తెలుగు ప‌త్రిక‌లు ఎంత మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌బోతున్న  ఇటీవ‌ల  విడుద‌లైన ఐఆర్ ఎస్ నివేదిక మాత్రం ప‌త్రిక‌ల ప‌త‌నాన్ని, వాటిపై  పాఠ‌క‌లోకం చూపుతున్న  ఏవ‌గింపును లెక్క‌ల‌తో స‌హ విడ‌మ‌రిచి చెబుతోంది. తాజా ఐఆర్ఎస్ వివరాలను పరిశీలిస్తే  తెలుగునాట ప్ర‌ధాన ప‌త్రిక‌లుగా భావిస్తున్న ఈనాడు, సాక్షి, ఆంధ్ర‌జ్యోతి, న‌మ‌స్తే తెలంగాణ రీడ‌ర్‌షిప్ దారుణంగా ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఆంధ్ర‌జ్యోతి, న‌మ‌స్తే తెలంగాణ రీడ‌ర్‌షిప్ మూడు నెల‌ల‌కు ముందు కంటే  స‌గానికి పైగా ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి రీడ‌ర్‌షిప్ ఆధారంగానే కార్పోరోట్ యాడ్స్ వ‌స్తుంటాయి.

 

 ఏప‌త్రిక‌కైనా హైద‌రాబాద్‌కు చెందిన యాడ్స్ ఎంతో కీల‌కమ‌ని చెప్పాలి. గ‌డిచిన కొద్దికాలాన్ని ప‌రిశీలిస్తే అన్ని ప్ర‌ధాన ప‌త్రిక‌ల‌కు యాడ్స్ త‌గ్గిపోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆయా ప్ర‌ధాన ప‌త్రిక‌ల రీడ‌ర్‌షిప్ త‌గ్గిన‌ట్లుగా స‌ద‌రు సంస్థ‌లు గుర్తించ‌డ‌మే కార‌ణం. ఇదిలా ఉండ‌గా కొద్దిరోజులుగా లాక్‌డౌన్ నేప‌థ్యంలోనే సంస్థ‌ల ఉద్యోగులను, పేజీల సంఖ్య‌ను త‌గ్గిస్తున్న‌ట్లుగా చెబుతున్న ప‌త్రికా యాజ‌మాన్యాలు..వాస్త‌వానికి గ‌తంలో కూడా ఇదే చర్చ‌ను ఆరంభించిన విష‌యాన్ని ఇప్పుడు విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. మునుప‌టిలా కాకుండా ప‌త్రిక తీరుతెన్నుల‌పై,  వ‌డ్డీవారుస్తున్న క‌థ‌నాల‌పై సామాన్య జ‌నం విశ్లేష‌ణ చేస్తుండ‌టంతో వీటి అస‌లు రంగు, రుచి, వాస‌న బ‌య‌ట‌ప‌డుతున్నాయి. 

 

ఇదిలా ఉండ‌గా ఐఆర్ ఎస్ ప్ర‌క‌టించిన రేటింగ్‌ల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి.  ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌కు గ‌తంలో 23. 39 ల‌క్ష‌ల‌మంది రీడ‌ర్ షిప్ ఉండ‌గా తాజాగా ప్ర‌క‌టించిన లెక్క‌ల ప్ర‌కారం..15.25 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు మూడోవంతుకు చేరుకుంద‌న్న‌మాట‌. ఇక న‌మ‌స్తే తెలంగాణ విష‌యం కూడా దాదాపు అలాగే ఉంది. ఈ నాడు విష‌యానికి వ‌స్తే గ‌తంలో 70.ల‌క్ష‌ల‌కు పైగా ఉన్న రీడ‌ర్‌షిప్ 50ల‌క్ష‌ల‌కు ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇక సాక్షి గ‌తంలో 40ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న రీడ‌ర్‌షిప్ ప్ర‌స్తుతం 30ల‌క్ష‌ల‌కు ప‌డిపోయిన‌ట్లు స‌మాచారం. ఇలా తెలుగు పత్రికలు పాఠకుల ఆదరణ కోల్పోతుండ‌టంతో వాటి ఉనికికే ప్ర‌మాదంగా ప‌రిణ‌మించింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: