ఈరోజు ఉదయం నుంచి టీవీ 9 ఛానల్ కు సోషల్ మీడియాలో ఒక్కటే శాపనార్థాలు.. తిట్లు తగులుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం నుంచి టీవీ 9 పై ఫైరింగులు న‌డుస్తున్నాయి. పలువురు మేధావులు, సాహితీవేత్తలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే తెలంగాణ పోరాటం జరుగుతున్న వేళ టీవీ 9పై తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. ఇందుకు కారణం అప్పట్లో టీవీ9 ఎక్కువగా ఆంధ్ర జర్నలిస్టులు.. ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో ఉండేది. 

 

కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలినాళ్ళలో తెలంగాణ వ్యతిరేక వార్తలకు ప్రాధాన్యత ఇచ్చిన టీవీ 9 కేసీఆర్ దీంతో తెలంగాణలో టీవీ9 ఛానల్ ప్రసారాలు ఆగిపోయాయి. ఆతర్వాత టీవీ 9 ఛానల్ కెసిఆర్ సన్నిహితుల ఖాతాలోకి వెళ్లిపోయింది. అదంతా గతం మరి ఇప్పుడు అకస్మాత్తుగా టీవీ9 ఛానెల్ పై తెలంగాణ ప్రజానీకం ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ కథేంటో తెలుసుకుందాం.

 

హైద‌రాబాద్‌, తెలంగాణ‌, ఏపీ అనేవి మూడూ వేర్వేరు.. అంటే రాష్ట్రాలో, ప్రాంతాల వారీగానో కాదు. బార్క్ రేటింగ్ లెక్క‌ల్లో. బార్క్ అనే రేటింగ్ ఇచ్చే సంస్థ ఈ మూడు ప్రాంతాల‌ను వేర్వేరుగా విభ‌జించి రేటింగ్ ఇస్తుంది. దీని శాస్త్రీయ‌త‌పై, మీట‌ర్ల ట్యాంప‌రింగ్‌పైనా అనేక విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ బార్క్ రేటింగ్ ఆథారంగానే ఛానెల్స్‌కు యాడ్స్ వ‌స్తుంటాయి. హైద‌రాబాద్ పొటెన్సీ చాలా ఎక్కువ‌. అందుకే దీనిని రేటింగు ల లెక్క‌ల్లో స‌ప‌రేట్‌గా చూస్తుంటారు. 

 

ఈ క్ర‌మంలోనే బార్క్ రేటింగ్ ఆధారంగా ప‌బ్లిసిటీ చేసుకునే ట‌ప్పుడు టీవీ 9 కూడా హైద‌రాబాద్‌, ఏపీ, తెలంగాణ అంటూ విడివిడిగా ప్ర‌చారం చేసుకుంది. అది అస‌లు క‌థ‌. అయితే దీనిని టీవీ 9 లో స్క్రోలింగ్ వేసుకున్న‌ప్పుడు కొంద‌రు దీనిని స్క్రీన్ షాట్లు కొట్టి టీవీ 9 హైద‌రాబాద్‌ను తెలంగాణ‌లో కాకుండా విడిగా చూపిస్తుందా ? అని ఫైర్ అయ్యారు. అది అస‌లు క‌థ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: