ఈ అనుకోని విపత్తులు ఏంటో తెలియదు కానీ ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ఏ క్షణాన ఏ విపత్తు జరుగుతుందో తెలియక సతమతం అయిపోతున్నారు. దాదాపు రెండు నెలలుగా కరోనా వైరస్ మహమ్మారితో మన దేశం యుద్ధం చేస్తోంది. మర్చి 25 వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించి కరోనాను కట్టింది చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఇక మరణాలు వందల్లో ఉన్నాయి. కరోనా భయంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇక ఏపీలో ఈ కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు భయాందోళనలు చెందుతూ భయం భయంగా జీవితం గడుపుతున్నారు. ఇది ఇలా ఉండగానే అనుకోని ఉత్పాతం లా విశాఖ ప్రజలకు ఓ అనుకోని ఆపద వచ్చి పడింది. ఒక వైపు కరోనాపై పోరాటం చేస్తుండగానే ఇప్పుడు ఎల్జీ పాలిమార్స్ అనే ఫ్యాక్టరీలో విష వాయువు లీక్ అయ్యింది. 

 

IHG

 

ఒకవైపు కరోనా భయంతో అల్లాడుతున్న విశాఖ జనాలకు ఈ విష వాయువు భయం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు తెల్లవారు జామున 3 గంటలకు లీకైన ఈ విష వాయువు కారణంగా సుమారు పది మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరెంతో మంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ దుర్ఘటనలో సుమారు వేలాది మూగజీవాలు మృతి చెందాయి. చాలామంది అసలు ఏమైందో తెలుసుకునే లోపు స్పృహ కోల్పోవడం, కొంతమంది ఇళ్లలోనే స్పృహ కోల్పోవడంతో వారందరిని పోలీసులు తలుపులు బద్దలుకొట్టి మరీ ఆసుపత్రికి తరలించారు.  ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణంలో ఉండే విశాఖలో ఈ అనుకోని సంఘటనతో ప్రతి ఒక్కరు ఉలిక్కిపడుతున్నారు. స్టెరిన్ అనే విషవాయువు ప్రజలను ఇప్పుడు భయకంపితులను చేస్తోంది. సుమారు 2000 మంది వరకు ఆసుపత్రి పాలయ్యారు. 

 

IHG

అసలు తమకు ఏమైందో తెలియకుండానే కొంత మంది మరణించగా, మరికొంతమంది ఉలిక్కిపడి లేచి పరిసరాలను గమనించే లోపే అస్వస్థతకు, అపస్మారక స్థితి చేరిపోయారు. ఇక ఈ విష ప్రభావం నుంచి బయటపడేందుకు రోడ్లపై పరుగులు తీసిన వారు చాలా ఉంది కుప్పకూలారు. భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాద సంఘటన కంటే విశాఖ ప్రమాదం ఇంకా భయంకరంగా అనిపించింది. సుమారు ఐదు కిలోమీటర్ల వరకు వ్యాపించిన విషవాయువు కారణంగా పచ్చని చెట్లు రంగుమారి  నిర్జీవంగా మారిపోయాయి. నోరులేని మూగజీవాలు నురగలు కక్కుతూ మరణించాయి. ప్రకృతి అందాలకు నెలవు గా ఉండే విశాఖలో ఎన్నో ఎంతో రమణీయంగా ఉంటుంది. ప్రశాంత జీవనానికి అనువైన ప్రాంతంగా విశాఖను చెప్పుకుంటారు. 

 

IHG


విశాఖలో జీవించడం అంటే అది ఒక గొప్ప వరంగా చాలామంది భావిస్తుంటారు. కానీ గత కొంతకాలంగా విశాఖ పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. అత్యంత ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలు విశాఖ చుట్టూ వెలిశాయి. విపరీతమైన కాలుష్యం వెదజల్లుతూ విశాఖ ప్రజలకు కాలుష్యం బహుమతి గా ఇస్తున్నాయి. అసలే చాలా రోజులుగా కరోనా భయంతో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడ  ఈ గ్యాస్ ప్రమాదం మరింత భయం కలిగిస్తోంది. విశాఖపట్నం లోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం లో ఉన్న ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో స్టేరీన్ వాయువు లీక్ అవ్వడం తోనే ఇదంతా జరిగింది. అయితే ఈ వాయువు పీల్చడం వల్ల దీర్ఘకాలం ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లుగా వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు .

 

IHG


ఈ గ్యాస్ పీల్చడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని, దీంతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు, తలనొప్పి, అలసట, నీరసం, వినికిడి లోపం, క్యాన్సర్ ఇలా ఎన్నో దుష్పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో విశాఖ వాసుల్లో మరింత ఆందోళన పెరిగిపోతోంది. మొన్నటి వరకు కరోనా భయంతో ప్రజలంతా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం నుంచి కాస్త తీరుకుంటున్నాం అనుకునేసరికి ఈ విష వాయువు లీక్ అవ్వడం  మరింత ఆందోళన కలిగిస్తోంది అని విశాఖ వాసులు తీవ్ర భయాందోళన లో కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: