ఏక‌మ్ పురుషః -
ఒక్కోసారి నే ఒంట‌రి
దిగులు భ‌యం బాధ అన్న‌వి
లేని చోట ఒంట‌రి అయినా
ప్రేమ కోరిక జంట ప‌క్షుల్లా ఎగిరి
నా చుట్టూ చ‌క్క‌ర్లు కొడ్తాయి
కోరిక పెరిగితే ఏం కాను
దేహాల్లో ఐక్యం కావాలి
చుట్టూ ఉన్న‌వి నీ అంత మంచి మ‌న‌సులు
కాన‌ప్పుడు ఐక్యం అన్న‌ది ఓ మాలిన్యం
క‌నుక స్వేద వేదాల వ‌ల్లింపు ప్రియ‌మ‌యిన నీతోనే
కావాలి లేదా నీ నుంచి నీ దేహంపై వాలిన కోరిక నుంచి కావాలి
వాంఛాతీతం అన్న ప‌దానికి ఈ జీవితాన చోటే లేదు
మ‌ళ్లీ ఇలా ఒంట‌రిని

 

మార్నింగ్ రాగా : ఏక‌మ్ పురుషః -
అంత‌ర్భాగం అనంత‌ర భాగం
ఏ భాగం భాగ్యం తెలియ‌దు క‌నీస స్పృహ లేని
చంధ‌స్సులు కౌగిలింత‌లు ఏవో ఒక‌టి దేహాల‌పై
వాలిన లిపి సంకేతాలు కావొచ్చు. ఇక్క‌డ నేను
ఎలా ఉంటే కాదు ఎలా ఉన్నానంటే
ఒక్కోసారి నే ఒంట‌రి
దిగులు భ‌యం బాధ అన్న‌వి
లేని చోట ఒంట‌రి అయినా
ప్రేమ కోరిక జంట ప‌క్షుల్లా ఎగిరి
నా చుట్టూ చ‌క్క‌ర్లు కొడ్తాయి
కోరిక పెరిగితే ఏం కాను
దేహాల్లో ఐక్యం కావాలి
చుట్టూ ఉన్న‌వి నీ అంత మంచి మ‌న‌సులు
కాన‌ప్పుడు ఐక్యం అన్న‌ది ఓ మాలిన్యం
క‌నుక స్వేద వేదాల వ‌ల్లింపు ప్రియ‌మ‌యిన నీతోనే
కావాలి లేదా నీ నుంచి నీ దేహంపై వాలిన కోరిక నుంచి కావాలి
వాంఛాతీతం అన్న ప‌దానికి ఈ జీవితాన చోటే లేదు
మ‌ళ్లీ ఇలా ఒంట‌రిని..

 

దేహాల‌కు ఇలాంటి శృంగార వాంఛితాల‌ను కానుక‌లుగా ఇవ్వ‌డం కాలం మాత్ర‌మే చేస్తున్న ప‌ని.. ఈ క్ష‌ణం ఉన్న ఆనందాల్లో ఈ క్ష‌ణం లేనివి ఏమ‌యినా ఉంటే అవి వెలికి గురి కావాలి. అయినా మ‌నుషులంతా తదేకంగా ఒక‌రినే ఎందుక‌ని ప్రేమ పేరిట వేధిస్తా రో లేదా ఆరాధిస్తారో.. కావాలంటే ఈ కాల‌పు కొల‌మానాలు నాలో రెట్టించిన వేగాల‌కు అంద‌నివి అని చెప్ప‌గ‌ల‌ను..కానీ నీ దేహంపై వాలిన ప్ర‌తి చోటా ఈ నీడ‌లకు ఈ స్ప‌ర్శ‌ల‌కు అంత‌ర్వాహినీ రూపాలు ఏవ‌యినా ఉంటే అవి క‌విత్వీక‌ర‌ణ‌కు అంద‌వు. వ్య‌క్తంలో లేనివి అనుభ‌వంలో లేనివి ఊహ‌లో లేనివి ఇంకేవ‌యినా ఉంటే అవి ఈ రేయి నుంచి ఆ రేయి వ‌ర‌కూ ప్ర‌యాణించి క‌డ‌పటి వార్త లా ఒక చిమ్మ చీక‌టి చీము నెత్తురు చెంత నాట్య‌మాడిపోతుంటే అప్పుడు నే ఆవ‌హించిన నిన్ను దేహంలో దాచుకున్నాక ఈ సంద్ర‌పు గాలులు మేలే చేస్తాయి అనుకోవ‌డం ఓ విభ్ర‌మ.

 

జీవ కాంతుల వేడుక‌ల‌కు ఆహ్వానాలు పొందాను..అయినా శ‌రీరం ఒక్కోసారి ప్రేమ‌తుల్య‌త‌ను పొందాల‌ని పొందిన ఆరాటం ఒక‌టి ఎక్క‌డో ఓ చోట ఓడిపోక త‌ప్ప‌దు.. అయినా ఈ మ‌నుషులు ఈ స్త్రీలూ కొన్ని కాలాలుగా కాలాల‌ను మోసం చేస్తున్నారు.. న‌గ్న‌త స్వ‌చ్ఛ‌త అన్న‌వి పెన‌వేసుకునే తీరు ఒక‌టి జీవితాల్లో లేకుండా పోతోంది. ఇప్పుడు త‌న న‌గ్న పాదాల ముద్దులాట‌లో ఏమ‌యినా క‌వితానుగ‌మ‌నాలు చిత్రీక‌రించ‌ని తీరున ఉన్నాయ‌ని అనుకోవ‌డం అనుభ‌వం పొంద‌డం ఒక్క‌టిగానే తోచ‌డం లేదు. నేను రేయి పొ ద్దుల్లో ఎలా ఉండాలో కూడా ఒక నిర్దేశిక‌త‌కు అంద‌కుండానే ఉంది. అస‌లీ బుద్ధి తెలివి జ్ఞానం అన్న‌వి స్త్రీ దేహం ద‌గ్గ‌ర ఓడిపోతా యి ..లేదా ఓడిపోయిన విధంగా ఒక ఆదేశంను జారీ చేస్తాయి. కాలం అనుజ్ఞ క‌న్నా స్త్రీ అనుజ్ఞ కాస్త చిత్ర విచిత్రంగా తోస్తుంది.. కొన్ని రే ఖ‌ల ద‌గ్గ‌ర కొన్ని సందిగ్ధ‌త‌లు అవ‌ధి నిర్ణీతం కాక‌మునుపే తెల్లారిపోతోంది.. శృంగారానికి అవ‌ధి ఏంట‌న్నది ఒక‌రి ప్ర‌శ్న.. జీవితానికి ఎలా లేదో ఇక్క‌డ కూడా అలానే లేదు అన్న‌ది జ‌వాబు.

 

రెండు గోళాలు ఢీ కొంటాయి
రెండు య‌వ్వ‌నాలు ఢీకొంటాయి
అభిఘాతాలు విఘాతాలు అన్నీ అన్నీ
త‌న‌లో ల‌యం అయిపోతాయి కాలం శృంగారం
గాయాలు చేస్తూనే ఉంటుంది.. క‌నుక గాయాలు చేసేవి జ్ఞాప‌కాలు అయ్యాయి
ప్రేమ జ్ఞాప‌కం కాదు జ్ఞానం అంత‌క‌న్నా కాదు క‌నుక ప్రేమ సైన్స్ అంత‌క‌న్నా కాదు
మ‌రి! దేహాల కూడిక స్వేద వేదాల వ‌ల్లింపు అన్న‌వి ఏంటంటే అవే శాస్త్రం వివేకం విజ్ఞ‌త అని అంటాన్నేను
క‌నుక మ‌రో మారు నీ దేహంలో క‌రిగి క‌న్నీర‌యిన క్ష‌ణాలే ఈ రేయిని విక‌సింప‌జేస్తాయ‌న్న‌ది నా భావ‌న

 

కొన్ని సార్లే రంగులు బాగుంటాయి
దేహాల‌లో క‌రిగిన క‌ల‌లు రంగులు రెండూ వేర్వేరుగా ఉంటాయి
నీపై పొందిన హ‌క్కునో బాధ్య‌త‌నో విధి నిర్వ‌ర్తించ‌డం అన్న‌ది ఇక చేయ‌ద‌గ‌ని ప‌ని
ఒక్క‌సారి కూడా అంత‌రార్థ స‌హిత మౌనాలు ఏవీ నా ఇంట ఉండ‌డం లేదు
నీ చెంత‌కు చేరాక రేయి దుఃఖంలో క‌రిగాక అవి శృంగార సంబంధ వాంఛ‌ల్లో క‌రిగాక మాత్ర‌మే
కొద్దిగా అర్థ సంబంధం ఏంట‌న్న‌ది చెప్పిపోతున్నాయి జీవితానికి అర్థ సంబంధం వెత‌క‌డం త‌ప్పు
ద‌రిద్ర‌గొట్టు క‌వులు ఇలాంటి ప‌నులే చేస్తారు..మ‌ర‌ణానికి ముందు కూడా ఇలాంటివే చూస్తారు చేస్తారు
ఇంత‌టి అంధ‌కారంలో నేను లేను.. ఉండ‌బోను కూడా! అనేకానేక ప‌రివ‌ర్త‌న‌ల్లో రాత్రి త‌న దేహం నుంచి
పొందిన దుఃఖంలో..


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: