భార‌త్‌లో క‌రోనాకు ఇప్ప‌ట్లో తెర‌ప‌డేట్లు క‌న‌బ‌డ‌ట్లేదు...క‌నుచూపు మేర‌లో క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గ‌మూ క‌న‌బ‌డ‌టం లేదు. రోజురోజుకు ఉధృత‌మ‌వుతున్న క‌రోనా అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. ప్ర‌తి మూడు రోజులకు ఏకంగా ప‌దివేల కొత్త కేసులు న‌మోదవుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇక మ‌ర‌ణాల సంఖ్య కూడా గ‌తంలో క‌న్నా చాలా ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి లాక్‌డౌన్‌తో  కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట ప‌డింద‌నే న‌మ్మ‌కం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ది రోజుల క్రితం వ‌ర‌కు బ‌లంగా న‌మ్మాయి. కానీ రోజులు గ‌డుస్తున్న కొద్దీ క‌రోనా భార‌త్‌పై పంజా విసురుతున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. 


 మార్చి 29వ తేదీన దేశంలోని మొత్తం కేసుల సంఖ్య పది వేలు ఉంటే ఒకటిన్నర నెల రోజుల వ్యవధిలో అదికాస్తా ఆరు రెట్లు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. కొత్త కేసుల సంఖ్య తగ్గుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేసిన వాస్త‌వంలో మ‌రోలా ఉంది.   ప్రతీరోజు సగటున మూడున్నర వేల చొప్పున కొత్త కేసులు పుడుతూనే ఉన్నాయి.  ఇప్ప‌టికే అత్య‌ధిక కేసులు న‌మోదైన దేశాల్లో టాప్‌టెన్‌లో భార‌త్ ఉంది. మ‌రో వారం రోజుల్లోపే టాప్ 5లోకి భార‌త్ రావ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోనే  కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

 

ఏప్రిల్ 22వ తేదీ నాటికి ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 20 వేల మార్కుకు చేరుకుంది. అయితే మ‌రో పదివేల కేసులు పెర‌గ‌డానికి అంటే 30 వేల మార్కు చేరుకోడానికి కేవ‌లం ఆరు రోజులే ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అయితే ఇప్పుడు 10వేల కొత్త కేసులు న‌మోదు కావ‌డానికి కేవలం మూడు రోజులే ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. న‌మోద‌వుతున్న కేసుల్లో  మహారాష్ట్ర, తమిళనాడు, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌వే అధికంగా ఉంటున్నాయి.  ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: