టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం పైనా, ఆయన ఆరోగ్య పరిస్థితి పైన అందరిలోనూ అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కొద్ది రోజులుగా చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరే కారణం.  అలాగే చంద్రబాబు చేస్తున్న విమర్శలు, ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ చూస్తే అందరికీ ఇదే అనుమానం కలుగుతోంది. చంద్రబాబు గతం కంటే ఇప్పుడు చేస్తున్న విమర్శలు గందరగోళంగా మారాయి. ఒకవైపు ఏపీ అధికార పార్టీ వైసిపి ప్రజాక్షేత్రంలో దూసుకుపోతూ, రోజురోజుకు ప్రజాదరణ పొందుతోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నిస్తేజం అలుముకుని పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టకుండా కేవలం ఉన్నామా లేదా అన్నట్టుగా వ్యవహరిస్తుండడం, గత ప్రభుత్వంలో కీలక పదవులు పొందిన వారంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని  చేరిపోవడం, మాజీ మంత్రులు , ఎమ్యెల్యేలు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తుండడం, ఇవన్నీ చంద్రబాబుకు మింగుడుపడని అంశాలుగా మారాయి.  మరోవైపు తన రాజకీయ వారసుడైన నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు పైన చంద్రబాబుకు ఆందోళనగానే ఉంది.

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CM' target='_blank' title='cm-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cm</a> N <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CBN' target='_blank' title='chandrababu naidu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>chandrababu naidu</a> Vs <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MINISTER' target='_blank' title='minister-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>minister</a> Nara Lokesh


 తాను ఇప్పుడు కాకపోయినా, మరికొద్ది సంవత్సరాల్లో అయినా రాజకీయంగా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని, అప్పటిలోగా కొడుకును సమర్ధవంతమైన నాయకుడిగా ప్రజల ముందు నిలబెట్టాలనేది చంద్రబాబు ప్లాన్.  అయితే దానికి అనుగుణంగా లోకేష్ వ్యవహరించ లేకపోవడం, రాజకీయంగా బలం పుంజుకునే విధంగా చేయలేకపోవడం,  ఇక ప్రజల్లోనూ, సొంత పార్టీ నాయకుల్లోనూ లోకేష్ అసమర్ధుడు అనే  ముద్ర వేయించుకోవడం వంటి కారణాలతో బాబు పడుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. ఇక తాను పూర్తిస్థాయిలో రాజకీయాలు చేద్దామా అంటే అది కూడా సాధ్యం కావడంలేదు.  తనకు చెప్పుకోలేని విధంగా ఆరోగ్య సమస్యలు ఉండడంతో, ఎక్కువగా విశ్రాంతి తీసుకునేందుకు ఆయన ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. 

IHG


ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలవడానికి కొద్దిరోజుల ముందే చంద్రబాబు  హైదరాబాద్ లోని  తన నివాసంలో ఉండిపోయారు.  ఇక కరోనా ప్రభావం మొదలవడంతో అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు.  కొద్ది రోజుల క్రితం విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువు లీక్ అవ్వడం,  కొంత మంది ప్రజలు మరణించడం, అక్కడ తీవ్ర గందరగోళం నెలకొనడంతో చంద్రబాబు ఆ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని మైలేజ్ పొందాలని చూశారు. అయితే విశాఖలో విషవాయువులు ప్రదేశానికి చంద్రబాబు వెళితే, ఆయన అనారోగ్య సమస్యల కారణంగా అంత శ్రేయస్కరం కాదని వైద్యులు సూచించడంతో బాబు వెనక్కి తగ్గారని, కానీ ఆ విషయం ఎక్కడా  బయట పడకుండా, అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రానికి  లేఖ రాసి ఊరుకున్నారు. 


కానీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను అనుమతి కోరేందుకు ప్రయత్నించకపోవడంతో చంద్రబాబు కావాలనే ఇలా అనుమతి పేరుతో నాటకాలు ఆడుతున్నారనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. ఇక ప్రస్తుతం చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసమే విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్య ఇవ్వడం, ఇంటి నుంచే లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తూ ఉండడంతో జనాల్లోనూ సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు చంద్రబాబు ఏ విషయంపైనా అయినా, క్షేత్ర స్థాయిలో పోరాటం చేసేందుకు ముందుండేవారు.  కానీ దానికి భిన్నంగా చంద్రబాబు ఎప్పుడూ లేని విధంగా ప్రతి విషయం పైన లేఖలు రాస్తూ...  కాలక్షేపం చేస్తుండటంపై  వైసిపి నాయకులు సెటైర్లు వేస్తున్నారు. అయితే బాబు రాసిన లేఖలకు స్పందన రాకపోయినా బాబు మాత్రం లేఖలు రాస్తూనే కాలక్షేపం చేస్తున్నారు. 


 అసలు చంద్రబాబు లేఖలు రాసే వరకు పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నారనే వాదనలు కూడా మొదలయ్యాయి.  నాయకుడు అంటే యుద్ధభూమిలో శత్రువు మీద పోరాటం చెయ్యాలి  కానీ ఇలా యుద్ధభూమి నుంచి తప్పుకుని లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తుండడం చూస్తుంటే బాబు ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్లాన్ లో ఉన్నారనే అనుమానాలు వైసిపి నాయకులు సైతం వ్యక్తం చేస్తున్నారు.  ప్రతి విషయంపైనా  చంద్రబాబు ప్రధానికి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ తన ఉనికిని చాటుకుంటున్నారు అని, విశాఖ వంటి ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉన్నా,  వెనుకంజ వేస్తున్నారని,  ఆయన రాజకీయాల్లో ఇక ఎంతో కాలం యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేదనే వాదనను కూడా తెరపైకి తెస్తున్నారు.  దానికి బలం చేకూర్చే విధంగా చంద్రబాబు వ్యవహారశైలి ఉండటం చూస్తుంటే ఇది నిజమే అన్న భావన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో సైతం కలుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: