తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావం నుంచి ప్ర‌స్తుతం వ‌ర‌కు కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలకు  ఈ ప్రాంత ప్ర‌జ‌లు  మ‌ద్ద‌తు తెలుపుతూనే ఉన్నారు.  ప్ర‌జానాడి ప‌ట్టుకోవ‌డంలో కేసీఆర్‌కు మించిన ఉద్య‌మ‌కారుడు..పాల‌నాద‌క్షుడు ఇప్పుడున్న స‌మ కాలిన దేశ రాజ‌కీయాల్లో లేడంటే అతిశేయోక్తి ఏమీ కాదు. గ‌తేడాది ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లి మ‌రీ అద్భుత విజ యాన్ని సంపాదించాడు. రాష్ట్రంలో టీఆర్ ఎస్‌కు అప్ర‌తిహ‌త విజ‌యం ద‌క్క‌బోతోంద‌న ప‌దేప‌దే వేదిక‌ల‌పై చెప్పారు. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తీ రాజ‌కీయ నాయ‌కుడు చెప్పే మాట‌గానే విశ్లేష‌కులు భావించారు. తాము చేయించిన స‌ర్వేల్లో కూడా టీఆర్ ఎస్‌కు అధికారం ద‌క్క‌బోతున్నా...బోటాబోటీ మెజార్టీయే వ‌స్తుంద‌ని తేల్చేశారు.

 

ఫ‌లితాలు మాత్రం ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా....నూటికి నూరుపాళ్లు కేసీఆర్ చెప్పిన‌ట్లుగానే వ‌చ్చాయి. జ‌నం నాడి గురించి కేసీఆర్‌కు ఏ స్థాయిలో తెలుసో అని చెప్ప‌డానికి ఇది చాలు. టీఆర్ ఎస్ 20ఏళ్ల ప్ర‌స్తానంలో అప్ర‌తిహ‌త విజ‌యాలు సాధించింది. తెలంగాణ రాష్ట్ర‌సాధ‌న‌...జ‌ల‌దృశ్యం అద్భుతాలు అని చెప్పాలి. టీఆర్ ఎస్ పార్టీకి ముందు ఆద‌ర‌ణ ల‌భించింది ప‌ల్లెల్లోనే. ప‌ట్నం జ‌నమైనా కాస్త అటు ఇటుగా ఆలోచించినా...తెలంగాణ ప‌ల్లెజ‌నానికి కేసీఆర్ ఎంత చెబితే అంతే. కేసీఆర్ అంటే జ‌నాల‌కు అంత న‌మ్మ‌కం. స‌మీప భ‌విష్య‌త్‌లోనే కాదు...ఇంకా ద‌శాబ్దాల కాలం పాటు ఆ న‌మ్మ‌కం స‌న్న‌గిల్లే..చెదిరే అవ‌కాశం లేదు. 

 

ప్ర‌జ‌ల గుణ‌మెరిగి..బాధ‌ల‌నెరిగి కేసీఆర్‌ నిర్ణ‌యాలు..విధానాలు ప్ర‌క‌టించ‌డం మ‌నం చూస్తునే ఉన్నాం.  దేశంలో ఏ ప్ర‌భుత్వానికి ఈ స్థాయిలో  ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు.  కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా అది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోస‌మై, ప్ర‌జాశ్రేయ‌స్సు కోస‌మే అయి ఉంటుంద‌ని జ‌నాల్లో ఎన‌లేని విశ్వాసం నెల‌కొని ఉంది. ఉద్య‌మ స‌మ‌యంలో ఇచ్చిన ప్ర‌తీ మాట‌కు..నినాదానికి కేసీఆర్ క‌ట్టుబ‌డి ఉన్నాడు. చెప్పిన ప్ర‌తీ మాట‌ను ఆచ‌ర‌ణ‌లో నెర‌వేరుస్తూ తెలంగాణ జాతిపిత అన్న బిరుదుకు సార్థ‌క‌త చేకూరుస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ గుండెల్లో గుడిక‌ట్టుకుని మ‌రీ పూజిస్తున్నారు. 20 వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర స‌మితిని శ‌త‌మానం భ‌వతి అంటూ దీవిస్తున్నారు...!

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: