తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్ని రాష్ట్రాల క‌న్నా లాక్‌డౌన్ అమ‌ల్లోకి తీసుకువ‌చ్చి దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన విష‌యం తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం మూడోసారి లాక్‌డౌన్ పొడ‌గింపు ప్ర‌క‌టించ‌డానికి ముందే...ఏకంగా మే 29వ‌ర‌కు తెలంగాణ‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఆ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌నిర్దేశ‌కాల‌ను అతిక్ర‌మించ‌కుండానే  రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌లో అమ‌లు చేయాల్సిన విధానాల‌పై  యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా గ్రీన్‌, ఆరెంజ్‌, జోన్ల‌లో అన‌వ‌స‌ర‌పు నిర్బంధాల కొన‌సాగింపు త‌గ్గించ‌డంతో జ‌న‌జీవ‌నం కాస్త ఉప‌శ‌మ‌నం పొందింది. వ్యాపారుల నుంచి కూడా మంచి స‌హ‌కారం ల‌భిస్తోంది.


 చిరు వ్యాపారులు తేరుకోవ‌డానికి అవ‌కాశం క‌లిగింది. అదే స‌మ‌యంలో రెడ్‌జోన్ల‌లో కూడా తీవ్ర‌మైన ఆంక్ష‌ల‌తో కూడి లాక్‌డౌన్ కొన‌సాగించ‌డం గ‌మ‌నార్హం. ఇక గ్రామీణ వాతావర‌ణంలో సాధార‌ణ స్థితి నెల‌కొంది. వ్య‌వ‌సాయ ప‌నులు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా  ఒక్క జీహెచ్ఎంసీ ప‌రిధి మిన‌హా తెలంగాణ రాష్ట్ర‌మంతా క‌రోనా భ‌యాల నుంచి బ‌య‌ట‌ప‌డుతోంది. గ‌డిచిన ఐదు వారాల్లో రెండు జిల్లాలో మిన‌హా కొత్త కేసులు న‌మోదు కాక‌పోవ‌డం గ‌మనార్హం. నిర్బంధం, ఆంక్ష‌లకు మ‌ధ్య గ‌ల తేడాను స్ప‌ష్టం చేస్తూ రాష్ట్రాన్ని ఓ దారికి తెచ్చిన సీఎంగా ఇప్ప‌టికే కేసీఆర్‌పై అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.


ఇప్పుడు కేసీఆర్ బాట‌లోనే మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, పంజాబ్‌, గుజ‌రాత్ రాష్ట్రాలు వెళ్తుండ‌టం గ‌మ‌నార్హం. లాక్‌డౌన్‌ను మే 31 వ‌ర‌కు పొడ‌గిస్తూ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాలు శ‌నివారమే ప్ర‌క‌ట‌న చేయ‌గా..ఆదివారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశాయి. దేశంలో మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.  ముఖ్యంగా ముంబై మ‌హాన‌గ‌రంలో కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌టంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.  లాక్‌డౌన్‌ను నిబంధ‌న‌ల‌తో కూడిన ఆంక్ష‌ల‌తో అమ‌లు చేస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించాయి. కంటైన్మెంట్ జోన్లలో కఠిన నిబంధనలు అమలు చేస్తామని తెలిపాయి. ఇక పంజాబ్ లో ఈ నెల చివరివరకు లాక్ డౌన్ కొనసాగిస్తామని,  పరిమిత సంఖ్యలో ప్రజారవాణాను పునః ప్రారంభిస్తామని  ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: