అవును రాష్ట్రంలోని ప్రతిపక్షాల వైఖరి వల్లే జగన్మోహన్ రెడ్డి ఎంత బలవంతుడు అనే విషయం అందరికీ తెలుస్తోంది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతిపక్షాలు జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నాయి.  ప్రభుత్వానికి  వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలంతా ఏకమయ్యారంటేనే జగన్ బలమేంటో అర్ధమైపోతోంది. జగన్ ఎంత బలవంతుడు కాకపోతే ప్రతిపక్షాలన్నీ ఏకమైపోతాయి ? ఒకవైపు జగన్ బలమేంటో అందరికీ అర్ధమవుతున్న సమయంలోనే చంద్రబాబునాయుడు ఎంత బలహీనుడో కూడా అందరికీ తెలిసిపోతోంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశంపార్టీ, బిజెపి, జనసేన, సిపిఐల్లో  ఒక్కపార్టీకి జనబలం లేకపోవటం. ఉన్న పార్టీల్లో కొద్దోగొప్పో టిడిపికి మాత్రమే క్యాడర్ బలముంది. జనసేన, బిజెపి, సిపిఐ బలమెంతో మొన్నటి ఎన్నికల్లోనే అందరికీ అర్ధమైపోయింది. జనబలం లేని పార్టీలన్నీ కలిసి 151 సీట్ల అఖండ  మెజారిటితో అధికారంలోకి వచ్చిన జగన్ను టార్గెట్ చేయాలని అనుకుంటే సాధ్యమవుతుందా ?

 

ప్రతిపక్షాలన్నాక ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపాల్సిందే. మామూలుగా ఎక్కడైనా ప్రతిపక్షాలంటే జనాల గొంతుగా భావిస్తారు. కానీ ఏపిలో మాత్రం ప్రతిపక్షాలన్నీ చంద్రబాబు గొంతుగా ఉండటానికే పోటి పడుతున్నాయి. చంద్రబాబేమో అధికారం పోయిందనే బాధలోనే ఉన్నాడు. అందుకనే  ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను, విమర్శలను జనాలు కూడా చాలా లైటుగా తీసుకుంటున్నట్లే అనిపిస్తోంది.

 

24 గంటలూ తనను ఓడించి అధికారంలోకి వచ్చిన జగన్ పై తన అక్కసు తీర్చుకోవటమే సింగిల్ పాయింట్ ఎజెండాగా చంద్రబాబు రాజకీయం సాగుతోంది. చంద్రబాబును గుడ్డిగా అనుసరిస్తున్న కారణంగా హోలు మొత్తం మీద ప్రతిపక్షాలు జనాలకు దూరమైపైపోతున్నాయి. ఈ విషయం అర్ధాంతరంగా వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనే అర్ధమైపోయింది. పోటి లేకపోవటంతో ఎంపిటిసి, జడ్పిటిసిల్లో చాలా చోట్ల అధికార పార్టీ నేతలే  ఏకగ్రీవంగా గెలిచారు.

 

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అధికార వైసిపిని ఢీ కొనేందుకు టిడిపితో పాటు మరో పార్టీ కూడా పూర్తిస్ధాయిలో రంగంలోకి దిగలేకపోయాయి. చాలా చోట్ల టిడిపినే గట్టి అభ్యర్ధులను పోటిలోకి దింపలేకపోయిందంటే ఇక మిగిలిన పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ప్రతిరోజు ఇంతమంది కలిసి  యుద్ధం ప్రకటిస్తున్నా  వాళ్ళ గురించి ఆలోచన కూడా చేయటం లేదంటేనే జగన్ ఎంత బలవంతుడో అందరికీ అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: