ఇన్ పుట్స్ : మాధవ్ శింగ‌రాజు

విశ్లేష‌కాల‌ను ధార‌బోయ‌డం వాస్త‌వికం
విధేయ‌త‌ల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం ఆట‌వికం
అవును! కొన్నింట ఆటవికం ఆనందం అని తేలొచ్చు
కానీ క‌రువు తీసుకువ‌చ్చిన‌వి
ప్ర‌కృతి వినాశ‌కాలుతీసుకుని వ‌చ్చిన‌వి
ఆనందాలు కాదు దీర్ఘ కాల దుఃఖాలే
అందుక‌నో/ ఎందుక‌నో దారిద్రాన్ని య‌థాత‌థంగా మ‌నం అంగీక‌రించ‌లేం అలానే ఈ ఆక‌లి ఆ క‌న్నీరు కూడా ఏదో ఒక రూపంలో విలీనం చెందితే మ‌నం అనుకున్న విలువ‌లు వినిమ‌యాల‌కు నోచుకుంటాయి


"క‌రువంటే చ‌నిపోవ‌డం కాదు బ‌తికించ‌డం"
ఈ మాట నుంచి మొదల‌‌యిందీ రాత
అస‌లు బ‌తికించ‌డం అన్న మాటకు
బ‌తుకును విస్తృతం చేయ‌డం అన్న మాట‌కు ఎంతో కొంత
భేదం ఉంది..ఊతం లేదు..కానీ ఎవ్వ‌రో ఒక‌రి ఊతం ఉంటేనే
జీవితాల‌కో విస్తృతి అయినా మ‌నం స్మ‌శానాల చెంత వివాద ర‌హిత వాద‌న‌ల‌ను విన‌డం కూడా ఓ భాగ్యంగా భావిస్తున్న‌ప్పుడు
మ‌న చావులూ మ‌న జ‌న్మ‌లూ అన్నీ అన్నీ పునీత మార్గం ఎప్పుడో పట్టాయి


క‌నుక ఆ పాటి అదృష్టం ఈ భార‌తీయుల‌కూ ఇంకా ఈ రెండు తెలుగు రాష్ట్రాల స‌జ్జ‌నుల‌కూ ఉంద‌నుకోవ‌డం ఓ మిధ్య..కెమెరా క‌న్ను కూడా మిథ్య‌నే న‌మ్ముతుంది అని విన్నాను ..స‌చ్ఛీల‌త‌ల‌ను స్వ‌ధ‌ర్మ సాధ‌న‌ను అది ఒప్పుకోదు అని కూడా విన్నాను..క‌నుక ఉన్న‌ది ఉన్న‌ట్టు అంటే ఒప్పుకోదు.. కొన్ని ర‌హస్య స్థావ‌రాల‌ను వెలుగులో తెచ్చిన ఆ కాంతుల జ‌త‌కు జ‌న్మ‌ను ఇవ్వ‌డాన్ని కూడా ఇష్ట‌పెట్టుకోదు.. మాధ‌వ్ అంటున్నారు లేక‌పోవ‌డంలో ఉనికి లేదు అని క‌రువు గురించి చెబుతున్నారు త‌న అనువాద రూపాల్లో..అను సృజ‌న చిత్తాల్లో..కానీ ఈ లేక‌పోవ‌డం అన్న‌ది భార‌తీయుల్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది..కానీ మ‌నం దాపెట్టి కాలాల‌ను నిందిస్తాం..లేదా లేక‌పోవ‌డం అన్న‌ది అబ‌ద్ధంగా మారితే నిజం ఏమ‌న్న‌ది మ ‌నం తెల్సుకోలేం.. క‌నుక మ‌న ద‌గ్గ‌ర లేక‌పోవ‌డం కాదు మృగ్య‌మ‌యిపోవ‌డం అన్న‌ది స‌బ‌బుగా స్వీక‌రించ‌ద‌గ్గ మాట.. నేల‌కు ఇం త ఉనికిని ప్ర‌సాదించి చ‌విటి ప‌ర్ర‌ల‌కు కొత్త చైత‌న్యాల‌ను అందించ‌డం అన్న‌ది అస్స‌లు మ‌న‌కు తెలియ‌ని ప‌ని క‌నుక మ‌నం స్వీ య సృష్టి నిర్మాణాలను ప్రేమించ‌క ఏదో ఒక ఆధారిత వ్య‌వ‌స్థల్లో కాలం వెళ్ల‌దీసి నింద‌ను ప్రేమిస్తాం.. లేదా ఈ లేక‌పోవ‌డాన్నే ప్రేమి స్తాం.. క‌రువు కాలాలు లేక‌పోవడాన్ని దూరం చేస్తాయ‌ని అంటున్నారీ రే అన‌గా స‌త్య జిత్ రే.. అదే అయితే గుమ్మ ద‌గ్గ‌రి దుఃఖం గుండె దాకా రాకుంటే మేలు..


విశాల‌త్వం అయిన ఆలోచ‌న ఏద‌యినా నాకెందుకో ప‌ర‌మ ఇష్టంగా తోచిపోతోంది..ప‌రమ నిష్ట‌త‌తో కూడిన రాత‌లు ఏవీ ఇక్క‌డ లేవ‌ని నా నిర్థార‌ణ‌..పోనీ పర‌మ గ‌రిష్ట‌త అన్న‌ది ఒక‌టి ఉంది అనుకోవ‌డం ఎప్పుడో వ‌దిలేశాను...భ‌గవంతుడి స‌న్నిధాన నిర్మా ణాలకు ఆపాదించే వాస్తులూ కొల‌మానాలూ ఈ జీవితాన లేవు.. అందుకని లోప‌లి ఆల‌యాలు అన్నీ ఏ వాస్తు‌లనూ పాటించ‌క పోవ‌డం నేను మ‌రియు మాధ‌వ్ చేసుకున్న పుణ్యం.. చేసుకున్న పుణ్యంలో ఏదయినా వాటా ఇచ్చిపోవాలి అంటే ఆ త‌ల్లిదండ్రులే అందుకు అర్హులు..ఇవాళ విఖ్యాతి పొంద‌డం సులువుగా మార్చుకుంటున్నారు కొంద‌రు..ఇలాంటి విఖ్యాతి ఏ ఆక‌లి ఏ క‌న్నీరు మి గిల్చిపోతే అది ఆనందం.. ఆక‌లికి స్వీక‌ర్త‌లుగా ఉండ‌డం ఆనందం.. కానీ మ‌నం మ‌హ‌దానందాల‌ను తృణీకారంగా చూడ‌డం నే ర్చుకుని లేని రోజులను తిట్టుకుంటున్నాం.. ఓ ఇంట‌ర్ పోయిన విద్యార్థిని నేను.. అవి ఎలా ఉంటాయి ఏ రే తో ఉంటాయి ఏ ఆప్టి క్స్ తో వాటిని చూడాలి అర్థం చేసుకోవాలి..

 

అంటూ ముట్టూ అన్న‌వి ఆక‌లి క‌న్నీరు త‌మ‌తో పాటు తోడు తెచ్చుకుంటాయి కరువులో కొన్ని మ‌న‌కు మ‌లినంగా తోచిన‌వి ఉంటాయి మాలిన్య ర‌హితాలూ ఉంటాయి/అస‌లు జ‌న్మ రాహిత్యాన్ని మ‌నం ఆహ్వానించ‌క‌పోవ‌డ‌మే ఇవాళ్టి తప్పు కోల్ క‌తా అయినా ముంబ‌యి అయినా క‌రువును స్వీక‌రిస్తాయా లేదా సంబంధిత స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తాయా అన్న‌ది నా వ‌ర‌కో సం దేహం. మ‌ళ్లీ మెట్రో రైలులో పోతే కొన్ని అంద‌మ‌యిన దృశ్యాల‌కు ఆవ‌ల జీవితం ఒక‌టి క‌ళ్లింత‌లు చేసుకుని తీరుతుంది.. నా వ‌ర కూ మాధ‌వ్ ఒక మాట చెప్పారు రే అన‌గా స‌త్య జిత్ రే ఒక మాట చెప్పారు ..దేన్న‌యినా య‌థాత‌థంగా తీయడం య‌థాత‌థంగా ఉంచ‌డం కుద‌ర‌ని ప‌ని.. క‌నుక ఈ య‌థాత‌థ అనువాదాలు ప్ర‌ళ‌య కాల చిత్తాలు.. సృజ‌న సంబంధ షోష‌కాల‌ను /శోష‌ణాల‌ను ఆ హ్వానిస్తే హాయి.

 

ఉన్న‌ది దాచుకుని ఇవ్వ‌డం క‌రువు నేర్పిస్తుంద‌ని మాధ‌వ్ అంటున్నారుచేయి చాచి ఓ ఇంటి ద‌గ్గ‌ర ఉన్న కొన్ని జీవాల‌ను చూశాను హృద‌యాల‌కు ఏమీ ఇవ్వ‌డం నేర్ప‌ని వారికి ఏద‌యినా పాఠం చెప్పాల‌నుకుంటాను కానీ దేన్నీ య‌థాత‌థంగా తీసుకోవ‌డం అల‌వాటు కాని మ‌నుషులు ఈ క‌ష్టాన్నో ఆ దారిద్రాన్నో ఎలా అర్థం చేసుకుంటార‌ని అనుకోగ‌ల‌ను.. క‌నుక మ‌నుషులు య‌థాత‌థంగా ఉండడం కుద‌ర‌ని ప‌ని..ప్రేమ‌లోనో, శృంగారంలోనో ఆఖ‌రికి చావులోనో ఈ య‌థాత‌థంగా ఉండండి అని చెప్ప‌డం అస్స‌లు నా వ‌ర‌కూ కుద‌ర‌ని ప‌ని..క‌రువు కాలంలో ఇవ్వ‌డం అంటే దాచుకున్న‌ది ఇవ్వ‌డమా లేదా దాచి లేద‌ని చెప్ప‌కుండా ఇవ్వ‌డ‌మా అన్న‌ది తేలుస్తూ రాస్తున్నా‌డు మాధ‌వ్.. దేన్న‌యినా ఇవ్వ‌డం అంటే ఒక సృష్టి నుంచి పొంది మరో సృష్టికి అందించ‌డం లేదా మ‌రో సృష్టికి సాయం అందించ‌డం అని నే ర్చుకున్నాను..క‌నుక ఇవాళ మ‌నుషులు దానం ధ‌ర్మం దేహాల‌కు అల‌వాటు చేస్తుంటే ఇంత‌కాలం ఈ రెండు గుణాలూ ఏ గూటిలో దాగిపోయాయో అని న‌వ్వుకుంటాను. 

 

అయినా ఇవ్వ‌డం ఇష్ట‌పూర్వ‌కం అయితే ప్రేమ ప‌రివ్యాప్తితం కాకుండా ఉండ‌దు కానీ మ ‌న‌లో కొన్ని బాధ్య‌త‌లు పెరిగిపోయాక మ‌నం వాన‌నూ ఎండ‌నూ మ‌ధ్య కాల గంద‌రగోళాల‌నూ ఇష్టంగా చూడ‌క ఛీత్క‌రిస్తున్నాం.. అయినా కరువులో పోయిన ప్రాణాలు అరిగిన పాదాలు ఏమ‌యినా మిమ్మ‌ల్ని శాసిస్తున్నాయా.. కాలం చావును వ‌రంగా ఇస్తే అ ప్పుడు మాత్ర‌మే మ‌నం నిష్క‌ళంకంగా ఏడుస్తాం..లేదంటే అన్ని చావుల‌కూ మూకుమ్మ‌డి సానుభూతి ఒక‌టి ప్ర‌క‌టించి పోతు న్నాం..అదే సత్య జిత్ రే సినిమా..కావొచ్చు..లేదా మ‌న జీవిత‌మే కావొచ్చు..

 

పునరుత్థానం అన్న‌ది మ‌న‌కు చెంద‌ని ప‌దం
చావుల‌ను హాయిగా ఆహ్వానిద్దాం ఏం కాదు
మ‌ర‌ణ కాల చింత‌న‌ల చెంత శృంగారం ప్రేమ అన్న‌వి ఒక్క‌టే
గొడ‌వ ఉండదు చ‌చ్చేక మీతో ఈ లోకం ఏ పంచాయితీ పెట్టుకోదు ఏ తీర్పు ఇచ్చినా మీ గుండె గూటికి చేరుకోదు క‌నుక చావండి ఏం కాదు.. మీ మీ న‌మ్మ‌కాలు విశ్వాసాల ఆన‌వాళ్లు చ‌చ్చాక నాతో గొడ‌వ‌ప‌డండి క‌నుక క‌రువును మృత్యు హేల‌లను ఉన్న‌ది ఉన్న‌ట్లు చిత్రీక‌రించ‌డం ఆ గోడును వినిపించ‌డం ఈ భార‌తీయులు త‌ట్టుకోలేవు.. ఈ ఆత్మ‌లు ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రి తాక‌ట్టులో ఉంటాయి క‌నుక తాక‌ట్టులో ఉన్న ఆత్మ‌లు స్వ‌చ్ఛ‌త‌ను నిబ‌ద్ధ‌త‌ను కోరుకోవు..నేడు స‌త్య జిత్ రే జ‌యంతి ఆయ‌న‌కు నివాళులు


- ర‌త్న‌కిశోర్ శంభుమహంతి


ఆర్ట్ : దేవీ ప్ర‌సాద్, న‌టులు, ద‌ర్శ‌కులు

మరింత సమాచారం తెలుసుకోండి: