జగన్ అంటే ఆషామాషీ వ్యక్తి ఏమీ కాదు. ఒక్కసారి తన అనుకున్నాడు అంటే వారికోసం ఎంత వరకు అయినా వెళ్లేందుకు వెనుకాడడు. అలాగే తన ప్రత్యర్థుల విషయంలోనూ అంతే కసిగా ఉంటాడు జగన్. మొదటి నుంచి జగన్ కు ప్రధాన శత్రువులు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకటి టీడీపీ, మరొకటి ఎల్లో మీడియా అనే ముద్ర వేయించుకున్న చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి వెంటాడి వేధిస్తూ వస్తున్న ఈ మీడియాపై జగన్ కు ఉన్న కసి, కోపం అంతా ఇంతా కాదు. తనను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారని, అసలు అధికారంలోకి రాకుండా చేసేందుకు, కడప ఫ్యాక్షనిస్టు అని ఇలా ఎన్నో రకాలుగా ముద్ర వేశారని, అన్నీ తట్టుకుంటూ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో జగన్ మొండి ధైర్యమే జగన్ కు పనికి వచ్చింది. 

 

IHG


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సదరు ఎల్లో మీడియాగా పిలవబడే కొన్ని ఛానెళ్లతో పాటు, సోషల్ మీడియాలోనూ ఒక వర్గం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుండడం జగన్ కు మరింత మంట కలిగిస్తోంది. అందుకే ఇప్పుడు సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది. తమకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తల నుంచి మీడియాలో వ్యతిరేక కథనాలు వండి వచ్చే టీవీ ఛానళ్ల వరకు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా వరుసగా వారిపై కేసులు నమోదు చేస్తోంది. తాజాగా టీవీ5 చైర్మన్ బి ఆర్ నాయుడు, ఛానల్ డిబేట్ ప్రజెంట్ మూర్తి పై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీవీ 5 లో కథనం ప్రచారం అయ్యింది. 

IHG'Mass Leader' of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='andhra pradesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>andhra pradesh</a> | TeluguBulletin.com


 యూనివర్సిటీ పాలక మండళ్ల గురించి ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచారం చేశారు. ఆ వార్తలో ఒక నోట్ ఫైల్ చూపించారు. ఆ నోట్ ఫైల్ రహస్యమైనదని, టీవీ5 దొంగిలించడమో, ఫోర్జరీ చేయడమో జరిగిందని, దీనిపై విచారణ జరపాలని కోరుతూ ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సతీష్ చంద్ర అనే ఉన్నతాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏ 1 గా న్యాయవాది శ్రావణ్ కుమార్, ఏ 2 గా టీవీ 5 చైర్మన్ బి ఆర్ నాయుడు, ఏ 3  గా ఈ వార్తను ప్రజెంట్ చేసిన మూర్తిలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీని కోసం గతంలో మీడియాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 2430 జీవోను ప్రాతిపదికగా తీసుకున్నట్లు సమాచారం.

IHG


 అలాగే సోషల్ మీడియా కథనాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సీరియస్ గానే స్పందిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎల్జీ కంపెనీ లో గ్యాస్ లీకేజీ సంఘటనకు సంబంధించి రంగ నాయకమ్మ అనే మహిళకు కొద్ది రోజుల క్రితం పోలీసులు నోటీసు అందించారు. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది ఇలా ఉండగానే తాజాగా ఉండవల్లి అనూష అనే టిడిపి సోషల్ మీడియా యాక్తివిస్ట్ పైనా ఇదే రకంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఎల్లో మీడియా గా పేర్కొనే కొన్ని ఛానెళ్ల డిబేట్ లో పాల్గొంటూ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులను పోలీసులు టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

IHG


ఎవరైనా మీడియా పేరుతో ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తే, వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 2430 ను చక్కగా ఉపయోగించుకుంటూ వస్తోంది. సోషల్ మీడియా దగ్గర నుంచి అన్ని మీడియాల పైన ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టి తమకు వ్యతిరేకంగా ఉన్నవారందరిలోనూ భయం కల్పించే విధంగా కసరత్తు మొదలు పెట్టింది. ఇదే విషయమై సదరు ఎల్లో మీడియాతో పాటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా,  ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. 

 

అలాగే తమకు మొదటి నుంచి కంటిలో నలుసుగా మారిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. ఇప్పటికే రాధాకృష్ణ కు సంబంధించి వ్యతిరేకంగా సాక్ష్యాలను ప్రభుత్వం సేకరించి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అదును చూసి గట్టి షాక్ ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేసుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: