ఎప్పటి నుంచో మీడియా రంగం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కోలుకోలేని విధంగా అనే సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా న్యూస్ ఛానల్స్, పత్రికలు అనేకం ఈ రంగంలో అడుగుపెట్టాయి. కొత్తగా మరెన్నో సంస్థలు మీడియా రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి మీడియా రంగం పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. సుదీర్ఘకాలంగా లాక్ డౌన్ విధించడంతో వర్తక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. దీంతో మీడియా రంగానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ప్రకటనలు పూర్తిగా తగ్గిపోవడంతో, మీడియా రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. కనీసం ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో చాలా మీడియా చానళ్లు, పత్రికలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని పత్రికలు, చానెళ్లు పూర్తిగా మూతపడగా, మరికొన్ని పరిమిత సంఖ్యలో పత్రికలను ముద్రిస్తూ, తమకు ఆర్థిక భారంగా ఉన్న ఉద్యోగులను తప్పిస్తున్నాయి. పూర్తిగా అన్ని మీడియా సంస్థలు పొదుపు చర్యలకు దిగాయి. 

 

IHG

 

జాతీయస్థాయిలో ఈ ప్రభావం అంతగా కనిపించకపోయినా, తెలుగు మీడియాలో మాత్రం ఈ సంక్షోభం ఎక్కువగా కనిపిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా... తెలుగు మీడియా చానల్స్ పత్రికల్లో ఉద్యోగులను తొలగించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తుండగా, మరికొన్ని ఉద్యోగస్తుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవ్వడంతో, ఈ వ్యవహారంతో తమ మీడియా పరువు బజారున పడే అవకాశం ఉండటంతో, చాలా పత్రికలు, ఛానళ్లు వేచి చూస్తూ వస్తున్నాయి. అయితే అటువంటి మీడియా యాజమాన్యాలకు ఇప్పుడు కరోనా వరంగా మారింది. కరోనా సంక్షోభం పేరు చెప్పి ఎడా పెడా, ఉద్యోగుల ను తప్పించే పనిలో పడ్డాయి. చిన్నా,చితకా ఛానళ్లు పత్రికలతో పాటు , అగ్రస్థానంలో ఆదాయపరంగా ఎటువంటి లోటు పాట్లు లేని సంస్థలు సైతం ఉద్యోగుల తొలగింపునకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కరోనా సంక్షోభం పేరు చెప్పి తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి.

 

IHG

 

 ఈ విషయంలో దమ్మున్న పత్రిక, చానల్ గా  తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్న ఓ ప్రధాన మీడియా కూడా ఇప్పటి కే తమ ఉద్యోగులను 50 శాతం వరకు తగ్గించి మిగిలిన ఉద్యోగుల జీతాలు 20 శాతం వరకు కోత పెట్టినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ప్రకటనల పేరుతో భారీగా ఆదాయం సంపాదించుకున్న సదరు పత్రిక, ఛానల్ ఇప్పుడు కరోనా ప్రభావాన్ని చూపించి ఒక్క నెల కూడా ఉద్యోగులను భరించకుండా సంక్షోభం పేరుతో ఉద్యోగులను తొలిగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఏపీ ప్రభుత్వంపై తరచుగా విమర్శలు చేస్తూ ఎల్లో మీడియా గా పేరు సంపాదించుకున్న మరో ఛానల్ కూడా తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు 50 శాతం కోత విధించడమే కాక, వాటిలో టాక్స్ ల పేరుతో మరికొంత కోత విధించినట్లు ఉద్యోగులు మండిపడుతున్నారు. 

 

IHG

అలాగే జనసేన మద్దతుదారుగా పేరు పొందిన మరో ఛానల్ లో మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదట. దీంతో యాజమాన్యం వైఖరిపై ఉద్యోగులు ఆఫీసు కార్యాలయాల్లోనే ధర్నాలు చేసినా ఫలితం కనిపించలేదట. ఇక మీడియా రంగంలో పుష్కలంగా లాభాలు ఉంటాయని ఆశిస్తూ, అడుగు పెట్టిన అనేక సంస్థలు తమ అనుభవ రాహిత్యంతో చేతులు కాల్చుకున్నాయి. ఈ సమయంలో సంస్థలను నడపలేక మూసేద్దామనే ఆలోచనలో ఉన్నవారికి వరంగా మారడంతో కరోనా పేరు చెప్పి ఉద్యోగులను తప్పించడమో, తమ మీడియా సంస్థలను మూసి వేయడం చేస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు కరోనా ప్రభావానికి పూర్తిగా గురవ్వ గా, మరికొన్ని సంస్థలు మాత్రం కరోనా పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్నాయనే  విమర్శలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: