ప్ర‌ధాన‌మంత్రి మోదీ వైపు అత్య‌ధిక దేశ ప్ర‌జ‌లు ఆక‌ర్షితుల‌వుతున్న‌ట్లు అమెరికాకు చెందిన ప‌లు అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల్లోతేలిందట‌. ఆ అభిమానం కోవిడ్‌-19 ప్ర‌భావంతో దేశం అత‌లాకుత‌లం అవుతున్న వేళ మోదీ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను దేశంలోని మెజార్టీ ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో ఆమోదిస్తుండ‌టాన్ని క‌థ‌నంలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.ఐఎన్ఎన్ సీ వోట‌ర్ లాంటి ఓట‌ర్ స‌ర్వే ..93.5శాతం మంది మోదీకి మ‌ద్ద‌తు ఇస్తూ త‌మ అభిమానాన్ని చాటుకుంటున్న‌ట్లు పేర్కొంది. క‌రోనాకు మందు క‌రోనా త‌ర్వాత మోదీకి ఆద‌ర‌ణ త్వ‌ర‌లోనే స్ప‌ష్టంగా తెలుస్తుంద‌ని పేర్కొంది. ఇక లాక్‌డౌన్ విష‌యంలో మోదీ వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌పంచ దేశాల్లో ఆయ‌న‌కు ఎంతో గుర్తింపు తీసుకువ‌చ్చింది.

 

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన రెండో దేశంగా ఉన్న భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తే ప‌రిస్థితులు ఎలా ఉండేవోన‌న్న ఊహే ఇప్పుడే అంద‌రిలోనూ వ‌ణుకుపుట్టిస్తోంది. మోదీ క‌ఠిన నిర్ణ‌యాలే దేశ ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడుతున్నాయ‌ని చాలామంది ప్ర‌జ‌లు న‌మ్ముతున్న‌ట్లు ఐఎన్ఎన్ సీ వోట‌ర్ త‌న స‌ర్వేలో పేర్కొంది. ఇదిలా ఉండ‌గా 2014 ఎన్నిక‌ల‌కు ముందు మోదీకి దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోంది. అది 2019 ఎన్నిక‌ల నాటికి ఓట్ల రూపంలో స్ప‌ష్టంగా తెలిసింది. ఇక ఇప్పుడు క‌రోనా గండాన్ని త‌ప్పించిన మోదీకి మ‌రింత మంది అభిమానుల‌య్యార‌నే చెప్పాలి. 

 

మోదీ విధానాల‌ను, నిర్ణ‌యాల‌ను దేశ ప్ర‌జ‌లంద‌రూ స్వ‌చ్ఛందంగా పాటిస్తుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. మోదీకి ఈ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి  7నాటికి దేశంలో 73శాతంగా ఉన్న అభిమానం. .ఏప్రిల్ 21నాటికి 83వ‌ర‌కు పెరిగిన‌ట్లు కొన్ని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. అయితే వాస్త‌వంలో అంత సీన్ లేద‌ని విప‌క్షాలు కొట్టిపారేస్తున్నాయి. వ‌ల‌స కార్మికులు, పేద‌లు లాక్‌డౌన్ అమ‌లుపై మండిప‌డుతున్నార‌ని చెబుతున్నాయి. దీర్ఘ‌కాలంగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తుండ‌టంతో త‌మ బ‌తుకు ఎట్లా అంటూ నిల‌దీస్తున్నార‌ని చెబుతున్నారు.  ఇక రాహుల్‌గాంధీ మోదీపై విమ‌ర్శ‌లు చేస్తున్నా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు ఎంత‌మాత్రం ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో మోదీపై దేశ ప్ర‌జ‌ల్లో మ‌రింత గౌర‌వం పెరిగింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: