చంద్రబాబునాయుడును నమ్ముకుంటే ఏమవుతుందో తాజాగా మరో ఉదాహరణ బయటపడింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ ముఖ్యమంత్రిని నమ్ముకుని పూర్తిగా ఇరుక్కుపోయినట్లే ఉన్నాడు. స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత జరిగిన పరిణామాల్లో నిమ్మగడ్డ నుండి కేంద్ర హోంశాఖకు ఓ లేఖ వెళ్ళింది. ఆ లేఖలో రాష్ట్రప్రభుత్వం ఇమేజి బాగా డ్యామేజి అయ్యేట్లుగా ఉంది. అటువంటి లేఖను అసలు నిమ్మగడ్డ రాయలేదని టిడిపి నేతలు ఎవరో డ్రాఫ్ట్ చేశారనే ఆరోపణలు మొదలయ్యాయి.

 

ఇప్పుడు తాజా విషయం ఏమిటంటే ఆ లేఖను నిమ్మగడ్డ రాయలేదన్న విషయం తేలిపోయింది. బయట ఎక్కడి నుండో వచ్చిన లేఖను పెన్ డ్రైవ్ ద్వారా నిమ్మగడ్డ తన కంప్యూటర్లలోని డెస్క్ టాప్ మీదకు తీసుకున్నాడట. తర్వాత అదే లేఖను వాట్సప్ లోకి వేసుకున్న తర్వాత తన మొబైల్ ఫోన్ నుండి కేంద్ర హోంశాఖకు పంపాడట. ఈ విషయాలన్నీ అప్పట్లో నిమ్మగడ్డకు అడిషినల్ పిఎస్ గా పనిచేసిన సాంబమూర్తి బయటపెట్టాడు.

 

అడిషినల్ పిఎస్ ఎందుకు బయటపెట్టాడంటే మొత్తం నిమ్మగడ్డ వ్యవహారాన్ని సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా  అడిషినల్ పిఎస్ ను విచారిస్తే జరిగిన మొత్తం వ్యవహారాలను బయటపెట్టేశాడు. అంటే పెన్ డ్రైవ్ వచ్చిన దగ్గర నుండి కేంద్ర హోంశాఖకు లేఖ వెళ్ళిన దాకా మొత్తం వ్యవహారాన్ని నిమ్మగడ్డ అడిషినల్ పిఎస్ ద్వారానే జరిపించాడని అర్ధమవుతోంది. లేఖ వెళ్ళిన తర్వాత కంప్యూటర్ ను రెండుసార్లు ఫార్మాటింగ్ జరిపించాడు.

 

కంప్యూటర్ ను ఎందుకు రెండుసార్లు ఫార్మాటింగ్ చేయించాడంటే తాను లేఖ పంపిన విషయం ఎక్కడా బయటపడకూడదని. అలాగే బయటనుండి వచ్చిన  పెన్ డ్రైవ్ ను కూడా నిమ్మగడ్డ ఆదేశాల ప్రకారం తానే ధ్వంసం చేసినట్లు అడిషినల్ పిఎస్సే ఒప్పుకున్నాడు.  ఇవన్నీ ఎందుకు చేశాడంటే తన బాస్ నిమ్మగడ్డ చెప్పినట్లు చేయటమే సబార్డినేట్ గా సాంబమూర్తి  డ్యూటి కాబట్టి చేశాడు.

 

మొత్తానికి  చంద్రబాబు మాయలోపడితే  చివరకు ఏమవుతుందో తాజాగా నిమ్మగడ్డ వ్యవహారంలో కూడా తేలిపోయింది. మొన్నటికిమొన్న శాసనమండలి  ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ను మాయచేసి రెండు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపించిది కూడా చంద్రబబే. మెజారిటీ ఉందన్న ఏకైక కారణంతో శాసనమండలిలో ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని అడ్డుకున్నాడు. దాంతో ఒళ్ళు మండిపోయిన జగన్మోహన్ రెడ్డి అసలు శాసనమండలే అవసరం లేదని డిసైడ్ అయ్యాడు. కరోనా వైరస్ సమస్య లేకపోతే దాదాపు నెల రోజుల క్రితమే మండలి రద్దు అయిపోయుండేదేమో. అంతకుముందు తెలంగాణాలో ఓటుకునోటు కేసులో ప్రధాన పాత్రధారి రేవంత్ రెడ్డి కూడా ఇలాగే దొరికిపోయాడు. మొత్తానికి చంద్రబాబును నమ్మినా, మాయలో పడినా ఏమవుతుందో అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: