చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచదేశాలు ఎంతగా అల్లాడిపోతున్నాయో అందరూ చూస్తున్నదే.  కరోనా వైరస్ దెబ్బకు మిగిలిన దేశాలు వేరు అమెరికా వేరన్నట్లుగా తయారైంది పరిస్ధితి. మళ్ళీ అమెరికాలో మిగిలిన రాష్ట్రాల పరిస్ధితి వేరు న్యూయార్క్ స్టేట్ పరిస్ధితి వేరున్నట్లుగా తయారైంది పరిస్ధితులు. అమెరికా మొత్తం మీద దాదాపు 12 లక్షల మంది బాధితులు, 85 వేలమంది చనిపోయారు.

 

అగ్రరాజ్యం మొత్తం మీద బాధితులు, మృతుల సంగతి ఎలాగున్నా న్యూమార్క్ లో మాత్రం 2.5 లక్షల మంది బాధితులు, 20 వేల మంది మృతులపై కథనాలు బాగా హైలైట్ అయ్యాయి.  ఇలాగే తయారైంది మహారాష్ట్రలోని పరిస్ధితి.  దేశం మొత్తం మీద సుమారు 79 వేలమంది బాధితులు రిజస్టర్ అయితే 2549 మంది మరణించారు.   మిగిలిన రాష్ట్రాల సంగతిని పక్కన పెట్టేస్తే  ఒక్క  మహారాష్ట్రలో మాత్రమే  26 వేలమంది బాధితులుంటే సుమారు వెయ్యిమంది చనిపోయారు.

 

ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఏపి, కేరళ తదితర రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య బాగానే పెరుగుతోంది. మొదటి నుండి కూడా మహారాష్ట్రలో కేసుల ఉధృతి ఎక్కువగానే నమోదవుతోంది. మహారాష్ట్ర మొత్తం మీద ఎక్కువ కేసులు నమోదవుతున్నది మళ్ళీ ముంబాయ్ నగరంలోనే కావటం గమనార్హం. ముంబాయ్ లోనే ఎక్కువ కేసులు ఎందుకు నమోదవుతున్నాయంటే ధారావి మురికి వాడే కారణమని చెప్పాలి.

 

మొదట్లో ముంబాయ్ సిటిలో కేసుల స్పీడు తక్కువగానే ఉండేది. ఎప్పుడైతే ధారావిలో పాజిటివ్ కేసులు మొదలయ్యాయో సిటిలో ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎందుకంటే ధారావి మురికివాడ అన్నది ఏషియాలోనే అతిపెద్ద మురికివాడగా ప్రచారంలో ఉంది. ఇక్కడ సుమారు 15 లక్షల మంది నివసిస్తున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించటమన్నది ఇక్కడ సాధ్యం కాదు. ఎందుకంటే ఈ మురికివాడలోనే వ్యాపారాలు జరుగుతుంటాయి, రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఉన్నాయి. 24 గంటలూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది కాబట్టే రాష్ట్రంలో వేలాది కేసులు నమోదవుతున్నాయి.

 

ఒక్క ధారావి మురికివాడ దెబ్బకు మొత్తం రాష్ట్రమంతా వణికిపోతోంది. ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వైరస్ సోకకూడదన్న ఉద్దేశ్యంతోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వం కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాయి. ధారావి మొత్తాన్ని లాక్ డౌన్లో ఉంచేశాయి ప్రభుత్వాలు. మరి ఎన్ని రోజులు లాక్ డౌన్లో ఉంచటం సాధ్యమవుతుందో చూడాల్సిందే. ఎందుకంటే లాక్ డౌన్ ఎత్తేయాలంటూ ఇప్పటికే గొడవలు మొదలయ్యాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: