ఛీ ఛీ వెధవ రాజకీయాలు ..! రాజకీయం అంటేనే పెద్ద బురద. ఆ బురదలోకి వెళ్లడం కంటే సైలెంట్ గా ఉంటే ఏ గొడవా ఉండదు. అని ఇప్పుడు చాలామందిలో అభిప్రాయాలు సాధారణ జనాల్లో ఉన్న అభిప్రాయం. అయితేనేమి ...? రాజకీయాల్లోకి దిగాక బురద అయినా ఫర్వాలేదు... కడుక్కుంటాము అన్నట్టుగా తయారయ్యాయి కొంతమంది నాయకుల రాజకీయాలు. ముఖ్యంగా ఏపీలో రాజకీయాల సంగతి చూసుకుంటే జనాల సంగతి, రాష్టం సంగతి మాకెందుకు మాకు కావాల్సింది అసలు సిసలైన రాజకీయం అన్నట్టుగా వరద, బురద ఇలా ఏదీ లేకుండా అన్నిటిని రాజకీయాలకు వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విచిత్రమైన రాజకీయం ఏపీలో కనిపిస్తోంది. ఇక్కడి ప్రతిపక్షాలు ప్రజల తరపున గొంతుకగా మారి, అధికార పార్టీని ప్రజా సమస్యల విషయంలో నిలదీయాల్సి ఉన్నా, కేవలం రాజకీయ అంశాల విషయంలో మాత్రమే తరచుగా గొంతెత్తుతూ, చిన్న విషయానికి కూడా అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా తయారయ్యాయి. ఇందులో ఆ పార్టీపార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఈ విధంగానే తయారయ్యాయి. 

 

IHG

రాజకీయంగా ఏ పార్టీ ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా అంతిమం గా ప్రజల తీర్పు ఫైనల్. గత టీడీపీ ప్రభుత్వాన్నే తీసుకుంటే 175 స్థానాల్లో కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చాయంటే ఎంతటి ప్రజాగ్రహం మూటగట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అయితే గత కొంత కాలంగా రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికారపక్షం కంటే ప్రతిపక్షాల తీరుపైనా అనుమానాలు ముసురుతున్నాయి. సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి కలుస్తున్న తీరు, ఆధారాలు కూడా ఆయా పార్టీ చేస్తున్న విమర్శలు చూస్తున్నప్పుడు ఏపీ రాజకీయాలు ఎంతగా దిగజారిపోతున్నాయి అనేది అర్ధం అవుతోంది. 

 

IHG


ముఖ్యంగా ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికార పార్టీని దెబ్బతీయడమే ఏకైక లక్ష్యం గా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బాబు జవసత్వాలన్నీ కూడగట్టుకుంటున్నాడు. పార్టీ నాయకుల అభిప్రాయాలు, సూచనలు పక్కన పెట్టి మరీ బద్ద రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. అక్కడితో ఆగకుండా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ రాజకీయం మరింత శృతి మించింది. నిర్మాణాత్మకమైన విమర్శలను సైతం పక్కనపెట్టి వైసీపీ మీద బురద జల్లడమే పనిగా టీడీపీ రాజకీయాలకు పాల్పడుతోంది. 

IHG


ఇక మిగతా పార్టీలు కూడా చంద్రబాబు రాజకీయ చట్రంలో చిక్కుకుని తమ పరువు తామే తీసుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రాజకీయాల్లో హత్యలుండవ్ ఆత్మహత్యలు తప్ప అనే విషయాన్ని రుజువు చేసేలా సొంతంగా పార్టీ ఎదుగుదల పట్టించుకోవడం మానేసి చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ పవన్ తన ఇమేజ్ ను తానే తగ్గించుకుంటున్నాడు.ఇక ఏపీ బీజేపీ కూడా అదే ట్రాప్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా పూర్తిగా బాబు కంట్రోల్ లోకి వెళ్లిపోయారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  ఇక వామపక్ష పార్టీలు కూడా ఇదే బాటలో నడుస్తూ తమ రాజకీయ పతనానికి తామే చేజేతులా మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: