చంద్రబాబునాయుడు మనస్తత్వమే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరిని ఎప్పుడు దగ్గరకు తీసినా,  దూరం పెట్టినా ప్రతిదీ లెక్క ప్రకారమే జరుగుతుంది. ఏది చేసినా అంతిమంగా తనకు లాభం ఏమిటనే చూస్తాడు కానీ ఎదుటి వ్యక్తి కూడా లాభపడాలని మాత్రం అనుకోడు. లాభపడితే తన ఘనతగాను నెగిటివ్ అయితే ఎదుటివాడి ఖాతాలో వేసేసే తత్వం చంద్రబాబుది. ఈ విషయం దివంగత నేత కోడెల శివప్రసాద్ విషయంలో కూడా రుజువైంది.

 

అధికారంలో ఉన్నపుడు కోడెల చేత అడ్డమైన పనులు చేయించింది చంద్రబాబే. వైసిపి ఎంఎల్ఏల ఫిరాయింపులు, నిబంధనలకు విరుద్ధంగా రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయటం లాంటి అన్నింటికీ చంద్రబాబే కారణమని అందరికీ తెలిసిందే.  కాని పనులన్నింటినీ చేయించి కోడెల గబ్బు పట్టటానికి ప్రధాన కారణమే చంద్రబాబు. ఎలాగూ చంద్రబాబు చెప్పిన  అడ్డమైన పనులు చేస్తున్న కారణంగా అదే ముసుగులో కోడెల కూడా చెలరేగిపోయాడు. కొడుకు, కూతురికి నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలను రాసిచ్చేశాడు. దాంతో వాళ్ళు చెలరేగిపోయి అడ్డమైన అరాచకాలకు తెరలేపారు. ఫలితంగా కోడెల రాజకీయ జీవితమే గబ్బుపట్టిపోయింది.

 

సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కోడెలను చంద్రబాబు దగ్గరకు రానీయలేదు.  కోడెల కుటుంబం అరాచకాల వల్ల పార్టీ నేతలతో పాటు  జనాలు కూడా కోడెల కుటుంబాన్ని దూరంగా ఉంచేశారు. అదే సమయంలో ’కమ్మవారి వైభవం’ అనే కులపత్రికలో కోడెల కుటుంబం అరాచకాల గురించి నెగిటివ్ గా పెద్ద కథనాలు వచ్చాయి. దాన్ని కూడా చంద్రబాబే రాయించాడనే ప్రచారం జరుగుతోంది లేండి. ఒకసారి చంద్రబాబును కలిసి తన వెర్షన్ చెప్పుకుందామని కోడెల ఎంత ప్రయత్నంచేసినా చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు.

 

కోడెలను మంగళగిరిలోని పార్టీ ఆఫీసు నుండి కూడా దాదాపు బహిష్కరించారు. ఎలాగంటే కోడెల ఆఫీసులోకి అడుగుపెడితే అప్పటికే ఆఫీసులో ఉన్న నేతలంతా బయటకు వెళ్ళిపోయేవారు. నేతలు, జనాలు కూడా కోడెలను కలవటం మానేశారు. ఎవరినైనా కలుద్దామని కబురు చేసినా రెస్పాండ్ అయ్యేవారు కాదు. దీనికంతా కారణం చంద్రబాబు ఆదేశాలే అని కోడెల అనుమానంగా పార్టీలో ప్రచారంలో ఉంది.  అంటే కులపరంగా, పార్టీ పరంగా కూడా కోడెల అందరికీ దూరమైపోయాడని అర్ధమవుతోంది.

 

చివరకు విసిగిపోయిన కోడెల ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణమనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దాంతో ఆరోపణలు, విమర్శలకు భయపడిన చంద్రబాబు కోడెల అంతిమయాత్రలో యాక్టివ్ గా పాల్గొన్నాడు. మొత్తం మీద కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్న విషయం జనాల్లో నాటుకుపోయింది. ఇటువంటి నేపధ్యంలో కోడెల జ్ఞాపకాలను స్మరించుకోవాలంటూ జయంతి సందర్భంగా పిలుపినివ్వటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: