ప్రతి ఆదివారం వచ్చే కొ(చె)త్తపలుకును చూస్తే అందరిలో ఇదే అనుమానం పెరిగిపోతోంది. ప్రభుత్వం చేసే మంచి పనిని మొహమాటానికి కూడా ఎక్కడా ప్రస్తావించకూడదు, మాట్లాడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నట్లే ఉంది ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరా రాధాకృష్ణ. అందుకనే ప్రతిరోజు ప్రభుత్వంలో ఎక్కడ బొక్కలు కనబడతాయా అని వెతికి వెతికి మరీ బూతద్దంలో చూసి బుర్రకు తోచింది రాసేస్తున్నాడు. బుర్రనిండా నెగిటివ్ ఆలోచనలే ఉన్నాయి కాబట్టే వేమూరికి జగన్ పాలనలో మొత్తం తప్పులే కనబడుతున్నాయి.

 

నిజానికి మీడియా అంటే ప్రభుత్వంలో జరిగే మంచి, చెడు రెండిటిని జనం ముందుంచాల్సిందే.  కానీ ఎల్లోమీడియా మాత్రం మంచిని వదిలేసి ఎక్కడో జరుగుతున్న చిన్న తప్పులను పట్టుకుని పెద్దగా బ్యానర్ కథనాల్లో అచ్చేస్తోంది కాబట్టి జనాల విశ్వసనీయత కోల్పోయింది.  చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన ఇటువంటి తప్పులే అప్పట్లో వేమూరికి ఏమీ కనబడకపోవటమే విచిత్రం. అప్పట్లో తప్పులు జరిగితే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లుగా నటించిన ఇదే వేమూరి జగన్ విషయంలో మాత్రం రెచ్చిపోతున్నాడు.

 

పాదయాత్రలో అనర్గళంగా మాట్లాడిన జగన్ ఇపుడు మీడియా ముందుకు రావటానికే భయపడిపోతున్నడంటూ చెత్తరాతలు రాశాడు. అదే సమయంలో చంద్రబాబు కూడా మీడియా సమావేశాలు పెట్టకుండా సందేశాలు మాత్రం పంపుతున్న విషయాన్ని ప్రస్తావించడు. కరోనా తీవ్రతను జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నాడంటూ పదే పదే రాస్తున్న ఇదే ఎల్లోమీడియా దేశం మొత్తం మీద అత్యధికంగా టెస్టులు చేస్తోంది ఏపి మాత్రమే అని ఎందుకు రాయటం లేదు ? వైరస్ ను జగన్ తేలిగ్గా తీసుకున్నదే వాస్తవమైతే రోజుకు సగటున 7 వేల పరీక్షలు ఎందుకు చేయిస్తాడు ? వందలాది ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేస్తాడు ?

 

వైరస్ సమస్య ఏపిలో ఎక్కువైపోవటానికి జగన్ చేతకాని తనమే కారణమని చెబుతున్న ఎల్లోమీడియా మరి మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ గురించి ఎందుకు ప్రస్తావించటం లేదు ? కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయంటే అందుకు తబ్లిగీ మసీదులో ప్రార్ధనల తర్వాత పరిణామాలే  కారణమని ఎల్లోమీడియాకు తెలీదా ?  జగన్ పై బురద చల్లుతు చంద్రబాబునాయుడుకు మళ్ళీ మంచి ఇమేజి తేవటమే ఎల్లోమీడియా టార్గెట్ అన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. కాకపోతే వేమూరి మరచిపోయిన విషయం ఏమిటంటే అసలు చంద్రబాబు గబ్బుపట్టిందే ఎల్లోమీడియా వల్లేఅని.

 

చంద్రబాబు గురించి ప్రతిరోజు పేజీలకు పేజీలు రాయటం వల్ల జనాల్లో చంద్రబాబంటే జనాల్లో ఏహ్యత పెరిగిపోయింది. సంక్షేమపథకాలు అమలైపోయినట్లు రాశారు. అమరావతి నిర్మాణం జరిగిపోయినట్లు ఒకటే ఊదరగొట్టారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబుడులు వచ్చేసినట్లు పిచ్చిరాతలు రాశారు. చంద్రబాబు పాలనలో జనాలంతా బ్రహ్మాండంగా ఉన్నట్లు రాశారు. తీరా చూస్తే ఎన్నికల్లో జనాలు చంద్రబాబు మాడు పగలగొట్టారు. అప్పటి నుండి ఎల్లోమీడియా కూడా జనాలపై పగబట్టినట్లే ఉంది. చూద్దాం ఎల్లోమీడియాలో ఈ పిచ్చి రాతలు ఎప్పటి దాకా సాగుతాయో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: