ప్ర‌తిసారీ ఓడిపోండి ఏం కాదు
వైర‌స్సులు వ‌చ్చి మీ ప్రాణాలు తోడేస్తాయి
అంటే అలాంటి తోడేళ్లు ఇంకా ఈ స‌మాజంలో ఉన్నాయి
మ‌రి! వాటి గ‌తో! వేళ‌కు రాని జీతం వేళ‌కు తీర‌ని ఆక‌లి
ఆ తోడేళ్ల‌కు ప‌ట్ట‌వు.. ఏమ‌యిన కానీయండి
ఎవ‌రి వ్యాపారం వారికి ముఖ్యం..
ఎవ‌రి సంపాద‌న వారికి ధ్యేయం
ప్ర‌జ‌లు చ‌స్తే మ‌ర‌ణాల సంఖ్య మాత్రం చూపుతారు ధైర్యం మాత్రం చెప్ప‌రు

 

ఉద‌యం ఆరింటికి ఒక పారిశుద్ధ్య కార్మికుడు వ‌స్తారు
జీతం ఉన్నా లేకున్నా త‌న ప‌ని తాను చేసుకుని పోతారు
ఉద‌యం ఏండింటికే ఒక‌రు వ‌స్తారు
న‌లుగురికి అన్నం సిద్ధం చేయాల‌న్న త‌ప‌న‌లో మ‌రో న‌లుగురితో క‌ల‌సి ప‌నిచేస్తారు..
కొంద‌రు త‌ల్లులు బిడ్డ‌ల‌ను సిద్ధం చేస్తారు
మీరు వెళ్లి రండి ఈ దేశం మీ కోసం ఎదురు చూస్తుంద‌ని
త్యాగాలో స్ఫూర్తిదాయ‌క క‌థ‌నాలో నాలోనో మీలోనో ప్ర‌తిరోజూ స్మ‌ర‌ణ‌కు తూగాలి /ఎవ‌రిని ప్రేమించాలి.. నిండైన విశ్వాసం ఇచ్చిన వైద్య శాస్త్రాన్ని న‌మ్ముకోండి ఏం కాదు /గాలి వార్త‌ల‌ను కాదు..ఒక‌వేళ కేసులు న‌మోద‌యిన మృత్యు దిబ్బ‌ల నిర్మాణం ఇప్ప‌ట్లో సాధ్యం కాదు

 

దేశాన్ని ఎలా నిర్వ‌చించాలి
నాలో మీలో పెంచుకోద‌గ్గ న‌మ్మ‌కాల‌ను ఎలా విస్తృతం చేయాలి
దేశాన్ని మ‌ట్టితోనో ప‌నికిమాలిన పూర్వ క‌థ‌ల‌తోనే పోల్చి చూడడం మానుకోండి/కృష్ణుడో బ‌ర్భ‌రీకుడో ఎవ్వ‌డో ఒక్క‌డు అన్నింటా ఉంటాడు అంటాడు సౌదా అలా /మ‌నం కూడా ఆ కృష్ణ గీత ఉందో లేదో కానీ యుద్ధంకు స‌న్న‌ద్ధం అవుతూ మ‌ర‌ణ శ‌య్య‌ల‌ను/సిద్ధం చేసుకోవ‌డం త‌గ‌ని ప‌ని.. ఎండ‌లో కొంద‌రు వాన‌లో కొంద‌రు తుఫానుల్లో కొంద‌రు/త‌మ‌ని తాము ఫ‌ణంగా పెట్టుకుని కొంద‌రు.. ప‌నిచేస్తుంటే చూశాక క‌లిగిన ధైర్యం /ఈ ద‌రిద్ర‌గొట్టు పేప‌ర్లు పోగొడ్తాయి.. విశ్వాసాలు అన్నీ స‌న్న‌గిల్లేలా చేస్తాయి/అయినా ఈ పేప‌ర్లు ఈ ద‌రిద్ర‌గొట్టు మీడియాలు ఆగిపోతేనే మేలు..

 

ఫ‌స్ట్ కాజ్ : మా జిల్లా(శ్రీ‌కాకుళం) లో మూడు కరోనా పాజిటివ్ కేసుల న‌మోద‌యి ఆందోళ‌న‌లు తీవ్ర‌త‌రం అవుతున్న నేప‌థ్యాన నేల‌కు చైత‌న్యం ఇచ్చాక మ‌నిషి రూపం గొప్ప తేజ‌స్సు అందుకున్నాక ఈ మ‌నుషులూ ఆ నేల‌లూ కొత్త ఉద‌యాల సృష్టి చేస్తే అది విప్ల‌వం అయింది. విప్ల‌వాల‌ను న‌డిపించిన ఘ‌న‌త‌ల్లో కొత్త పాట కొత్త స్ఫూర్తి అర్థ‌వంతం అయింది. వ్యాధుల క‌ట్ట‌డి కూడా వి ప్ల‌వ‌మే.. సాంకేతిక యుద్ధాల‌ను కాస్త గమ‌నిస్తూ ఉండాలి.. ఇవి ఆయుధ పోరుకు సంబంధించిన‌వి కాదు వివేకానికీ తెలివికీ సం బంధించిన‌వి .

 

మ‌న ప్ర‌యోగ వేదిక‌ల్లో ఇంకా చేయాల్సిన‌వి ఉన్నాయి చేస్తున్నారు,. ఆ ప్లాజ్మా థెర‌ఫీ కూడా ఇంకా ఓ కొలిక్కి రావ ‌డం లేదు.. పోనీ పాజిటివ్ కేసులు న‌మోద‌యినంత మాత్రాన మీరు మృత్యుదిబ్బ‌ల‌ను ఆహ్వానిస్తున్నారా! అయితే రండి అంద‌రి క‌లిసే చావాలి.. మీ శ‌వం నా శ‌వం ఇంటికి పోకూడ‌దు.. అలాంటి చావే కోరుకుంటే అలాంటి వార్తే రాయాల‌నుకుంటే త‌ప్ప‌క రా యండి.. శ‌వాలకో అంతిమ సంస్కారం లేని చోటు ద‌గ్గ‌ర మీరూ నేనూ పోదాం రండి..మీరు బాధ్య‌త మ‌రిచి కేవ‌లం సంచ‌ల‌నాల కోసం రాసే ఏ ప‌నికిమాలిన వార్త కూడా నెగ్గుకురాదు. వైద్య శాస్త్రం పోరాడుతోంది.. యంత్రాంగం పోరాడుతోంది.. పోలీసు పోరాడుతున్నాడు వీరి కృషిని మీరు న‌మ్మ‌క .. ఏదో జ‌రిగిపోయిన‌ట్లు రాస్తే ఏమౌతుంది అని!

 

ఒక గుహ‌లో పిల్లలు చిక్కుకున్నారు
థాయ్ గుహ‌లో పిల్ల‌లు బిక్కుబిక్కుమంటున్నారు
వారితో పాటే కోచ్ కూడా ఉన్నారు
అలాంటి చోట ఆ ఫుట్ బాల్ కోచ్ ఆ పిల్ల‌ల‌కు ఇచ్చిన ఒక గొప్ప స్ఫూర్తిని ఎలా మ‌రువ‌గ‌లం
అలాంటి పిల్ల‌ల కోసం వారి రాక కోసం ఈ ప్ర‌పంచం ప్రార్థ‌న చేసింది.. ఏక‌మై వారి రాక‌ను స్వాగ‌తించింది.మ‌న ప్రార్థ‌న‌లో ప్ర‌య‌త్నాలో ఫ‌లించాలంటే స‌మ‌ష్టి కృషికి అది సంకేతం కావాలి.. ప్రార్థిస్తేనే ఫ‌లితాలా కాదు ప్రార్థ‌న‌తో కూడిన ప్ర‌య‌త్నాలే ఫ‌లితాల‌కు సంకేతాలు.. ఇప్పుడు మ‌ర‌ణాల‌ను ఆహ్వానిస్తున్నారా.. అంటే మీరు శ‌వాల దిబ్బ‌ల‌పై వార్త‌లు రాస్తారా హాయిగా రాయండి ఏం కాదు.. చావు క‌రోనా తెచ్చినా మీరు ప్రోదిచేసిన అప‌న‌మ్మ‌కాల పుణ్య‌మాని వ‌చ్చినా భ‌యాల పుణ్య‌మాని వ‌చ్చినా అదంతా ఒక్క‌టే.. శ‌వాల మీద వార్త‌లు రాయండి బాగుంటుంది...అలాంటి వార్త‌లే ఎక్కువ మంది చ‌దువుతారు ఆనందిస్తారు.

 

విశ్వాసం ఒక‌టి ఇవ్వాలి
నీలో అచంచ‌ల శ‌క్తికి ఆలంబ‌న కావాలి
ఎవ్వ‌ర‌యినా ఎప్పుడ‌యినా నీ నుంచి పొందిన‌వ‌న్నీ
త‌ల్చుకుని పొంగిపోవాలి.. ఒక మ‌నిషిని త‌ల్చుకుంటే ఇదే కావాలి అమ్మా నాన్న స్మ‌ర‌ణ‌కు తూగే వేళ మీ మీ న‌మ్మ‌కాలు కొత్త ధైర్యాలే దైవిక చింత‌న‌లు..అవి రాళ్లే నేను చైత‌న్యం ఇచ్చాక ఏమ‌యింది క‌ద‌లిక వ‌చ్చింది అవి అస్తిక‌లే నేను నిద్రాణాన్ని జ‌యించాన‌ని చెప్పాక కొత్త నినాదాల‌కు రూపం ఇచ్చింది..తెలంగాణ నేల నుంచి వ‌చ్చాను అంటాను.. అవును అక్క‌డ శూన్య స్థావ‌రం నుంచి వ‌చ్చిన నినాదాన్ని నేను..ఇవాళ కేసులు న‌మోద‌యినంత మాత్రాన మేం చెప్పాం మేం చెప్పిందే జ‌రిగింది లాంటి డ‌ప్పు వాక్యాలు రాస్తున్న మీడియాలంటే అస‌హ్యం.. వాటి వ‌ల్ల ఈ ప్ర‌జ‌ల‌కు ఏమీ ఒన‌‌గూర‌దు..ఒక‌రితో చెప్పాను.. మీరు మాట్లాడండి ఈ ప్ర‌జ‌ల్లో కొత్త విశ్వాసం నింపండి.. మ‌న శ‌క్తి మ‌న చేత‌న మ‌న శ్ర‌మ వేదం ఇవి క‌దా! కూడుకున్న గొప్ప నినాదాలు.. వీటిని దాటుకుని ఎవ్వ‌ర ‌యినా ఏమ‌యినా రాయ‌గ‌ల‌రా చేయ‌గ‌ల‌రా??

 

బిడ్డ‌ల‌కు త‌ల్లిదండ్రుల‌కు ఏమ‌యినా భ‌రోసా ఇవ్వాలంటే
ముందు ఈ కాలానికి ప‌ట్టిన జాడ్యాల‌ను వ‌దిలించాలి
లేదా ఇదే అదునుగా గాలి వార్త‌లు పోగేసే వారిని నిలువ‌రించాలి
ద‌రిద్ర‌గొట్టు మీడియాలు ఏవేవో రాస్తాయి న‌మ్మ‌కాలు స‌న్న‌గిల్లిస్తాయివాటిని న‌మ్మ‌క మ‌నం ముందుకు ప్ర‌యాణించాలి చావు వ‌చ్చేస్తుంది.. మీరు చ‌చ్చిపోండి అని రాయ‌గ‌లిగే ద‌రిద్రం నాలో లేదు.. కానీ మ‌ర‌ణాన్ని జ‌యించే శ‌క్తి ఎవ్వ‌రిలో ఉందో వెత‌కండి.. వారికో నూత‌న ఉత్తేజాన్ని ఇవ్వండి.. ఒక సంక‌ల్పం ద‌గ్గ‌ర మానవ జాతి గెలిచిన సంద‌ర్భాల‌ను ప్రేమించండి. నేనో నువ్వో ఈ విప‌త్తు కాలాల‌ను జ‌యించే శ‌క్తి నీ నుంచి పుడుతుంది నీ నుంచి ఇంకొంక‌రిలో గొప్ప బలాల‌ను ప్రోది చేస్తుంది.

 

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: