ప్ర‌‌శ్నించ‌డ‌మే ప్ర‌ధాన ధ్యేయం..ల‌క్ష్యం అంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్  గ‌త ఐదు మాసాలుగా మౌన‌వ్ర‌తం చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాల‌కు అంటీ ముట్ట‌న‌ట్లుగా ఉంటున్నారు.  ఊసులో లేకుండా పోతే బాగుండ‌ద‌నుకున్నారేమో....భిన్నమైన రాజ‌కీయ విధానాల‌కు తిలోద‌కాలిచ్చి బీజేపీతో చేతులు క‌లిపేశారు. అయితే క్షేత్ర‌స్తాయిలో రెండు పార్టీల మ‌ధ్య పొస‌గ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. జ‌న‌సేన పార్టీ  వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగానే ప‌రిస్థితి ఉంది. ఇలాంటి  ప‌రిస్థితుల‌ను పార్టీని ముందుండి న‌డిపించాల్సి ఉన్నా...పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాల్సి ఉన్నా...ప‌వ‌న్ మాత్రం హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యారు..అవుతున్నారు...ఆద‌ర్శాలు మంచివే...మ‌రీ ఆచ‌ర‌ణ‌కు నోచుకుని ఆద‌ర్శాలు ఎందుకు.. అంటూ రాజ‌కీయ నాయ‌కులు ప‌వ‌న్ వైఖ‌రిని ప్ర‌శ్నిస్తున్నారు.

 


 వాస్త‌వానికి ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి ప‌వ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసింది బ‌హు త‌క్కువ‌నే చెప్పాలి. అడ‌పాద‌డ‌పా అధికార పార్టీని విమ‌ర్శించ‌డం త‌ప్పా...నిజానికి ఆయ‌న ప్ర‌జాప‌యోగ‌క‌ర‌మైన అంశాల‌పై గ‌ట్టిగా మాట్లాడింది లేదంటే ఆశ్చ‌ర్య‌మేమి లేదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు అంటూ...ఏవో కొన్ని డిమాండ్లు చేయ‌డం త‌ప్పా నిజానికి ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే రాజ‌కీయ నిర్ణ‌యాలేవీ జ‌ర‌గ‌డం లేదు. చేగువేరా స్ఫూర్తితో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి..వామ‌ప‌క్షాల‌తో దోస్తి క‌ట్టి... వైసీపీ వ్య‌తిరేకంగా...టీడీపీతో చెలిమిచేస్తూ...బీజేపీతో ఫ్రెండ్ షిప్ చేస్తుండ‌టం ప‌వ‌న్‌కే సాధ్య‌మ‌వుతోంది.ప‌వ‌న్ రాజ‌కీయ నిర్ణ‌యాల‌ను..వేస్తున్న అడుగుల‌ను నిశితంగా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. 

 


రాజ‌కీయాల్లో పొత్తులు, ఎత్తులు మాములే. ప్ర‌జల‌ను ఆక‌ర్షించ‌డానికి స‌వాల‌క్ష వ్యూహాలుంటాయి. అయితే అంతిమంగా ప్ర‌జ‌ల విశ్వాసం పొంద‌డం అన్న‌ది అతిముఖ్య‌మైంది. ప్ర‌జ‌ల విశ్వాసం చూర‌గొన‌నంత కాలం పార్టీ అధ్య‌క్షుడిగా త‌ప్పా...ప‌వ‌న్ ప్ర‌జాప్ర‌తినిధిగా మార‌లేడు అన్న‌ది వాస్త‌వం. కాలం ఎంతో విలువైన‌ది. ఇక ప్ర‌జాజీవితం కొన‌సాగిస్తున్న వారికైతే కాలం విలువ వెల క‌ట్టలేం అనే చెప్పాలి. మ‌రీ ప‌వ‌న్ ఏం చేస్తున్నాడు..ఏం చేశాడు...ఏం చేయ‌బోతున్నాడు.. అస‌లు పార్టీ ప్ర‌ణాళిక ఏంటీ..మేనిఫెస్టోలో పొందు ప‌రుచుకున్న అంశాలేంటి..? వ  పార్టీ నిర్మాణానికి ఆయ‌న తీసుకుంటున్న చ‌ర్య‌లేంటి...క్షేత్ర‌స్థాయిలో పార్టీకి ఉన్న బల‌మెంత అంటే...ఏ ఒక్క స‌మాధానం చెప్ప‌డానికి ఆ పార్టీ ముఖ్య నేత‌లే కాదు...ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చెప్ప‌లేడ‌న్నఅభిప్రాయం రాజ‌కీయ విశ్లేష‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌వ‌న్ వైఖ‌రి చూస్తుంటే రాజ‌కీయాల‌కు మెల్ల‌గా దూరం అవుతున్నారా..? అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్న‌వారు ఉండ‌టం గ‌మ‌నార్హం. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: