దేశంలోనే అత్యంత సీనియర్ ను అని చెప్పుకునే ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశాధినేత చంద్రబాబు విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై చేసిన విమర్శలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే.. ఈయన ఏం రాజకీయ నాయకుడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘ఐఏఎస్‌లు ఏం చేస్తారు..? ఎందుకు ఆ కమిటీ..? ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న నాకే స్టైరీన్ అంటే తెలియదు, ఐఏఎస్‌లకు ఏం తెలుస్తుంది..? అసలు జగన్‌ ఏం చేస్తున్నాడో తనకే అర్థం కావడం లేదు, చెబితే వినడు .. సబ్జెక్టు కమిటీ కదా వేయాల్సింది అంటూ మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతున్నారు.

 

 

చివరకు గ్యాస్ ప్రమాద బాధితులకు ఇచ్చిన కోటి రూపాయల పరిహారంపైనా చంద్రబాబు చేసిన వ్యంగ్యం వ్యాఖ్యలు విమర్శలకు గురవుతున్నాయి. ‘‘కోటి రూపాయలతో మనిషి బతికొస్తాడా..? కోటి రూపాయలు వాళ్లు అడిగారా..? అవి సరిపోతాయా..?’’ అంటూ చంద్రబాబు మాట్లాడిన తీరు చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఏర్పేడు దుర్ఘటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన మాటలను కొందరు కోట్ చేశారు. ఆ పేపర్ క్లిప్పింగులను వైరల్ చేశారు.

 

 

అంతే కాదు. దేశంలోనే సీనియర్ నేతనని చెప్పుకునే చంద్రబాబు అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడిన విషయంపై జనం మండిపడుతున్నారు. ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు, ప్రభుత్వం హ్యాండిల్ చేసిన తీరు సరిగ్గా లేదు .. నేను ఉండి ఉంటే నేరుగా ఫ్యాక్టరీలోకి వెళ్లేవాడిని..? అంటూ చంద్రబాబు మాట్లాడిన తీరుపై విమర్శలు వస్తు్నాయి. ఒక వేళ చంద్రబాబే సీఎం అయితే.. తాను వెళ్లి ఏం చేసేవాడు..? స్టైరీన్ ట్యాంకుల సేఫ్టీ వాల్వ్స్ క్లోజ్ చేసేవాడా..? అని ప్రశ్నిస్తున్నారు.

 

 

రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు... ఎందుకు వెళ్లలేకపోయానా అని బాధపడ్డాను.. అన్న మాటలను కోట్ చేస్తూ.. రాజకీయం చేసే మంచి అవకాశాన్ని మిస్ అవుతున్నందుకు చంద్రబాబు బాధపడుతున్నట్టున్నారు అంటూ నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: