ప్ర‌తినాయ‌క పాత్ర‌లు బాగుంటాయి
ఉన్న ఘ‌ట‌న‌ల‌ను వివాదాస్ప‌దంగా మార్చిపోతాయి
కానీ కాలం క‌థానాయ‌కుల సృష్టికి విలువ ఇస్తుంద‌ని అనుకోలేం
క‌నుక వీడిపోయిన వారంతా స్మ‌ర‌ణ‌లో తూగుతూ
కొత్త దుఃఖాల‌కు ఆన‌వాళ్లుగా నిలిచి అయిన వారికి ఓ వివ‌రం అందించిపోతారు ఆస్తులు జ్ఞాప‌కాలు అని విడివిడిగా ఖ‌రీద‌యిన జీవితాల్లో ఉంటాయి
ఇప్పుడు జ్ఞాప‌కాలు బాగుంటే ఆస్తుల వివ‌రంపై ఎటువంటి వివాదాలే ఉండ‌వు క‌నుక జీవితం ఖ‌రీద‌యిన వాటిని కోరుకోకుంటే జ్ఞాప‌కా‌లే ఆస్తులు అలాంటి ఆస్తిని ఆ ఇద్ద‌రు పిల్ల‌లూ పొందే ఉంటార‌ని అనుకోవ‌డం ఒక విషాదం అని గుర్తించాను రిషీ!.. అను జీవితం నుంచి..

 

విషాదాల‌ను విరివిగా పొందిన ముంబ‌యి దారుల‌కూ
కొత్త విన్న‌పాల‌ను ఏవో చేయాలి..కాస్త దుఃఖం ఏద‌యినా ఉంటే దానికో విరుగుడు ఎక్క‌డ ఉంద‌న్న‌ది క‌నుగొని తీరాలి మ‌నం వ‌చ్చేం వెళ్లాం అన్నది ఈ రంగుల నాట‌కంలో ఉన్న రెండు చివ‌ర‌లు /మొద‌టి చివ‌ర ఎప్పుడో మొద‌ల‌యింది రెండో చివ‌ర ఇప్పుడే అంతు తేల్చిపోయింది రెండింటలోనూ ఈ ప్రాణాలూ ప్ర‌ళ‌య కాలాల‌నూ వాటి విలాసాలను చూసి ఉంటాయి
సినిమా కాసుల‌ను రాల్చే క్ర‌మాన మ‌నుషులు ఎలా ఉంటారు
కొంద‌రికి ప్రాయాలు వ‌చ్చేక స్పృహ లేకుండా ఎలా ఉంటారో అలానే ఉంటారు క‌నుక ప్రేమలూ ముదిరి శృంగారాంతాల‌ను ప‌రిచయం చేసిన‌ట్లే కొన్ని త‌ప్పిదాలు ముదిరి జీవిత కాల ప‌శ్చాత్తాపాల‌ను పెనుశాపంగా ఇవ్వ‌వొచ్చు
ఒక చోట చ‌దివిన క‌థాసారం అనుసారం

 

మా నాన్న అంద‌రిలాంటి నాన్నే.. అన్న‌ది ఎక్క‌డ‌యినా చెప్పారా.. మీరు అప్పుడు మాత్ర‌మే త‌ల్లీ తండ్రీ తాము కోల్పోయింది నేర్చుకుంటారు ర‌ణ‌బీర్ ఇలాంటి భావ‌న‌ల్లో ఉండి ఉంటాడు ఉండిపోతాడు పేరూ డ‌బ్బూ ఈ రెండూ కొద్ది కాలం మైకంలో ముంచిపోయాక వేరు,వేరు దేహాల‌కు ద‌గ్గర అయ్యేలా చేయ‌డం కాలం చేయించే త‌ప్పు అని విన్నాను..ఇలాంటి త‌ప్పులు తెర వెనుక జ‌రిగి, తెర ముంద‌రి జీవితాల‌నూ ఛిద్రం చేసిపోతాయి..క‌నుక వ‌ల‌పు వీరుడు అన్న మాట ఒక విధం అయిన శాపంలానే తోచింది.

 

క‌ల‌త‌కు నెల‌వుగా ఉన్న కాలంలో మ‌నమంతా ఉంటూ ఎవ‌రో ఒక‌రి ఆస‌రాతో గ‌ట్టెక్కుతున్నాం అనుకుంటున్నామా..క‌ల‌త‌కు నె ల‌వు లేని చోట ఇక్క‌డున్నంత హాయి లేదా ఇప్పుడున్నంత హాయి ఉంద‌ని భ్ర‌మ‌సిపోతున్నామా..కాలం వాన పాట‌ల‌ను త‌న వెంట తీసుకునివెళ్లి గుప్పెడంత గుండెకు దుఃఖాల‌ను మిగిల్చిపోతోంది..పాట‌లో ఉన్న రొమాన్స్ పాట‌ల వెనుక ఉన్న విషాదాన్ని క‌ప్పి పెట్టి ఉంచుతుందా.. వ‌ల‌పు వీరుడు అని రాశారు ఓ చోట రిషీ నీ గురించి.. వాన ఎండ మ‌ధ్య కూడా మ‌రో వ‌ల‌పు ఉంటుంద ‌ని వారికి తెలిసేలా రాయాల‌ని ఉంది.. పూర్ ఫెలోస్ ఏవేవో రాస్తారు నేను న‌వ్వుతాను అంతే!

 

చివ‌ర్లో మ‌నుషులు
చివరి‌కి మిగిలే మ‌నుషులు
దేహాల‌ను పంచుకునే మ‌నుషులు
ఆత్మ‌ల‌కు అందివ‌చ్చే మ‌నుషులు
ప్ర‌తినిధులు మారే కొద్దీ కొత్త కాలాన కొత్త మ‌నుషులు వ‌స్తారా
లేదా ఈ సినిమా కొత్త ప్ర‌తినిధుల‌ను త‌న‌కు తానుగా త‌యారు చేసుకుంటుందా/ఇప్పుడంతా కాలం 90 ల ద‌గ్గ‌ర ఆగితే బాగుంటుంది అంటున్నారు..లేదా వెన‌క్కి జ‌రిగితే మేలు అంటున్నారు..మ‌ర‌ణశ‌య్య ద‌గ్గ‌ర ఉంటూ నిందితులుగా మ‌నం ఉండ‌డం కాలాన్ని మార్చ‌డం రెండూ త‌ప్పే క‌దూ! రంగులు మార్చినంత సులువుగా ఈ రుతువులు మారిపోవు.. రుతు అనుస‌ర‌ణ‌లూ మారిపోవు..నీవు వెళ్లిపోయాక నీ బిడ్డ‌ల‌కు నీ ప్ర‌పంచానికీ మ‌ధ్య ఎంతో కొంత దూరం ఉండనే ఉంటుంది.. ఉంచ‌నీ అలా..!

 

కాలం దూరం
అన్న‌వి సృష్టి కార్యాల‌కు ర‌హ‌స్యాలా
లేదా ర‌హ‌స్య స్థావ‌రాల చెంత దాచుకున్న ప్రేమ క‌బుర్లా
ప్రేమ అంటే వాన‌లో త‌డిచిన విధంగా ఉంటుందా లేదా లేదా
ఆడిపాడిన పాట‌ల్లో వెల‌సిన రంగుల్లో ఏదో ఒక భావ వ్య‌క్తీక‌ర‌ణ చేసిపోతుందా జీవితాల‌ను మ‌హ‌మ్మారులు క‌బ‌ళించిన ప్ర‌తిసారీ ఇలాంటి రోజు రాకుండా ఉంటే బాగుండు అని అనుకుంటాము.. అస‌లు జీవితా న్నీ ఎలా కొల‌వాలో తెల్సుకోక ముందే మ‌నం ముగిసిపోతామా..క్యాన్స‌ర్లు మ‌నుషులకు మ‌ర‌ణ శాస‌నాలు రాస్తుంటాయి ధైర్యంగా పోరాడ‌డం అన్న‌ది కొద్దిమందికి అల‌వాటుగా మారుస్తాయి..మీ జీవితాన ఇంతకుమించిన నాశ‌కాలు వినాశకాలు చూసే ఉంటారు క‌దా! క‌నుక మీ బిడ్డ‌ల‌కు మీరు ఏమ‌యినా అందిస్తే మీరు అందించని ద‌య మీరు అందించ‌ని ప్రేమ ఈ కాలం ముందున్న స‌మ యం అందిస్తే మేలు.. క‌నుక చావును అంగీకారంగా తీసుకుంటే ఒక క‌థ ముగిసిపోయింద‌న్న భావ‌న..లేదా అంగీకారంలో కుద‌ర కుంటే ఒక జీవితం కొన‌సాగిపోతుంద‌న్న ఆలోచ‌న మ‌న‌లోనే మ‌న‌తోనే ఉంటుంది.

 

బాలీవుడ్ విషాదాల‌ను మోస్తోంది
లేదా విషాదాంతాల‌ను మోస్తోంది
చివ‌ర‌ల‌ను మోయ‌డం క‌డు ర‌మ్యం
అవును క‌న్నీళ్ల‌ను ఒక చితి చెంత త‌ర్ప‌ణంగా ఇవ్వ‌డం
ఈ రంగుల లోకంలో బాధ్య‌త‌గా చేసే ప‌ని
క‌నుక చితి వెలుగు చెంత రాలే ఇలాంటి త‌ర్ప‌ణాలు
నిజ‌మ‌యిన నివాళులు అని అనుకోలేం కానీ
ఉన్న కొద్ది పాటి స‌మ‌యాలూ కొద్ది ఉద్విగ్న క్ష‌ణాలూ
దుఃఖాన్ని జ‌యించేందుకు చూపే త‌క్ష‌ణ మార్గం అని మాత్రం నిర్థారించ‌గ‌ల‌ను క‌నుక కాలం 90ల కాలం ద‌గ్గ‌ర ఆగిపోతే మేలు అని ఎవ్వ‌రు చెప్పినా సంతోషించ‌డం బాధ్య‌త..వెనుక వ‌చ్చే నీడలు పంచుకున్న దేహాలు పంపే సందేశాలు మిగిలిన సందేహాలు అన్నీ అన్నీ ఈ బాధ్య‌త‌లోనే కట్ట క‌ట్టుకుని కొట్టు మిట్టాడుతాయి. బాలీవుడ్ హీరో రిషీ క‌పూర్ కు నివాళి.. ఇస్తూ..

 

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

ఆర్ట్ : బాబు దుండ్ర‌పెల్లి, స‌త్య‌నారాయ‌ణ మాకిరెడ్డి (ఎఫ్బీ వాల్ నుంచి)

మరింత సమాచారం తెలుసుకోండి: