ఊరుగాని ఊరు ... రాష్ట్రం కానీ రాష్ట్రం.. భాష తెలియదు. తెలిసిందల్లా రోజంతా కష్టపడడం, దాంతో పొట్టనింపుకోవడం. ఉన్న రాష్ట్రంలో ఉపాధి దొరక్క ఎక్కడో వందలు, వేల కిలోమీటర్ల దూరం వలస పోయిన బతుకుల పాలిట కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ శాపంగా మారింది. అసలు ముందస్తు సమాచారం ఏమీ లేకుండా దేశవ్యాప్తంగా లాక్ వేసి జనాలను ఎక్కడివారిని అక్కడే కట్టిపారేసిన మన ప్రధాని మోదీని కూడా గట్టిగా తిట్టుకోవడానికి లేదు. ఎందుకంటే కరోనా అంతగా కంగారు పెట్టింది. అప్పటికే ప్రపంచ దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ఉన్నదల్లా ఒక్కటే మార్గం కనుక దేశానికే తాళం వేసి ఎక్కడివారిని అక్కడే కట్టిపడేసారు మన ప్రధాని. 'స్టే హోమ్' అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. ఎవరి ఇంట్లో వారు సురక్షితంగా ఉండాలంటూ ప్రచారం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. 

IHG


కానీ తినడానికి తిండి లేక, ఉండేందుకు నిలువ నీడలేని వలస వలస జీవుల కథేంటి ..? వారి సంగతి కేంద్రాలు కానీ, రాష్ట్రాలు కానీ ఎప్పుడు పట్టించుకున్నాయి ? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా నలభై రోజులు దాటినా తరువాత మాత్రమే వారి సంగతి ప్రభుత్వాలకు గుర్తుకు వచ్చాయా ? అది కూడా వలస బతుకుల జీవనం, వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో పడుతున్న ఇబ్బందులు గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవ్వడం, కేంద్రంపై రాష్ట్రాలు ఒత్తిడి తీసుకురావడం ఇలా అన్నీ జరిగిపోయిన తరువాత తీరిగ్గా మేలుకున్న ప్రభుత్వ పాలకులు వారిపై దృష్టిపెట్టారు. 

 

IHG

 

ప్రత్యేకంగా శ్రామిక్ రాళ్లను కొన్నిటిని ఏర్పాటు చేసి తరలింపు చర్యలు మొదలుపెట్టింది. అలా తరలిస్తున్నవారు కేవలం వలస కూలీల్లో ఒక్కశాతమే ఉన్నారు. ఇంకా జాతీయ రహదారులపై ఇప్పుడు ఎక్కడ చుసినా వలస కూలీలే దర్శనం ఇస్తున్నారు. అసలు వలస కూలను ప్రభుత్వం తరలిస్తోందని, దీనికోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి అనే విషయం కూడా తెలియని వారే ఎక్కువ. అసలు ప్రభుత్వం తమ కోసం ఏమి చేస్తుందో కనీస సమాచారం లేని వారు ఎందరో ? నెత్తిమీద లగేజితో ... భుజాలపై పిల్లాపాపలతో నడుస్తూ వందల, వేల కిలోమీటర్ల దూరాన్ని భారంగా రోడ్లపైన నడుస్తున్నారు.. నడుస్తూనే ఉన్నారు ? కొంతమంది నడవలేక అలసి సొలసి మరణించేవారు ఇంకెందరో...! ఆ వలస బతుకులకు ఆసరా ఎక్కడ ? వీరి బతుకులకు భరోసా ఎక్కడ ? 

IHG


- కోట్లాది కూలీలను నడిరోడ్డుపై పడేసింది ఎవరు ...? 
- వందల కిలోమీటర్లు నడిచేలా చేసింది ఎవరు ..? 
- వాళ్ల బతుకులతో బంతాట ఆడుతుంది ఎవరు ..? 
- ఈ వలస కూలీల కష్టాలకు కారకులు ఎవరు ...? 
- ఈ చిన్నారుల రోదనలకు కారకులు ఎవరు ...? 
- ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ..? 
  - ఆన్సర్ ప్లీజ్ మోదీ జీ !  

   

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: