పార్టీలోనే చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా నిరసన గళాలు మెల్లిగా లేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికి మూడు సందర్భాల్లో  పెద్ద గొంతులే చంద్రబాబుకు వ్యతిరేకంగా లేచాయి. తొందరలో ఇంకెన్ని గొంతులు లేస్తాయో తెలీదు. అందుకనే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతున్నట్లే అర్ధమవుతోంది. అసలే ఘోర ఓటమితో నానా అవస్తలు పడుతుంటే వ్యతిరేక గళాలు మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లుగా తయారైంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్కీమ్ విషయంలో పార్టీ తరపున ఎవరూ ఎటువంటి ప్రకటనలు చేయవద్దని చంద్రబాబు నేతలందరికీ గట్టిగా హెచ్చరించాడు రెండు రోజుల క్రితం. అయితే కడప జిల్లాలోని పులివెందుల నేత, ఎంఎల్సీ బిటెక్ రవి మాత్రం చంద్రబాబును ఏమాత్రం లెక్క చేయలేదు. పోతిరెడ్డి పాటు విషయంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించాడు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ఎవరికైనా సరే మద్దతు ఇవ్వటానికి తాను రెడీగా ఉన్నట్లు చేసిన ప్రకటన పార్టీలో సంచలనంగా మారింది.

 

మొన్నటికిమొన్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాదం విషయంలో కూడా టిడిపి ఎంఎల్ఏ గణబాబు ప్రభుత్వాన్ని మెచ్చుకున్నాడు బహిరంగంగా. ప్రమాదం విషయంలో శవ రాజకీయాలు చేయాలని చూసిన చంద్రబాబుకు సొంత ఎంఎల్ఏ ప్రకటన షాక్ కొట్టింది. ప్రమాదం జరగ్గానే ప్రభుత్వం స్పందించిన విధానాన్ని ఎంఎల్ఏ అభినందించటంతో చంద్రబాబుకు ఒళ్ళు మండిపోయింది. దాంతో మొదటి రెండు రోజులు నోరు పడిపోయినా తర్వాత తనదైన స్టైల్లో పనికిమాలిన రాజకీయాలకు తెరలేపాడు లేండి.

 

అంతకుముందు అసెంబ్లీలో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు బహిరంగంగా మద్దతు పలికారు. దాంతో విశాఖ అర్బన్ జిల్లా నేతలంతా జగన్ ప్రకటనను స్వాగతిస్తు ఓ తీర్మానం కూడా చేశారు. అప్పట్లో ఆ విషయం పార్టీలో కలకలం రేపింది.  ఒకవైపు చంద్రబాబుతో పాటు కొందరు నేతలు జగన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర నేతలు మాత్రం చంద్రబాబు ఆదేశాలను కాదని జగన్ కే మద్దతు పలకటం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి మింగుడుపడలేదు.

 

అంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే చంద్రబాబుపై మెల్లిగా వ్యతిరేకత బయటపడుతోందని అర్ధమైపోతోంది. ప్రతి విషయంలోను ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే టార్గెట్ గా పెట్టుకోవటంతో చంద్రబాబు, టిడిపి జనాలకు దూరమైపోతోంది.  ఈ విషయం గమనించకుండా చంద్రబాబు ఇంకా భ్రమల్లోనే ఉండటంతో జనాల సెగ నేతలకు తగులుతోంది. దాంతో ప్రజా ప్రయోజనాల విషయంలో చంద్రబాబు టార్గెట్ ఒకలాగుంటే నేతల అభిప్రాయాలు మరోరకంగా ఉన్నాయి. అందుకనే చంద్రబాబు ఆదేశాలను కూడా కాదని తమ సొంతభిప్రాయాలతో నేతలు ముందుకెళుతున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: