జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పచ్చ బ్యాచ్ సరికొత్త విష ప్రచారానికి తెరలేపింది. పేదలకు ఇళ్ళ స్ధలాలను ఇవ్వటానికి ఒకవైపు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటో మరో వైపు ప్రభుత్వ ప్రయత్నాలను తెలుగుదేశంపార్టీ అడ్డుకుంటోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న మార్గాలను ఉపయోగిస్తోంది. తాజగా కాకినాడలో మడ అడవులను నరికేసి పేదలకు ఇళ్ళ స్ధలాలను ఇస్తోందంటూ వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు అండ్ కో విషప్రచారం మొదలుపెట్టేశారు.

 

తన ట్విట్టర్ ఖాతా నుండి చంద్రబాబు ప్రచారాన్ని మరింత స్పీడ పెంచాడు.  శాటిలైట్ ఫొటోలంటూ తన ఖాతాలో పోస్టు చేశాడు. ఆ ఫొటోలో  ఒకవైపు మడ అడవులు మరోవైపు భూమిని చదును చేస్తున్న దృశ్యం కనబడుతోంది. అంటే మడ అడవులను నరికేసి భూమిని వైసిపి ప్రభుత్వం చదును చేస్తోందంటూ ఆరోపణలు మొదలుపెట్టాడు. ఈ మడ అడవులను నరికేయటం వల్ల తుపానులు వస్తే కాకినాడ నగరానికి చాలా ప్రమాదమని గోల చేసేస్తున్నాడు.

 

తుపానుల నుండి కాకినాడను రక్షించటానికి మడ అడవులు ఓ రక్షణ కవచమంటూ ఊదరగొడుతున్నాడు. వీటిని నరికేయటం వల్ల తుపానులు వస్తే జనాల ప్రాణాలకు రక్షణ ఎవరు కల్పిస్తారంటూ యాగీ చేసేస్తున్నాడు. అయితే ఇదే పాయింట్లో వైసిపి నేతలు చంద్రబాబు, టిడిపి పై ఎదురు దాడి మొదలుపెట్టారు. కాకినాడ నగరంలో పేదలకు ఇళ్ళ పట్టాలు ప్రాంతానికి మడ అడవులకు మధ్య 16 కిలోమీటర్ల దూరం ఉందంటున్నారు.

 

అసలు మడ అడవులను నరికేసి పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చే ఆలోచనే ప్రభుత్వానికి లేదని మొత్తుకుంటున్నారు. ఇంకెక్కడివో మడ అడవుల ఫొటోను గూగుల్ మ్యాప్స్ లో తీసేసి దాన్ని పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చే ప్రాంతానికి జతచేసి చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నట్లు అధికార పార్టీ మండిపడుతోంది. ప్రభుత్వం చేయాలని అనుకుంటున్న ప్రతి కార్యక్రమానికీ టిడిపి ఏదో ఓ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపోతున్నారు. ఇపుడు చేస్తున్న ప్రయత్నం కూడా కుట్రలో ఓ భాగమేనంటూ వైసిపి నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు.

తుపానుల నుండి కాకినాడ నగరాన్ని రక్షించేది మడ అడవులు కాదని హోప్ ఐల్యాండ్ అని అంటున్నారు. ఈ ఐల్యాండ్ కాకినాడ నగరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో సముద్రంలోపలకు ఉంటుంది. దాదాపు నాలుగు కిలోమీటర్ల వ్యాసార్ధంలో విస్తరించిన ఈ హోప్ ఐల్యాండ్ నిజంగానే కాకినాడకు రక్షణ కవచమనే చెప్పాలి. మరి తాజాగా చంద్రబాబు మొదలుపెట్టిన కొత్త గోల ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: