- ఉద్వేగ భ‌రితంగా యువ ఎంపీ రాము ప్ర‌సంగం

- ఎఫ్బీ లైవ్ లో యువ‌త‌కు అనేక జాగ్ర‌త్త‌లు చెప్పిన వైనం

- స‌మ‌ర్థ నాయ‌క‌త్వంతోనే స‌మ‌స్య ప‌రిష్కారం

- సీఎం స్థాయి వ్య‌క్తులు అలా మాట్లాడ‌డం త‌గ‌దు

- కేసులు పెరుగుతున్నా దీన్నొక సాధార‌ణ జ్వ‌రం అని తేల్చేస్తారా?

- వ‌ల‌స జీవుల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వాలి

 

బాధ్య‌త..ఎక్క‌డున్నా ఎప్ప‌డ‌యినా నెర‌వేర్చే తీరాలి..భ‌రోసా..ఎంత క‌ష్టం అ యినా ఒక్క మాట‌తో అదంతా నెగ్గుకువ‌చ్చేలా చేయాలి..ఇవ‌న్నీ మంచి నాయ ‌క‌త్వానికి ల‌క్ష‌ణాలు..నాన్న ఎర్ర‌న్న ‌ఇచ్చిన ల‌క్ష‌ణాలు/వీటితో ముందడుగు వే య‌డం త‌న ధ‌ర్మం అని చెబుతూ మ‌ళ్లీ శ్రీ‌కాకుళం వాసుల్లో ధైర్యం నింపారు యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ఆ వివ‌రాలివి

 

శ్రీ‌కాకుళం న‌గ‌రి : చెన్న‌య్ లో వ‌ల‌స కార్మికులు చిక్కుకుపోయారు మీరు స్పందించాలి.. హైద్రాబాద్ కార్మిక న‌గ‌ర్ లో అన్నం లేదు కొంద‌రు వ‌ల‌స జీ వుల‌కు..మీరే అందించాలి..మీరే వారికి ఆదుకోవాలి.. రిమ్స్ రోగుల‌కు తిండి లేదు.. ఇలా ప్ర‌తిచోటా ఇవాళ ఎన్నో విజ్ఞాప‌న‌లు వ‌స్తున్నాయి..విన్న‌పాలు వ‌స్తున్నాయి..వీట‌న్నింటినీ యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ప‌రిష్క ‌రించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు..త‌మ సంస్థ భ‌వానీ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా గ‌డిచిన నెల రోజులుగా అన్నం పెడుతున్నారు రోజుకు 1500 మం దికి పైగా అన్నం పెడుతున్నారు. ఇక్క‌డ బాబాయి అచ్చెన్న‌, అక్క‌డ తూర్పు గోదావ‌రి జిల్లాలో అక్క భ‌వానీ వీ రంతా ఇవాళ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉన్నారు. మ‌ రోవైపు ఇదే సంద‌ర్భంలో జిల్లాలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అవు తున్న నేప‌థ్యంలో కింజ రాపు రామ్మోహ‌న్ నాయుడు ఎఫ్బీ లైవ్ కు వ‌చ్చి ప్ర‌జల‌కు ధైర్యం చెప్పా రు..భ‌రోసా ఇచ్చారు..బాధ్య‌త ను విస్మ‌రించ‌డం త‌గద ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు హి త‌వు ప‌లికారు. ఎన్న‌డూ తాను ప్ర‌జ‌ల వెంటే ఉంటాన‌ని, ప్ర‌జ‌లు త‌మ బాధ్య‌త విస్మ‌రించి, నిబంధ‌న‌లకు నీ ళ్లొదిలి ప్ర‌వ‌ర్తించడం త‌గ‌ద‌ని ప‌దే ప‌దే చెప్పారు. త‌ న‌వంతుగా ఏ సాయం కావాల‌న్నా చేసేందుకు సిద్ధం అన్న‌ది ఆయ‌న మాట.. ఇంకా ఆయ‌నేమ‌న్నారంటే..

 

అదేం మాట : అస‌మ‌ర్థ‌త‌త‌కు నిద‌ర్శ‌నంగా ఉంటారా??

సీఎం జ‌గ‌న్ ఇవాళ అత్యంత బాధ్య‌తారాహిత్యంగా తీసిపోయే విధంగా మాట్లాడ‌ డం త‌గ‌దు. స్థానిక ఎన్నిక‌లు వాయిదాతో త‌న మాట నెగ్గ‌లేద‌న్న కోపంతో ము ఖ్యమంత్రి మాట్లాడిన ప్ర‌తిసారీ ఉదాసీన వైఖ‌రే అవ‌లంబించారు. ఒక్క‌సారి కూ డా ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వ‌లేక‌పోయారు.ఆ రోజు సుప్రీం కోర్టు వ‌ర‌కూ వెళ్లారు.. పోనీ అప్ప‌టి ప‌రిస్థితుల దృష్ట్యా వెళ్లార‌నుకుంటే ఇప్ప‌టికీ కేసుల పెరుగుతు న్నా ఆయ‌న స్ప‌ష్టంగా ఏమీ చెప్ప‌లేక‌పోతున్నారు.. ఎందుకని అంత మూర్ఖం గా ప్ర‌వర్తిస్తున్నారో అర్థం కావ‌డం లేదు..క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ఏం చ‌ర్య‌లు తీ సుకుంటున్నారో చెప్ప లేక‌పోతున్నారు. సీఎం జ‌గ‌న్ ఇది సాధార‌ణ‌ జ్వ‌రం తే లిక‌గా తీసుకోమంటున్నారు ఇలా చెప్ప‌డం త‌గ‌దు. అభివృద్ధి చెందిన దేశం ఇ ట‌లీ కూడా ఇలాంటివి ఎదుర్కో లేక పోయింది..అన్న‌ది వాస్త‌వం. అలాంటిది ప‌ రిమిత వ‌న‌రులున్న త‌క్కువ సాంకేతిక‌త అందుబాటులో ఉన్న మ‌న రాష్ట్రం ఎ దుర్కోగలదా అన్న సంశ‌యం వ‌స్తుంది. ప‌క్క రాష్ట్ర ముఖ్య మంత్రులు మాట్లా డుతున్న మాట‌లు విని భ‌రోసా తెచ్చుకుంటున్నారు. కానీ సీఎం జ‌గ‌న్ మాట‌ లు అలాలేవు. ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వాలి. రాజ‌కీయాలు కాదు ప్ర ‌తిప‌క్ష నేత హోదా లో చంద్ర‌బాబు చెబుతున్న మాట‌లు వినండి..మీ మంత్రు లు మీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కు గ్రీన్ జోన్ నుంచి రెడ్ జోన్ కు వెళ్తు న్నారు ఎలా వెళ్తున్నారు.క‌రోనాతో కొంత కాలం జీవించాల్సి రావొ చ్చు అని చెప్ప‌డం ఎంత మాత్రం త‌గ‌దు.. ప్ర‌జ‌ల కు ఇలాంటి మాట‌లు ఎలా చెబు తారు..భ‌యాందోళ‌న‌ల‌ను ఎలా రెట్టింపు చేస్తారు. భ‌రోసా ఇవ్వ‌లేని నాయ‌క‌ త్వం ఇవాళ ఉండ‌డం బాధాకరం..తిత్లీ స‌మ‌యంలో చంద్ర‌బాబు భ‌రోసా ఇ చ్చారు..అన్నీ తానై అండ‌గా నిలిచారు.. అదేవిధంగా ఇవాళ నైతిక మ‌ద్ద‌తు ఇవ్వడం అత్యావ‌శ్య‌‌కం.

 

నియ‌మాలు పాటించండి నేనున్నాను

ఇక జిల్లా విష‌యానికి వ‌స్తే ..పాత‌ప‌ట్నం ఘ‌ట‌నను క్లాసిక్ ఎగ్జాంపుల్ గా తీ సుకుని తీరాలి.. ఆవేళ ఆ యువకుడు నాలుగు ది క్కుల తిర‌గ‌డం వ‌ల్ల‌నే ఈ స‌మ ‌స్య త‌లెత్తింది. క‌రోనా ఇవాళ మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురించి చేస్తుంది. చిన్నా పెద్దా అంద‌రినీ క‌కావిక‌లం చేస్తుంది. క‌ర్నూలు జిల్లాలో 11 నెల‌ల ప‌సి కందుకు క‌రోనా వ‌చ్చింది. ఇదెంతో బాధాక‌రం. ఇటువంటి త‌రుణాన దీనికి ఒకే ఒక్క ప‌రిష్కారం స్వీయ ని ర్బంధం పాటించ‌డం..నిర్దేశిత దూరం పాటించడం.అ త్యవ‌సరం అయితే బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాస్క్ , గ్లౌజ్ త‌ప్ప‌ని స‌రి అని గు ర్తించండి. పాటించండి. స్వీయ శుభ్ర‌త‌కు ప‌రిస‌రాల శుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వం డి. 20 సెక‌న్ల పా టు స‌బ్బుతో చేతులు క‌డుక్కోండి..మ‌రువద్దు. అదేవిధంగా పౌరులంతా లాక్డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినం అయినా పాటించాలి..దీని వ ల్ల వ్యాధి వ్యాప్తిని నియంత్రించ‌వ‌చ్చు. నేను కూడా ఢిల్లీ నుంచి తిరిగి వ‌చ్చాక సెల్ఫ్ క్వా రంటైన్ లో ఉన్నాను.

 

వ‌ల‌స కార్మికుల‌కు ఆర్థిక భ‌రోసా ఇవ్వండి

జిల్లాకు చెందిన వ‌ల‌స కార్మికుల స‌మ‌స్య ఉంది. చెన్న‌య్, ఛ‌త్తీస్ ఘ‌డ్‌, గు జ‌రాత్ ముంబ‌యిలో చిక్కుకున్న వారికి ఆదుకు నేం దుకు నా వంతుగా కృషి చేశా.. అన్నార్తుల‌ను ఆదుకునేందుకు భ‌వానీ చారిట‌బుల్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున సా యం అందిస్తున్నాం. నేనూ, బాబాయి అచ్చెన్న‌, అదేవిధంగా రాజ‌మండ్రిలో భ‌ వానీ అక్క కృషి చేస్తున్నాం. వ‌ల‌స కార్మికుల‌ను ఇక్క‌డికి తీసుకువ‌చ్చేందు కు ప్ర‌భుత్వం కృషి చేయాలి. గుజ‌రాత్ రాష్ట్రం, విరావ‌ల్ జిల్లా నుంచి వ‌చ్చిన వా రికి స‌రైన ప‌రీక్ష‌లు చేసి క్వారంటైన్ కు పంపాలి. ఒక మంత్రి ని నియ మించి ఏ యే రాష్ట్రాల‌లో కార్మికులు చిక్కుకున్నారో వారిని ఇక్క‌డికి తీసుకురావాలి. ర‌ వాణా కానీ కార్మిక శాఖ మంత్రిని కానీ నియ‌మించి వారిని ఇక్క‌డికి తీసుకు ని రావాలి.

 

విద్యార్థులను కానీ కార్మికుల‌ను కానీ ఇక్క‌డికి తీసుకువ‌చ్చేందుకు స‌రైన కృషి చేయాలి.క్వారంటైన్ ఫెసిలిటీస్ ఇప్ప‌టి నుంచే మొద‌ల‌వ్వాలి. వ‌ల‌స కార్మికుల‌కు ఆర్థిక భ‌రోసా ఇవ్వాలి స్పెష‌ల్ ప్యాకేజీని నిర్ణయించాలి. ఈ విప‌ త్తు స‌మయాన రైతులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, డాక్ట‌ర్లు వీరి వ‌ల్లే మ‌నం అంతా క్షే మంగా ఉ న్నాం. ప్ర‌త్యేకంగా వారికి ధ‌న్య‌వాదాలు చెప్పాలి. వా రి కృషి ఫ‌లించాలంటే మ‌నం అంతా లాక్డౌన్ నిబంధ‌న‌లు స‌క్ర‌మంగా పాటించ‌గ ‌లిగి తీరాఆలి. అప్పుడే ఈ మ‌హ‌మ్మారిని నియంత్రించ‌ వచ్చు...అని చెప్పారా య‌న‌.

మరింత సమాచారం తెలుసుకోండి: