ఘనమైన చరిత్ర మాత్రమే కాదు.. ఘన కీర్తి ఉన్న ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే. ఆ పార్టీ ఓడినా, అధికారంలో ఉన్నా ప్రజల్లో మాత్రం ఎప్పుడూ ఆ పార్టీకి గుర్తింపు ఉంటుంది. దీనికి కారణం ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నట విఖ్యాత నందమూరి తారక రామారావు నే కారణం. ఆయన ఛరిష్మాతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఘనమైన విజయాలను నమోదు చేసుకుని చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆ పార్టీ గెలిచినా, ఓటమి చెందినా జనాల్లో మాత్రం ఏదో ఒకరకమైన సానుభూతీ మాత్రం ఉంటోంది. కానీ ఈ మధ్యకాలంలో ఆ ఉన్న కొద్దిపాటి సానుభూతి జనాల్లో కరువవుతోంది. దీనికి కారణం ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు వైకిరి కారణం అనేది మెజార్టీ ప్రజలు చెబుతున్న మాట. 

 

IHG


అసలు తెలుగుదేశం పార్టీ రెండు కింద ఎప్పుడూ విడిపోయింది. ఎన్టీఆర్ కి ముందు ఆ తరువాత అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిందో అప్పటి నుంచే ఆ పార్టీ కి జనాల్లో క్రమ క్రమం గా ఆదరణ తగ్గడం మొదలయ్యింది. పార్టీ నియమాలు, నిబంధనలు పూర్తిగా మారిపోయాయి. సామాన్యుడి పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ పేరు తెస్తే, చంద్రబాబు హయాం లో ఆ పార్టీ కార్పొరేట్ పంథాలోకి వెళ్ళిపోయింది. పార్టీలో అసమర్థులు, నేరచరిత్ర ఉన్నవారు ఇలా అందరూ చేరి పార్టీ ఇమేజ్ ను దెబ్బతీశారు. పార్టీని ముందుకు నడిపించే విషయంలోనూ చంద్రబాబు అడ్డదారుల్లో వెళ్తూ ఉన్న పేరు కాస్త చెడగొట్టారనే అపవాదు మీద వేసుకున్నారు. 

 

IHG's pullout ...

 

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, మారిన కాలాన్ని బట్టి పార్టీని ముందుకు నడిపించడంలో చంద్రబాబు విఫలం అయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం పాతకాలపు రాజకీయాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తూ చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. అసలు ప్రజలకు ఏం కావాలి ?  ప్రజల ఆలోచనలు ఎలా ఉంది అనే విషయాలను పక్కన పెట్టి పాత తరహాలోనే పార్టీని ముందుకు తీసుకువెళుతున్న తీరు విమర్శలపాలవుతోంది. ప్రస్తుతం ప్రజల ఆలోచనా ధోరణుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రతి పనిలోనూ, చెప్పే విషయాల్లోనూ ప్రజలు పారదర్శకత కోరుకుంటున్నారు. అబద్ధాన్ని ఎంత గట్టిగా ప్రచారం చేసినా, నమ్మే పరిస్థితి లేదు. గతంలో మీడియాను అడ్డం పెట్టుకుని అబద్దాన్ని నిజం చేసే విధంగా వ్యవహరించినా, ఇప్పుడు ఏది నిజం..?  ఏది అబద్దం అనేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇట్టే తెలిసిపోతోంది. అసలు ప్రజల ఆలోచనా ధోరణిని అంచనావేయడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది కాబట్టే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 175 స్థానాలకు గాను 23 సీట్లు మాత్రమే దక్కించుకుంటే, అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలను గెలుచుకుని జెండా ఎగురవేసింది. 

 

IHG


గత ఐదేళ్ల టిడిపి పరిపాలనా కాలంలో ప్రజలకు ఎంతో చేసింది కాబట్టి తప్పకుండా తనకు ఓటు వేస్తారని చంద్రబాబు భావించారు. అయితే అంత చేసినా, ప్రజలకు ఆ ఫలాలు ఎంతవరకు అందాయి అనే విషయాన్ని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పోనీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా లో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి ఏమైనా బాగుందా అంటే  విమర్శల పాలవుతోంది. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు వెళుతున్నాయి..?  ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఏ రూట్ లో వెళ్తుంది..? అనేది చంద్రబాబు పక్కన పెట్టేసి పాత తరహా లోనే విమర్శల రాజకీయాలకు పదును పెట్టి, ప్రజల్లో అధికార పార్టీ పై విమర్శలు చేయించాలని ప్రయత్నిస్తున్నారు. 

 


ఒక వర్గం, ఒక ప్రాంతం ప్రజలు అన్నట్లుగా టిడిపి ముందుకు వెళ్తోంది. ఒకసారి వైసీపీకి రాజకీయ ప్రస్థానాన్ని, టీఆర్ఎస్, బీజేపీ ల రాజకీయ ప్రస్థానామాన్ని పరిశీలిస్తే ఎక్కడ తప్పు చేస్తున్నారు అనే విషయం బాగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చుని అప్పుడే సంవత్సరం గడుస్తోంది. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో తెలుగుదేశం పార్టీ వెనకబడి పోయిందనే చెప్పాలి. తన రాజకీయ వారసుడు లోకేష్ ను ప్రమోట్ చేసుకునేందుకు చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ , పార్టీ భవిష్యత్తు ను ఘనంగా పెట్టేందుకు  ప్రయత్నిస్తున్న తీరు నిజమైన తెలుగుదేశం  పార్టీ అభిమానులను కలవరపెడుతోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: