తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత ముందుచూపు గల వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాబోయే ఆపదను కూడా ముందే పసిగట్టి దానికి అనుగుణంగా రాజకీయాన్ని మార్చగల సమర్ధుడు. ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. కెసిఆర్ ఇప్పుడు ఏం మాట్లాడినా దాని వెనుక అర్థం, పరమార్థం తప్పకుండా ఉంటుంది. ఇక విషయానికొస్తే, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రధాన శత్రువుగా బిజెపి మారుతోంది. దీంతో టిఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉంది. అయితే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా, మొన్నటి వరకు కెసిఆర్ కేంద్ర బిజెపి పెద్దలతో సఖ్యత గా ఉన్నారు. పదేపదే కేంద్రాన్ని పొగుడుతూ వస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు విధించడంతో దీనిపై పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలపై కేసీఆర్ తనదైన స్టైల్లో స్పందించారు. 

 

IHG

 

కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారని, ఆయన ముందుచూపు కారణంగానే దేశంలో కరోనా త్వరలోనే కంట్రోల్ అవుతుందని, ప్రధాని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని, కెసిఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు ఎవరైనా ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే, వారిపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడను అంటూ హెచ్చరికలు కూడా చేశారు. అయితే కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో రాష్ట్రాలకు నామమాత్రపు కేటాయింపులు ఉండడం, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఏమీ లేకపోవడం వంటి కారణాలు కేసీఆర్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఇక అప్పటి నుంచి బిజెపి పైన, ప్రధాని మోదీపైనా కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు.

 

IHG'positive' vibes from <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MODI' target='_blank' title='modi- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>modi</a> on wish list - The Hindu


 ప్రజల సమస్యలను పరిష్కరించడంలో  కేంద్రం పూర్తిగా విఫలమైందని, కేంద్రం ముష్టి వేసినట్టుగా రాష్ట్రాలకు నిధులు కేటాయించింది అంటూ మండిపడ్డారు. వాస్తవంగా దేశ వ్యాప్తంగా మొదటి సారి లాక్ డౌన్ నిబంధనలు విధించినప్పుడు కరోనా ను కట్టడి చేసేందుకు అంతకు మించిన మార్గం లేదని, దేశ ప్రజలంతా ఎంత కష్టాన్నయినా భరిస్తూ సంతోషంగా లాక్‌డౌన్‌ మొదటి విడత ను పూర్తి చేశారు. అయితే ఈ నిబంధనలు రోజురోజుకు కేంద్రం పొడిగించుకుంటూనే వస్తుంది. మార్చి 24 వ తేదీ నుంచి ఇప్పటి వరకు లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. ఇక దేశవ్యాప్తంగా లక్ష కు పైగా పాజిటివ్ కేసులు కూడా పెరిగిపోయాయి. 

 

IHG's fight ...


ఇక ప్రజలు చేసేందుకు పని లేక, తినేందుకు తిండిలేక అల్లాడుతున్నారు. ఇక వలస కూలీల బాధ అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉండేందుకు, తినేందుకు, పనిచేసేందుకు అవకాశం లేకపోవడంతో వలస కూలీలు నడక బాట పట్టి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వలస కూలీల బాధల పై జాతీయ, అంతర్జాతీయ స్థాయి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవ్వడం, కరోనా ను కట్టడి చేసే విషయంలోనూ, ప్రజల ఇబ్బందులు, వలస కూలీల బాధను తీర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయం ప్రజల్లో వచ్చేసింది.

 

IHG


 అలాగే కేంద్రం ప్రకటించిన లక్ష కోట్ల బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఇందులో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేకపోవడం వంటివి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. సామాన్య ప్రజలకు కేంద్రం ప్రకటించిన 20 కోట్ల ప్యాకేజ్ ఏ మాత్రం ఉపయోగ పడదని, ఆర్థిక నిపుణులు సైతం తేల్చి చెప్పడం వంటి వాటితో కేంద్రం పూర్తిగా అభాసుపాలైంది. ప్రజల్లో కేంద్రం తీరుపై అసంతృప్తి పెరిగిపోతోంది. జనం నాడిని ముందే పసిగట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక అదే పనిగా కేంద్రం, ప్రధాని మోదీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కరోనా ప్రభావంతో రాష్ట్రం ప్రభుత్వంపై జనాలకు ఆగ్రహం కలగకుండా, ఆ ఆగ్రహాన్ని కేంద్రం వైపు మళ్లించేందుకు కేసీఆర్ ముందుగానే మేల్కొని పదే పదే కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు మొదలుపెట్టారు. 

 


ఇక ఈ విషయంలో తప్పు జరిగింది  అన్నట్లుగా, కేంద్ర బీజేపీ పెద్దలు భావిస్తూ ఉండడంతో కెసిఆర్ మరింతగా బిజెపి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. దీని ద్వారా తెలంగాణలోనూ దూకుడుగా తమపై విమర్శలు చేస్తున్న బీజేపీకి అడ్డుకట్ట వేయడంతోపాటు, కరోనా ప్రభావంతో జనాల్లో ఉన్న ఆగ్రహాన్ని ఈ విధంగా కేంద్రం వైపు మళ్లించేందుకు కేసీఆర్ ఈ విధంగా ఎత్తుగడలు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: