అసలు న్యూస్ పేపర్ అంటే ఒకప్పుడు మొదటగా ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఈనాడు. ఏదైనా ఒక వార్తా కథనం ఈనాడు పత్రికలో వచ్చింది అంటే దానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జనాలు కూడా ఈనాడులో ఏది రాస్తే అదే నిజమని నమ్మే పరిస్థితి. ఆ పత్రిక యాజమాన్యం అనగా రామోజీరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చెరగని ముద్ర వేయగలిగారు. అంతెందుకు ఈనాడు పత్రిక ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే, ఆ పార్టీ విజయం తప్పక సాధిస్తుంది అని అంతగా ఈనాడు పేరు సంపాదించుకుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అండదండగా ఉంటూ వచ్చిన ఈనాడు మొదట్లో కాస్త న్యూట్రల్ గా ఉన్నట్టుగానే వ్యవహరించింది. అయితే టిడిపి పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చినప్పటి నుంచి ఈనాడు వ్యవహార శైలిలో క్రమ క్రమంగా మార్పులు మొదలయ్యాయి. 

 

IHG

 

తెలుగుదేశం పార్టీ తప్ప ఆంధ్ర ప్రదేశ్ ను ఎవరు పరిపాలించకూడదు అన్నట్టుగా ఈనాడు తన కథనాల ద్వారా పరోక్షంగా జనాలకు చెప్పే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఈనాడు లో వచ్చే కథనాలు ఏకపక్షంగా ఉండడం, పత్రికలో విలువలు తగ్గిపోవడం ఒకే పార్టీ ని భుజాన వేసుకుని మరో పార్టీని ద్వేషిస్తూ వార్తా కథనాలు ఇస్తుండడం, ఇలా ఈనాడు తన పూర్వపు ప్రాధాన్యతను కోల్పోతూ వస్తోంది. ఈ విషయంలో తామేమీ తక్కువ కాదన్నట్టుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా అదే విధంగా కథనాలు మొదటి నుంచి ప్రచురిస్తూ వస్తోంది. ఆ సంస్థ యజమాని రాధాకృష్ణ మరి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతూ ఉండగా, మిగతా అందరిపైనా వ్యతిరేక కథనాలతో విరుచుకు పడుతున్న మొదలైన కారణాలతో ఆంధ్రజ్యోతి పూర్తిగా పాఠకదరణ కోల్పోయింది. ఈ రెండు పత్రికలకు సంబంధించి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ నడుస్తూ వస్తోంది.


 ఇది ఇలా ఉంటే తాజాగా ఇండియన్ రీడర్షిప్ సర్వే 2019 20 ఆఖరి త్రైమాసికానికి సంబంధించిన రిపోర్ట్ ను విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం ఈనాడు పాఠకుల సంఖ్య 82 లక్షల 51 వేలుగా ఉంది. అదే చివరి త్రైమాసికానికి వచ్చేసరికి 63 లక్షల 91 వేలకు అది పడిపోయింది. అంటే 18 లక్షల 60 వేల మంది పాఠకులు ఈనాడు కు ఒకే ఏడాదిలో దూరమయ్యారు.  ఈనాడు అలా పాఠకాదరణ కోల్పోతూ వస్తుండగా సాక్షి మాత్రం ఆ సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. 2019 20 తొలి త్రైమాసికంలో సాక్షి పాఠకుల సంఖ్య 52 లక్షల 38 వేలుగా ఏపీ లో ఉంది. ఆఖరి త్రైమాసికానికి వచ్చేసరికి సాక్షి పాఠకుల సంఖ్య 57 లక్షల 56 వేలకు పెరిగింది. 


ఇక మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతి 2019 20 తొలి త్రైమాసికంలో పాఠకుల సంఖ్య 38 లక్షల 97 వేలు గా ఉంది. 2019 ఇది 20 ఆఖరి త్రైమాసికానికి వచ్చేసరికి అది 30 లక్షలకు పడిపోయింది. అంటే 8 లక్షల మంది పాఠకులు ఆంధ్రజ్యోతికి దూరమయ్యారు. ఇలా చెప్పుకుంటూ వస్తే ఆంధ్రజ్యోతి గ్రాఫ్ దిగజారుతూ వస్తుండడం, ఆ రెండు పత్రికలను పాఠకులు తిరస్కరిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: