సమాజంలోని ప్రధాన వ్యవస్ధల్లో ఏదైనా ఫెయిలైతే ప్రత్యామ్నాయంగా మరోవ్యవస్ధ పుట్టుకొస్తుందనటంలో సందేహం లేదు. ఇపుడు ఏపిలో అలాంటి ప్రత్యామ్నాయ వ్యవస్ధే పుట్టుకొచ్చింది.  ఇంతకీ విషయం ఏమిటంటే సోషల్ మీడియా విస్తృతి గురించే.  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు+మీడియా కలిసిపోయి చాలా కాలమైంది. రాష్ట్రంలోని మెజారిటి మీడియా చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద పదే పదే బురదచల్లుడు రాజకీయం చేస్తోంది మీడియా కూడా.

 

ఎప్పుడైతే మెయిన్ మీడియా దాని బాధ్యతల్లో ఫెయిలైందో ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా పుట్టుకొచ్చింది.   తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపిలో సోషల్ మీడియా చాలా కాలం క్రితమే ఊపిరిపోసుకుంది. కాకపోతే రాజకీయాల్లోకి యాక్టివ్ పార్ట్ తీసుకోవటం మాత్రం 2014 నుండే  అనుకోవచ్చు.  

 

అప్పటి ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావటంలో టిడిపి తరపున పనిచేసిన సోషల్ మీడియాది కూడా కీలక పాత్రగానే చెప్పుకోవాలి. అయితే చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఎందుకనో సోషల్ మీడియాను నిర్లక్ష్యం చేశాడు. సరిగ్గా అక్కడే వైసిపి తరపున సోషల్ మీడియా విభాగం స్పీడందుకుంది. అప్పడందుకున్న స్పీడు ఇంకా కంటిన్యు అవుతోంది.  ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు వైసిపి తరపున పని చేస్తున్న సోషల్ మీడియానే గట్టి జవాబు చెబుతోంది.

 

నిజానికి జగన్  ప్రత్యర్ధులను ఎదుర్కోవటంలో సాక్షి మీడియాకన్నా  వైసిపి  సోషల్ మీడియా చూపిస్తున్న దూకుడే  చాలా ఎక్కువగా ఉండనటంలో సందేహమే లేదు.  తాజాగా ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీనే ఉదాహరణగా తీసుకుందాం. గ్యాస్ లీకేజీ విషయంలో చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా, పవన్ కల్యాణ్, వామపక్షాల నేతలు జగన్ పై ఆరోపణలు మొదలుపెట్టారు. వాళ్ళ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వటంలో వైసిపి సోషల్ మీడియా యమా స్పీడుగా ఉంది.

 

చంద్రబాబు హయాంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం, తర్వాత అది సద్దుమణిగిన తీరు, తర్వాత విస్తరణకు అనుమతులు ఇచ్చిన వివరాలను జీవోలతో సహా సోషల్ మీడియా జనాలముందుంచింది. అలాగే చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాలు, అప్పట్లో ప్రకటించిన నష్టపరిహారం తదితర వివరాలన్నింటినీ సర్కాస్టిక్ గా సోషల్ మీడియాలో కొల్లలు కొల్లలుగా ప్రత్యక్ష మవుతున్నాయి. చంద్రబాబు అండ్ కో జగన్ పై చేస్తున్న ఆరోపణల్లోని డొల్లతనాన్ని సోషల్ మీడియానే జనాలకు అందిస్తోంది. దాంతో చంద్రబాబు, ఎల్లోమీడియా ఎంతగా గొంతు చించుకుంటున్నా ఉపయోగం కనబడటం లేదు.

 

చైనాకు చైనా వాల్ రక్షణగా ఎలా నిలబడుతోందో జగన్ కు రక్షణగా వైసిపి సోషల్ మీడియా అలా అండగా ఉంటోంది.  జగన్ పై  ప్రత్యర్ధులు ఒక్క ఆరోపణ, విమర్శ చేయటం ఆలస్యం దానికి కౌంటర్ గా ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది ? దానికి బాధ్యులెవరు ? లాంటి వివరాలను జనాలకు కళ్ళకు కట్టినట్లు ఆడిమో, వీడియోలు, జీవోలు, అప్పటి పేపర్ కట్టింగులతో సహా సోషల్ మీడియాను ముంచెత్తుతోంది. వైసిపి తరపున ప్రెస్ మీట్లు పెడుతున్న మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు కూడా సోషల్ మీడియాలోని మెటీరియలే వాడుకుంటున్నారంటే జగన్ ను సోషల్ మీడియా ఎంతగా కాపు కాస్తోందో అర్ధమైపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: