ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన‌ట్లుగానే తెలంగాణ వ‌రి సిరులు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కం ప్రాజెక్టు నిర్మాణాల‌కు పూనుకోవ‌డం, చిన్న‌, మ‌ధ్య‌, భారీ త‌ర‌హా ప్రాజెక్టుల‌కు సంక‌ల్పించిన విష‌యం తెలిసిందే. ఇక మానేరులు పారుతున్న ప్రాంతాల్లో ఇప్ప‌టికే వంద‌లాది చెక్ డ్యాంలు నిర్మించి జ‌ల‌సిరుల‌ను బీడు భూములకు మ‌ళ్లించి మ‌గాణిగా మార్చిన ఘ‌న‌త కేసీఆర్ ప్ర‌భుత్వానికి ద‌క్కుతోంది. కాళేశ్వ‌రం లాంటి అతిపెద్ద ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మించిన ఫ‌లితం ఇప్పుడు తెలంగాణ నేల‌పై స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది. ఈ సీజ‌న్‌లో వ‌రి పంట దిగుబ‌డులే ఇందుకు సాక్ష్యం.


సాగునీటి వసతులు విస్తరించటంతో యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో సాగుతో కోటి రతనాల వీణ.. కోటి టన్నుల ధాన్యరాశిగా మా రింది. యాసంగిలో రైతులు పోటీపడి మరీ వరి ని సాగుచేసి వ్యవసాయాన్ని పండుగ చేశారు. తెలంగాణ దేశానికి ధాన్యపు భాండాగారాన్ని అందిస్తోంది.  తెలంగాణ‌లోని పాత తొమ్మిది గ్రామీణ జిల్లాలు లక్షల టన్నుల వడ్లను ఉత్ప‌త్తి చేస్తున్నాయి. కాళేశ్వరంతో పునర్జీవం పొందిన శ్రీరాంసాగర్‌ ఆయకట్టుతో పాత నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వరిసాగు పెద్ద ఎత్తున పెర‌గ‌డం విశేషం. నాగార్జునసాగర్‌ ఆయకట్టుకూ కొద‌వ లేదు. మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో  ఆదిలాబాద్‌లో సైతం గణనీయంగా వరిసాగు పెరిగింది.

 

తొమ్మిది జిల్లాల పరిధిలో గత యాసంగితో పోలిస్తే సరాసరి 136 శాతం విస్తీర్ణంలో వరి అధికంగా సాగ‌వ‌డం గ‌మ‌నార్హం.
ఎవ‌రూ అవున‌న్న కాద‌న్న..ఒప్పుకున్నా..ఒప్పుకోక‌పోయినా  ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పాల‌కుల నిర్ల‌క్ష్యానికి గురికాబ‌డింది నిజం. స్వ‌రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ నాయ‌క‌త్వంలో ఒక్కో ఇటుక పేర్చుతూ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుంటున్న‌ట్లు ఉంది తాజా ప‌రిస్థితి. వ‌న‌రులున్నా..వినియోగం లేకే తెలంగాణ వ‌ట్టిపోయిన మాట వాస్త‌వం. ఆ వాస్త‌వం గ్ర‌హించే కేసీఆర్ ప్ర‌భుత్వం.. వ‌న‌రుల‌న్నింటిని స‌ద్వినియోగం చేసుకుంటూ నేడు బంగారు తెలంగాణ వైపు సాగుతోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: