నిలిచే దేశాలకు కిమ్ అంటే ఒళ్ళుమంట. ఎందుకంటే అగ్రరాజ్యాన్ని బహిరంగంగా సవాలు చేసి ఎదురు నిలిచిన వాడు. కిమ్ ను చూసుకునే చాలా దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. ఒకవిధంగా అమెరికాకు కిమ్ పక్కలో బల్లెం లాగ తయారయ్యాడనే చెప్పాలి. ఇటువంటి కిమ్ అనారోగ్యం ముదిరిపోయిందనగానే వెంటనే ఏమైందంటూ ఆరాలు తీస్తున్నాయి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కిమ్ కు అసలు ఏమైందనే విషయంలో ఇటు మద్దతుగా నిలిచే దేశాలకు కానీ అటు వ్యతిరేకించే దేశాలకు కానీ ఏ విధమైన సమాచారం అందటం లేదు. కిమ్ సోదరి దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటోందనే ప్రచారం కారణంగా నియంత కిమ్ జంగ్ ఉన్ కు ఏమో అయ్యిందనే ప్రచారం మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా వార్తలకు ప్రపంచంలో ఎంత ప్రాధాన్యత ఉందో నియంత అనారోగ్యం వార్త కూడా ప్రపంచంలో అంతే సంచలనమైందంటే కిమ్ మామూలోడు కాదు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: