కొంత‌మంది నిర్ల‌క్ష్యం అంద‌రిని అపాయంలో ప‌డేస్తోంది. క‌రోనా క‌ట్టుబాట్ల‌కు నీళ్లోదులుతూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫ‌లితంగా వ్యాధి వ్యాప్తికి వాహ‌కాలుగా మారుతున్నారు. మొత్తం స‌మాజాన్ని క‌రోనా కోర‌ల్లోకి జారేలా చేస్తున్నారు. ఎంతో నిష్టగా నిబంధ‌న‌లు పాటిస్తే గాని క‌రోనాను నియంత్రించ‌డం సాధ్యం కాద‌ని చైనా నిరూపించింది. డ్రాగ‌న్ కంట్రీ స్ఫూర్తిని ప్ర‌పంచ దేశాల్లో ఎక్క‌డా అమ‌లు కాక‌పోవ‌డం నిజంగా ఆందోళ‌న‌క‌ర‌మే..ప్రాణాలు పోతాయ‌ని తెలిసి కూడా జ‌నం విచ్చ‌ల విడిగా వ్య‌వ‌హ‌రించ‌డం దేనికి సంకేతం. అమెరికా మొద‌లు...అమీర్‌పేట్ వ‌ర‌కు కూడా ఇదే నిర్ల‌క్ష్యం క‌నిపిస్తోంది.


 గ్రామీణ ప్రాంతాల్లో క‌రోనా బెడ‌ద చాలా వ‌ర‌కు త‌క్కువే.. అయితే జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది..జ‌న సాంద్ర‌త ఎక్కువ‌గా ఉన్న ప‌ట్ట‌ణాల్లోనే నిర్ల‌క్ష్యం తాండ‌వం చేస్తోంది. కొద్దిరోజుల క్రితం భార‌తదేశంలో చాలా రాష్ట్రాలు మ‌ద్యం అమ్మ‌కాలకు అనుమ‌తివ్వ‌డంతో మ‌ళ్లీ క‌రోనా పెరుగుతోంద‌న్న వాద‌న ఉంది. అయితే అమ్మాకాల‌కు అనుమ‌తించిన రాష్ట్రాల్లో  గ‌డిచిన ఐదు రోజుల్లో గ‌ణ‌నీయంగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పాలి. మ‌ద్యం విక్ర‌య‌కేంద్రాల వ‌ద్ద తండోప‌తండాలుగా జ‌నం గుమిగూడ‌టం విశేషం. కొన్ని కేంద్రాల్లో అయితే తోపులాట‌లు జ‌రుగుతుండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం. 


ఇక ఇక్క‌డ శానిటైజ‌ర్ల వాడ‌కం, మాస్కులు ధ‌రించ‌డం వంటి జ‌ర‌గ‌క‌పోవ‌డం గ‌మనార్హం. ఇక్క‌డో విష‌యం చెప్పాలి.మలక్‌పేట గంజ్‌కు చెందిన ఓ వ్యాపారి తన ఫ్రెండ్స్‌కి బర్త్ డే దావత్ ఇచ్చాడు. దాని కారణంగా సుమారు 45 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారుల నిర్ధారణలో తేలింది. ఈ ఎఫెక్ట్ వల్ల మొత్తంగా 15 చోట్ల కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసి అధికారులు లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ణ‌య దోషాలు, జ‌నాల స్వ‌యం కృతాప‌రాధంతో మొత్తం స‌మాజం ప్ర‌మాదంలో ప‌డిపోతోంది. జ‌నాల తీరు మార‌కుంటే ఆ దేవుడు కూడా మ‌న‌ల్ని కాపాడ‌లేడ‌న్న‌ది నిష్టూర స‌త్యం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: