ఎల్లోమీడియా, తెలుగుదేశంపార్టీకి  తెలంగాణా సిఎం కేసీయార్ ఒకేసారి గట్టి షాక్ ఇచ్చాడు. రెండు రాష్ట్రాల మధ్య జలజగడం మొదలై కేసీయార్-జగన్ మధ్య మనస్పర్ధలు వస్తాయని లేదా రావాలని ఇటు ఎల్లోమీడియా అటు చంద్రబాబునాయుడు ఎదురు చూస్తున్నట్లుంది. అందుకనే కేసీయార్ గట్టిగానే క్లాసు పీకాడు మీడియా సమావేశంలో. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయమై రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైన విషయం అందరికీ తెలిసిందే.

 

ఇదే విషయమై జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి కేసీయార్ ను ప్రశ్నించాడు. దాంతో  కేసీయార్ గట్టిగానే జవాబిచ్చాడు. ఒకే ప్రశ్నను తిప్పి తిప్పి అడుగటంతో విసిగిపోయిన కేసీయార్ తామిద్దరమూ (కేసీయార్+జగన్) బాగానే ఉన్నామంటూ ఎద్దేవా చేశాడు. మా మధ్య జగడం పెట్టేందుకే నీవు ప్రశ్న అడుగుతున్నట్లు అర్ధమైపోయిందన్నాడు. ’నీవు అనుకున్నట్లు మా మధ్య జగడాలేమీ రావులే.. జగడాలు లేకపోతే కళ్ళు మండుతాయా ’? అంటూ మండిపడ్డాడు.

 

నిజానికి ఎల్లోమీడియా, చంద్రబాబు ఆశిస్తున్నది ఇదే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రెండు రాష్ట్రాలు సఖ్యతగానే ఉన్నాయి. అంతకుముందు ప్రతి చిన్న విషయాన్ని కేసీయార్ తో చంద్రబాబుకు గొడవలే ఉండేవి. పోనీ అంత గొడవలు పడినా చంద్రబాబు ఏమన్నా సాధించాడా అంటే అదీ లేదు. ఓటుకునోటు కేసులో తగులుకున్న దెబ్బకు హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయాడు. ఆ దెబ్బతో  ఏ విషయంలో కూడా కేసీయార్ ను గట్టిగా మాట్లాడేందుకు చంద్రబాబు ధైర్యం కూడా చేయలేదు. వీళ్ళిద్దరి మధ్య గొడవల కోసం ఎదురు చూస్తున్నట్లు విజయసాయిరెడ్డి కూడా ఎదురు చూస్తున్నట్లు ఎద్దేవా చేయటం గమనార్హం.

ఇక ఎల్లోమీడియా అయితే కేసీయార్-జగన్ మధ్య ఎప్పుడెప్పుడు గొడవలు మొదలవుతాయా అన్నట్లుగా ఎదురు చూస్తోంది. వారం వారం రాసే కొత్తపలుకులో ఎప్పుడూ ఇదే గోల. ఇద్దరి మధ్య సఖ్యతను కూడా ఎల్లోమీడియా భరించలేకపోతోంది. వాళ్ళ ఉద్దేశ్యంలో  ఇద్దరు సిఎంలు గొడవలతో విడిపోవాలి, ఏపి నాశనం అయిపోవాలి అంతే. అప్పుడు చంద్రబాబును ఓడించినందకు జనాలకు తగిన శాస్తి జరగాలన్నట్లుగానే ఉంటోంది ఎల్లోమీడియా రాతలు.

 

అలాంటిది పోతిరెడ్డిపాడు అంశంపై ఏపి ప్రభుత్వం విషయంలో కేసీయార్ చాలా సీరియస్ గా మాట్లాడుతాడని దాంతో జగన్ కూడా రెచ్చిపోతే ఇక గొడవలు మొదలైపోతాయని బాగా ఆశించారు. కానీ ప్రెస్ మీట్లో అలాంటిదేమీ జరగకపోవటంతో తీవ్రంగా నిరాసచెందినట్లే ఉన్నారు. అందుకనే తట్టుకోలేక చంద్రబాబు ఇద్దరు సిఎంలు నాటకాలాడుతున్నారంటూ పిచ్చి పోస్టులు పెడుతున్నాడు ట్విట్టర్లో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: