చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ప్రభుత్వాలకు మామూలైపోయింది అనే విమర్శలు మరోసారి రుజువు అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. దేశానికి అకస్మాత్తుగా విపత్తు వచ్చి పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ నిబంధనలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఉద్దేశం మంచిదే అయినా ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన వలస జీవి బతుకులపై ఇది కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. తాము వెళ్లిన రాష్ట్రాల్లో ఉపాధి లేక, ఉండేందుకు నీడ లేక, తినేందుకు తిండి లేక, వలస కార్మికులు కుటుంబాలతో సహా ఆకలితో అలమటించి మరణించడం, మరి కొంతమంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు నడకబాట పట్టడం, అలా నడుస్తూ నడుస్తూనే మరణించడం ఇలా ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ కేంద్రం గాని, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వలస కార్మికుల విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి లేకపోయాయి. 

 

IHG


కేవలం స్వచ్ఛంద సంస్థల సహాయంతో, మానవతావాదుల సహకారంతో మరి కొంతమంది కడుపు నింపుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ విధించాలని కేంద్రానికి ముందుగానే ఆలోచన ఉన్నా, ఆ నిర్ణయాన్ని అకస్మాత్తుగా అమలు చేయడం, ఎవరికి వారు సొంత ఊళ్లకు వెళ్లేందుకు సమయం ఇవ్వకపోవడంతో  వ్యవహారం ఇంతవరకు వచ్చింది. ప్రభుత్వాలపై అపవాదు పడింది. చాలా ఆలస్యంగా అయినా లాక్ డౌన్ విధించినా, 5 వారాల తర్వాత కార్మికులను తమ గ్రామాలకు వెళ్లేందుకు కేంద్రం ఎట్టకేలకు అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకు రాష్ట్ర సరిహద్దుల్లో అన్నం కోసం గంటల కొద్ది క్యూలో నిలబడడం, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోన్న వలస జీవి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. 

 

IHG's migrant worker exodus is more about their notions of 'home ...


వలస కార్మికులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా, ఐదు వారాల తర్వాత కేంద్రం మేల్కొంది. దేశంలో కరోనా కేసులు వందల సంఖ్యలో ఉన్నప్పుడు పట్టించుకోని కేంద్రం, కేసుల సంఖ్య 30 వేలు దాటిన తర్వాత మేల్కొంది. అయితే వలస కార్మికుల విషయాన్ని కేంద్రం ముందుగా గుర్తించలేక పోవడమే ఇక్కడ వారి బతుకులు పాలిట శాపంగా మారింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో సామాజిక దూరం ఏ మాత్రం పట్టించుకోకుండా వేలాది మంది కార్మికులు ముంబై నగరంలోని బాంద్రా రైల్వే స్టేషన్ ముట్టడించిన సమయంలో కేంద్రం వేగంగా స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అప్పుడే వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి తర్వాత వారిని క్వారంటైన్ సెంటర్ కు తరలించడం, పరీక్షలు నిర్వహించడం వంటివి చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు .

 

 అసలు లాక్ డౌన్ విదించాక ముందే వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు పంపించి ఉంటే ఇన్ని బాధలు, ఇన్ని ఆకలిచావులు ఉండేవి కాదు. కాస్త ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పరిస్థితి తీవ్రతరం అయిన తర్వాత వలస కార్మికులను ఆదుకోవాలంటూ కేంద్రం రాష్ట్రాలకు సలహాలు ఇచ్చింది. సొంత రాష్ట్ర కార్మికులకు 1500 ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల విషయానికి వచ్చేసరికి వారి కుటుంబాలకు కేవలం 500 రూపాయలు మాత్రమే ప్రకటించాయి. అవి కూడా అందరికీ సక్రమంగా అందనే లేదు.


 దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల వ్యవహారంపై " స్టాండేడ్ వర్కర్స్ నెట్వర్క్ " సర్వే చేయగా కేవలం ఆరు శాతం మందికి మాత్రమే ఆహారం దొరుకుతుందని తేల్చింది. వలస కార్మికుల విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్ర తరం అవ్వడం, మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున దుమారం లేవడం, అంతర్జాతీయ మీడియా కూడా దీనిపై ప్రత్యేక కథనాలను ప్రచారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువు పోతుందనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యంగానైనా, కేంద్రం వలస కార్మికులను తమ సొంత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 


ఇదే పని గతంలో చేసి ఉంటే కేంద్రంపై ఇన్ని నిందలు వచ్చి ఉండేవి కాదు. వలస కార్మికుల బాధలు, ఆకలి చావులు తప్పి ఉండేవి కాదు. అసలు ఈ వ్యవహారంలో తప్పు ఎవరిదీ అని ఇప్పుడు నిందలు వేసుకునే కంటే ముందు ముందు ఇటువంటి తరహా సంఘటనలు జరగకుండా కాస్త ముందుగా మేల్కొంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: