నేటితో అమరావతి ఉద్యమానికి 150 రోజులు 


ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అంటూ గత టిడిపి ప్రభుత్వంలో అమరావతి ప్రాంతానికి హైప్ పెంచారు. అక్కడ రాజధాని కట్టడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉండబోతున్నాయని జనాలను నమ్మించారు. ఆ పరిసర ప్రాంతాల్లో భూములను పెద్ద ఎత్తున రైతుల నుంచి తీసుకున్నారు. ప్రపంచ స్థాయి నగరాలకు ధీటుగా అమరావతి ఉండబోతుంది అంటూ రకరకాల గ్రాఫిక్స్ నమూనాలను చూపించారు. వివిధ దేశాల రాజధానులు నిర్మాణ నమూనాలను లెక్కలోకి తీసుకున్నారు. దీనికోసం భారీ ఎత్తున సొమ్ములు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టారు. ఐదేళ్ల పరిపాలన కాలంలో మొత్తం గ్రాఫిక్స్ లోనే రాజధాని నిర్మాణం టిడిపి ప్రభుత్వం పూర్తి చేసింది. ఆ ఐదేళ్ళ పాటు అక్కడ హడావుడి చేయడం తప్ప శాశ్వత రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు ఏవీ చేపట్టకుండా, కేవలం తాత్కాలిక బిల్డింగుల నిర్మాణం వరకే పరిమితం చేశారు. వాస్తవంలోకి వచ్చేసరికి అక్కడ జరిగిన పనులేమీ లేవు.

 

IHG

 

కేవలం గ్రాఫిక్స్ నమూనాలతో హడావిడి తప్ప ఐదేళ్ల పరిపాలన కాలంలో అమరావతిలో చేసిందేమి కనిపించలేదు. ఐదేళ్ల కాలం మొత్తం నమూనాలతోనే సరిపెట్టేసారు. కానీ మీడియాలో మాత్రం అమరావతి లో ఏదో భారీ ఎత్తున అభివృద్ధి జరగబోతోంది అన్నట్లుగా హైప్ క్రియేట్ చేశారు. సీన్ కట్ చేస్తే అక్కడ గత టిడిపి ప్రభుత్వంలో చేసిందేమి కనిపించలేదు. అయితే అక్కడ ఏదో అభివృద్ధి జరిగిపోయింది అన్నట్టుగా అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అంతేకాకుండా అనేక అంతర్జాతీయ సంస్థలు ఏపీ లోకి వచ్చేందుకు క్యూ కడుతున్నాయి అన్నట్లుగా హడావిడి జరిగింది. ఇక అక్కడితో ఈ వ్యవహారం ఆగలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. 

IHG


అమరావతి వ్యవహారం పూర్తిగా సందిగ్ధంలో పడింది. టిడిపి అధికారంలో ఉండగా అమరావతి వ్యవహారంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, వైసిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. రాజధాని పేరు చెప్పి పేద, దళిత రైతుల దగ్గర నుంచి అన్యాయంగా భూములు లాక్కున్నారు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అనే ప్రతిపాదనను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రభుత్వంలోని పెద్దలు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని, అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసేందుకు టిడిపి ప్రభుత్వం ప్రయత్నించిందని, రియల్ ఎస్టేట్ చేసే ఉద్దేశంతోనే అమరావతి ని తెరమీదకు తెచ్చింది అని వైసిపి భావించింది. 

 

IHG

అమరావతి రాజధాని అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి 3 రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఇలా మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో అప్పటి నుంచి అమరావతి ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ తెరమీదకు తీసుకు వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ఉద్యమాన్ని ప్రజా సంఘాల ద్వారా తెరమీదకు తీసుకువచ్చారు. రాష్ట్రమంతా IHG గురించి మాట్లాడుకునే విధంగా టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ IHG ప్రారంభించి నేటికీ 150 రోజులు పూర్తయింది.


 ఈ ఉద్యమం సక్సెస్ అయిందా లేక ఫెయిల్ అయిందా అనే విషయంపై చర్చించుకుంటే IHG ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో ఏపీ సీఎం జగన్ 3 రాజధానుల ఆవశ్యకతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. కేవలం అభివృద్ధి మొత్తాన్ని అమరావతి కే పరిమితం చేయకుండా, విశాఖ, కర్నూలు, అమరావతి ఈ మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామంటూ జగన్ చెప్పడం, ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది. అసలు ఎటువంటి నిర్మాణాలు పూర్తి చేసుకొని అమరావతిలో ఇప్పటికిప్పుడు అభివృద్ది పనులు చేపట్టినా, అది పూర్తయ్యేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. అలాగే బిల్డింగుల నిర్మాణానికి మౌలిక సదుపాయాల కల్పనకు లక్షల కోట్లు ఖర్చవుతాయి. 


అయితే ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, జగన్ అమరావతి ని అభివృద్ధి చేసేకంటే, ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే బాగుంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, జగన్ నిర్ణయానికి మద్దతు లభించడంతో IHG కాస్త ఊపు తగ్గింది. కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు, అందులోనూ టిడిపికి చెందిన కేవలం కొద్ది మంది మాత్రమే ఇంకా పదుల సంఖ్యలో అక్కడ నిరసన దీక్షలు చేస్తున్నారు. రెండు నెలలుగా ఏపీలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో అమరావతి వ్యవహారాన్ని ప్రజలు కూడా పూర్తిగా మరిచిపోయారు. దీంతో ఈ ఉద్యమం చల్లారిపోయినట్టుగానే కనిపిస్తోంది.


 గతంలో ఈ ఉద్యమం తారా స్థాయికి చేరినా, ఆ తర్వాత జనాలు కూడా ఆ సంగతి పూర్తిగా మరిచిపోయారు. ఇప్పుడు అసలు IHG కొనసాగుతుంది అనే విషయాన్ని సైతం జనాలు మర్చిపోయారు. గత రెండు నెలలుగా టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ సైతం హైదరాబాద్ కే పరిమితం అయిపోవడంతో, అమరావతి వ్యవహారాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. కేవలం స్థానికంగా ఉన్న కొద్దిమంది మాత్రమే నిరసన దీక్ష పేరుతో హడావుడి చేస్తుండగా, టీడీపీ అనుకూల మీడియా మాత్రం దీనికి పెద్ద ఎత్తున ప్రచారం ప్రచారం కల్పిస్తూ, ఇంకా IHG ప్రజల్లో ఉంది అన్నట్లుగా కథనాలు ప్రచారం చేస్తున్నారు. 


ప్రస్తుత ఏపీ ఆర్ధిక పరిస్థితి, కరోనా సంక్షోభం కారణంగా అమరావతి లో రాజధాని కట్టడం ఆర్ధిక భారం అనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించడంతో అమరావతి ఉద్యమానికి ఉన్న కాస్త ఊపు కూడా తగ్గిపోయింది. 150 రోజులు కాదు, మరో 150 రోజులు ఉద్యమం చేసినా అమరావతి వ్యవహారం ఇక ముగిసిన అధ్యాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: