ఆక‌లి తీరితే చాల‌నుకునే ఆఫ్రికా దేశాల్లో పోష‌కాహారం గురించి మాట్లాడేవారు బ‌హు త‌క్కువ‌. ఆఫ్రికా ఖండంలోని చిన్న‌చిన్న దేశాలకు ఇప్పుడు క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొవ‌డం అన్న‌ది అతిపెద్ద స‌వాల్‌గా మారింది. ఆ మాటకొస్తే ఆఫ్రికా దేశాలే కాదు...అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు కూడా పోషకాహారం లోపంతో బాధ‌ప‌డుతున్నాయి. భార‌త్ కూడా ఆ జాబితాలో ఉంది. అయితే గ‌డిచిన ద‌శాబ్ద‌కాలంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న కొన్ని చ‌ర్య‌ల వ‌ల్ల‌, ఆర్థికాభివృద్దితో పాటు త‌ల‌స‌రి ఆదాయంలో పెరుగుద‌ల‌, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవ‌కాశాలు వంటి ఎన్నో అంశాలు భార‌త్‌ను బీద దేశాల‌క‌న్నా ఓ నాలుగైదు మెట్లు పై స్థాయిలో నిలిపాయ‌నే చెప్పాలి.

 

భార‌త్‌కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌,నేపాల్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్ వంటి దేశాలు తీవ్ర పోష‌కాహార లోపాన్ని ఎదుర్కొంటున్నాయి. క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొవ‌డానికి ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెంపొందించుకోక త‌ప్ప‌ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషక విలువలు లేవంటూ మంగళవారం నాడు ‘2020 గ్లోబల్‌ న్యూట్రిషన్‌ రిపోర్ట్‌’ నివేదిక వెల‌వ‌డ‌టం ప్రాధాన్యం సంత‌రించుకుంది.  ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తూ ఆకలి దప్పులను మ‌రింత పెంచాయ‌ని ఈ నివేదిక‌లో పేర్కొంది. అయితే ఇక్క‌డ ప్ర‌భుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణ‌యాన్ని త‌ప్పు బ‌ట్ట‌లేదు.

 


అయితే ఆయా దేశాలు అనుస‌రిస్తున్న ఆహార, పోషాకాహార విధానాల‌ను మాత్రం ఈ నివేదిక ఎండ‌గ‌ట్టింద‌నే చెప్పాలి. పిల్లలే కాకుండా పెద్దలు తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషక విలువలు లేక పోవడం వల్ల వారు అనారోగ్యానికి గురవుతున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఆహారంలో పోషక విలువలు పడిపోవడానికి ఆర్థిక సమస్యే ఒక్కటే కాకుండా ‘ప్రాసెస్డ్‌ ఫుడ్‌’, వ్యవసాయ సాగులో వచ్చిన మార్పులు కూడా కారణమని  నివేదిక వెల్ల‌డించింది.  ప్ర‌పంచ దేశాల్లో  82 కోట్ల మంది అంటే ప్రతి 9 మందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్న‌ట్లు పేర్కొంది. విచిత్రంగా పేద దేశాలతోపాటు ధనిక దేశాలు కూడా ఆహారంలో పోషక విలువలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో  ప్రజలు అనారోగ్యం పాల‌వుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: